HEALTH & LIFESTYLE

శరీరకంగా ఒకే.. మరి మానసికంగా దృఢంగా ఉన్నారా..?

శరీరం బలంగా ఉండటంతో పాటు మానసికంగా బలంగా ఉండటం కూడా ముఖ్యం. చాలామంది శరీరాన్ని బలంగా తయారు చేసుకోవడానికి ఎక్కువగా శ్రమిస్తారు. కానీ, మానసికంగా బలంగా ఉండటం కోసం ఏం చేయరు. రెండిటి మీద దృష్టి పెట్టాలి.. అప్పుడే జీవితంలో అనుకున్నది సాధించగలం అని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీరు మెంటల్లీ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? దాని కోసం పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

మానసికంగా బలంగా లేని వారు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు మీరు ధరించే దుస్తులు, మీరు వాడే వస్తువులు ఇతరులకు నచ్చేలా వేసుకోవడానికి ప్రయత్నించడం. దీనివల్ల మీ జీవితంలో మీరు తప్ప మీ పక్కన వారందరూ ఉంటారు. కాబట్టి, మీకు నచ్చినట్లు మీరు ఉండండి, మీకు నచ్చిన పని మీరు చేయండి. అప్పుడే మీ లక్ష్యాన్ని మీ సొంత ఆలోచనలతో సాధించగలుగుతారు. 

కొంతమంది వారు అనుకున్నది జరగకపోతే తట్టుకోలేకపోతారు. చిన్న వైఫల్యం వస్తే చాలు మానసికంగా కృంగిపోతారు. ఇది వీక్ మైడ్‌సెట్. అలా కాకుండా మీకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, దానిని ఒక పాఠంలా తీసుకుని తప్పులు సరి చేసుకుంటూ, జీవితాన్ని మార్చుకుంటున్నట్లైతే మీరు మానసికంగా స్ట్రాంగ్‌గా ఉన్నారని అర్థం. 

కోపం, భయం, ఒత్తిడి ఇలా ఏ ఫీలింగ్‌ని అయిన మీరు నియంత్రించుకుని.. ఎక్కువగా స్పందించకపోతే ప్రశాంతంగా ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరైన నిర్ణయం తీసుకోవడానికి మెదడు బాగా పని చేస్తుంది. భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ప్రతి ఒక్కరికి ఉండాలి.

ఓపిక లేకపోవడం కూడా మానసికంగా దృఢంగా లేరు అనడానికి నిదర్శనం. మానసికంగా బలమైన వ్యక్తులు వారి లక్ష్యాలను సాధించడానికి ఎంతో ఓపికగా ఉంటారు. 

జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఈ మార్పులను స్వీకరించి.. వాటికి అనుగుణంగా మారడానికి ప్రయత్నించండి. జీవితంలో వచ్చే ఛాలెంజస్‌లను ఎదురించడానికి చూడండి. అలా కాకుండా మార్పులకు భయపడుతున్నట్లైతే మీరు మానసికంగా దృఢంగా లేరని అర్థం. 

ఎప్పుడూ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. దీనినే ఆత్మవిశ్వాసం అని అంటారు. ఇది లేకపోతే స్పష్టంగా ఆలోచించలేరు. ఇతరులు ఏం చెబితే దాన్ని నమ్ముతారు. ఇలా అయితే మీ గోల్స్‌ని రీచ్ కాలేరు. 

అసూయ పడుతున్నారా..? మానసికంగా బలంగా ఉన్నవాళ్లు ఎప్పుడూ ఇతరులను చూసి అసూయపడరు. అసూయ పడడం వల్ల ఇతరుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. దీనివల్ల మీ మీద మీరు దృష్టి పెట్టలేరు.

Show More
Back to top button