
మనిషి ఆరోగ్యానికి ఆహరం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరిగా నిద్రపోకుంటే అనేక ప్రతికూలతలతొపాటు, మానసిక, శారీరక అనారోగ్యాలకు దారి తీస్తాయంటున్నారు. కరోనా తర్వాత రోగనిరోధక శక్తి కోసం ఆరోగ్యంగా ఉండటానికి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నారు. కానీ మీలో ఎంత మందికి తెలుసు. సంపూర్ణ ఆరోగ్యానికి నిద్రకూడా ఒక ఆహరం అని. సరిగా నిద్రపోకుంటే అనేక రోగాలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే రోజు రాత్రిలో మనం నిద్రపోయే సమయం ఒక గంట తక్కువ అయినా దాని ప్రభావం నాలుగు రోజుల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో బరువు పెరగటం, అలజడి, మతిమరుపు, తీవ్ర ఒత్తిడి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
నిద్రపై ఏమరుపాటు వద్దు!
నిద్ర పోవడం కేవలం చిన్న సమస్య అని ఏమరపాటు చేస్తే సంపూర్ణ ఆరోగ్యంపైనే ఇది ప్రభావం చూపుతుంది. అందుకే మనిషి తగినంత నిద్ర పోవాలని చెప్తున్నారు. మనం శరీరం నిద్రిస్తున్న సమయంలో అనేక అవయవాలు నిద్రలోకి జారుకుంటాయి. గంటలు తరబడిగా చేస్తున్న పనిని నిద్రతో సేద తీర్చుకుంటాయి. తద్వారా నిద్ర తర్వాతం అవి మరింత ఉత్తేజితమై శక్తివంతంగా పనిచేస్తారు. ఇలా ప్రతి అవయవం శాతివంతంగా పని చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి (ఇమ్మ్యూనిటీ పవర్)పెరుగుతుంది. ఒక మంచి మెరుగైన నిద్ర శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. నిద్రలో ఆ ప్రహేళికలో విషపూరిత పదార్థాలు టాక్సిన్లు శరీరం నుంచి బయటకు వచ్చేస్తాయి. తదుపరి రోజు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అలాంటిది రోజులో గంట నిద్ర తక్కువ పోతే అది అనారోగ్యం బారిన పడవేస్తుందట.
నిద్రలేమితో కళ్ళకు ఎఫెక్ట్!
అయితే సరైన నిద్రపోతే మొదటగా కళ్ళు చాలా నొప్పిగా అవుతాయి. ఎర్రగా మారి వేడిగా అవుతాయి. అంతే కాకుండా కాళ్లు చేతులు మెడలు నొప్పులు పడుతాయి. చాలా మంది రోజులో 8 కంటే ఎక్కువ సేపు పడుకున్నా సరిగా నిద్రపట్టకుంటే.. నిద్ర లేచాక అన్ని అవయవాలు నొప్పులు లేస్తాయి. రోజులో నిద్రపోయేటప్పుడు 3-4 గంటల ధీర్గమైన సూప్తావస్థలోని వెళ్లి నిద్రపోతే అన్ని అవయవాలు, కండరాలు హాయిగా సేద తీరుతాయి. నిద్రలేని వల్ల చేసే పనిపై శ్రద్ద పెట్టలేరు. అలాగే మనసులో అలజడి కారణంగా మతిమరుపు పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవడం వలన చేసే పనులు మర్చిపోతారు.
నిద్రలో తగ్గాల్సిన నొప్పులు మరింత ఎక్కువై ఇబ్బంది పెడుతాయి. ముఖ్యంగా సాఫ్ట్ వెర్ ఉద్యోగుల్లో దాదాపు 9-10 గంటలు కంప్యూటర్ ముందు కూర్చిని ఆపరేట్ చేస్తారు. ఇది మెడపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. నిద్ర సరిగా పోనట్లయితే.. మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది. నిద్ర తక్కువైతేఉదయం నిద్ర లేచాక ఉల్లాసంగా ఉండరు..అలసిపోయినట్లు ఎక్కువగా అనిపించడం, పగలు ఎక్కువగా ఆవలించడం, కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్ కూడా నిద్రలేమిఉంటాయి. ఒక రోజులో ఏడు గంటల కంటే నిద్ర తక్కువైతే, ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరు అప్పుడప్పుడు ఆఫీసుల్లో అయినా పర్లేదు. 2-3 గంటలకు ఒకసారి ముఖాన్ని చల్లని నీటితో కడుక్కుంటే చాలా మంచింది. అందువల్ల కళ్ళకు చిన్న వ్యాయామం అవుతుంది.
మనిషి సరైన నిద్ర లేకపోవడం వలన చికాకు, మూడ్ స్వింగ్స్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది తీవ్ర మానసిక సమస్యగా మారి, ఆందోళన చివరకు మైగ్రేన్ కు కూడా దారితీయచ్చు. అలాగే నిద్ర లేమితో బాధపడేవారు డిప్రెషన్ కు గురవుతారని, దీనివల్ల హార్మోన్ల అసమతౌల్యత తలెత్తుతుందని అంటున్నారు. సరైన నిద్ర లేకుంటే నరాల సంబధింత ఆరోగ్య సమస్యలకు, అంతే కాకుండా ముఖ్యంగా ముఖంపై ప్రభావం చూపుతుంది. కల్లకింద నల్లటి వలయాలు, కనురెప్పలు వాలిపోవడం, చర్మం పాలిపోవడం, కళ్లు ఎరుపెక్కడం, కళ్లు ఉబ్బడం వంటి లక్షణాలు తీవ్రంగా వేధిస్తాయి.
నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసాల్ పెరిగి.. కొల్లాజెన్ తక్కువైపోతుంది. చర్మాన్ని మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గి ఫ్లూ, జలుబు వంటి సమస్యలు ఎక్కువైతాయి. గుండె జబ్బులు, వృద్ధాప్య సంకేతాలు ఇవన్నీ నిద్రలేమి వల్ల కలిగే జబ్బులే. నిద్రలేమి డ్రైవింగ్‌పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏటా జరిగే ప్రమాదాల్లో సగం నిద్రవల్లే జరుగుతున్నాయని ఓ సర్వే తేల్చి చెప్పింది. ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, రక్తపోటు ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు నిద్రలేమి వల్ల వస్తున్నాయి.
ఫోన్లు ఎక్కువగా చూస్తే ప్రమాదమే సుమా!
స్మార్ట్ మొబైల్ అతిగా వాడితే కళ్లు ఒత్తిడికి గురికావడం, నిద్రకు భంగం వాటిల్లడం వంటి పలు సమస్యలు వస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే ఫోన్లు, లాప్ టాప్స్, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు వస్తాయని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. నీలి కాంతి కొల్లాజెన్ ప్రొటీన్ పై ప్రభావం చూపుతుందని, ఇది చర్మంపై ముడతలకు కారణమవుతుందని మిషిగన్ స్టేట్ వర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
ఏ వయసువారు ఎన్ని గంటలు పడుకోవాలి?
ముఖ్యంగా చిన్నపిల్లలు శిశువు నుంచి రెండేళ్లు వయసున్న పిల్లలు సగటు నిద్ర 15 గంటలు పోవాలి. 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్నవారు 10 నుంచి 13 గంటలు నిద్ర పోవాలి. 6 నుంచి 13 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు 9 నుంచి 11 గంటలు నిద్రపోవాలి. 14 నుంచి 17 సంవత్సరాల వారు.. 8 నుంచి 10 గంటలు..1 8 నుంచి 64 సంవత్సరాల మధ్యవారు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. ఇక వృద్యాప్యులు వయసు 65 దాటిన వారు 7 నుంచి 8 గంటలు పడుకోవాలి.
నిద్ర పోయే ముందు ఇలాచేయండి!
నిద్ర పోయే ముందు.. చాలా పని చూసుంటాం కావున శరీరం చెమట పట్టి ఉంటుంది. ఇలాంటి సమయంలో స్నానం చేయాలి. అలా కుదరని పక్షంలో కనీసం కాళ్లు, చేతులు, ముఖం అయినా చల్లని నీళ్లతో కడుక్కోవాలి.
గ్లాసు చిక్కటి పాలల్లో ఒక యాలక్కాయ వేసి మరిగించాలి. వెన్నెల్లో బయటికి వచ్చి అలా 10 నిముషాలు ఆస్వాదిస్తూ రుచిని ఎంజాయ్ చేస్తూ పాలు తాగాలి. తరువాత క్లోజుడ్ రూమ్స్ లో కాకుండా.. వెంటిలేషన్ అంటే కిటికీలు ఓపెన్ చేసి.. బయటిగాలి గదిలోకి వచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. హాయిగా చల్లని గాలిలో పడుకోవాలి. ఈ మధ్య ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేనిదీ అస్సలు నిద్రపోవట్లేదు. ఫ్యాన్లు, కూలర్ల సౌండ్ మెదడుకు ఇబ్బందిగా ఉంటుంది.
వీలైతే ఆరుబయట దోమలు లేకుండా ఒక మంచం వేసుకొని నిద్రించడం మంచిది. అంతే కాకుండా ఇంటి ముందు మామిడి, వేప చెట్లు ఉంటే ఆ గాలి స్వచ్ఛమైనది కావునా హాయిగా నిద్రపడుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ నాళాలు శుభ్రం అవుతాయి. ఏసీలు, కూలర్లు వాడినా పర్లేదు కానీ, వాటిని నెలల వ్యవధిలోనే క్లీన్ చేసుకోవాలి. అందులో చెత్త పేరుకుపోయి.. దుమ్ము ముక్కులోకి వెళ్లే అవకాశం ఉంది. అలంటి గాలితో ఆస్తమా, అలెర్జీ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.