HISTORY CULTURE AND LITERATURE

మొఘల్ బాద్ షా అక్బర్ కు నిద్ర లేకుండా చేసిన ధీశాలి రాణా ప్రతాప్

మహారాణా ప్రతాప్ సింగ్.. ఈ పేరు శత్రువులకు సింహాసనం. మొఘల్ బాద్ షా అక్బర్ కు నిద్ర లేకుండా చేసిన ధీశాలి అతడు. అతడి సాహసం, శౌర్యం, త్యాగం భావి స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలిచాయి. అతడే మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సింగ్. అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి దాని మెడలు వంచి విజయం సాధించిన వియత్నాం అధ్యక్షుడు తన విజయానికి స్ఫూర్తి భారతీయ రాజు రాణా ప్రతాప్ అని అతని ప్రేరణ పొంది యుద్ధ విద్య ప్రయోగాలతో విజయం సాధించామని చెప్పాడంటే.. మహారాణ ప్రతాప్ సింగ్ సామర్ధ్యాలు, ధైర్య సాహసాలు ఎలాంటివో స్పష్టం అవుతున్నాయి. అయితే అలాంటి ధీరుని చరిత్ర చాలామందికి తెలియదు. చరిత్ర ఆయన త్యాగాన్ని ధైర్యసహసాలను మరిచింది.  మహారాణ ప్రతాప్ గురించి తెలుసుకుందాం..

మహారాణా ప్రతాప్ 1540 మే 9 రాజస్థాన్ లోని కుంభంలో జన్మించాడు. 1568లో పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన మహారాణ.. 1790 వరకు పరిపాలించాడు. ఆ సమయంలో అక్బర్ ఢిల్లీ సింహాసనాన్ని పాలిస్తున్నాడు. స్వాతంత్రం, ఆత్మగౌరవం కోసం నిరంతరం మొఘలులతో పోరాటం చేస్తూ రాణా ప్రతాప్ ఏనాడు తలవంచలేదు. మహారాణా ప్రతాప్ ఒకసారి తలదించి తన కాళ్ళ మీద పడితే సగం హిందుస్థాన్ కు రాజును చేస్తానని అక్బర్ ప్రతిపాదిస్తే.. దానిని రాణా ప్రతాప్ తిరస్కరించాడు. వాస్తవానికి మహారాణా ప్రతాప్ సింహాసనాన్ని అధిష్టించే నాటికి తన రాజ్యానికి నాలుగు వైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువుల వద్ద అపార ధనం యుద్ధసామాగ్రి ఉంది. అలాంటి నేపథ్యంలోనూ చిత్తూరును స్వతంత్ర రాజ్యాంగం చేసే వరకు బంగారు పళ్లెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై రాజప్రసాదంలో నిద్రించనని ప్రతిభ పూనిన దీశాలి మహారాణా ప్రతాప్.

ముస్లింలకు వరంగా మారిన హిందూ రాజుల అనేక్యత…

మహారాణా ప్రతాప్ కి ఎదురైన ముందు పరిణామాలను పరిశీలిస్తే మన దేశంలో   అత్యధిక ప్రాంతాలను తన పాలనలోకి తీసుకువచ్చి సుపరిపాలన అందించిన చిట్టచివరి చక్రవర్తి శ్రీ హర్షుడు. శ్రీ హర్షుడి మరణానంతరం హిందూ రాజులలో అనైక్యత వ్యాపించింది. పరస్పరం కలహించుకుంటూ ఎవరికి వారే స్వతంత్రంగా వ్యవహరించసాగారు. అదే సమయంలో విదేశీ అక్రమదారుల దృష్టి భారత్ పై పడింది. ముస్లిమ్ సేనానులు, మహమ్మద్ ఘజిని, మహమ్మద్ ఘోరీ వంటి వారు భారత భూభాగంపై వరుసగా దాడులు కొనసాగించారు. విదేశీ ఆక్రమణదారులతో సమైక్యంగా పోరాడాల్సిన హిందూరాజులు నిష్కృలయ్యారు. దేశంలోని రాజుల మధ్య నెలకొన్న విభేదాల అనేక్యత ముస్లిం రాజులకు వరంగా మారాయి. క్రమంగా ముస్లింసేనానులు దేశంలోని ఒక్కో రాజును చేయిస్తూ తమ రాజ్యాన్ని ధిక్కరించసాగారు. ఈ దురాక్రమణ చరిత్ర 700 సంవత్సరాల పాటు కొనసాగింది. మొగలుల పాలనకు నాంది పలికింది. మొఘల్ బాదుషా అక్బర్ కాలం నాటికీ భారతదేశంలోని 50 శాతం భూభాగం ముస్లింల ఆధీనంలోకి వచ్చింది.

ఈ ఏడు వందల సంవత్సరాల కాలంలో విదేశీ ఆక్రమదారులను స్వదేశీ పాలకులు ఎదిరించి సమైక్యంగా పోరాటం చేయని కారణంగా విఫలమైంది. అదే భారతదేశానికి శాపం అయింది. మొగల్ బాద్షా అక్బర్ చేసిన కుటిల నీతి కారణంగా అనేకమంది రాజపుత్ర రాజులు అతని అధికారానికి తలవంచి అక్కడ ఆశ్రయాన్ని పొందారు. వారంతా ప్రాణ సమానమైన స్వాతంత్రాన్ని పోగొట్టుకొని అక్బర్ కు సామంతులయ్యారు. మరి కొంతమంది అక్బర్ సైన్యంలో సేనాధిపతులుగా చేరారు. మహా పరాక్రమశాలీ అయిన రాజామాన్సింగ్ అక్బర్ సైన్యానికి సర్వసేనాధిపతి అయి రాజ్య విస్తరణకు సేవ చేశాడు. ఇక మహారాణా ఉదయ్ సింగ్ మహా రాణా ప్రతాప్ కి తండ్రి. ఉదయ్ సింగ్ మరణానంతరం మేడా రాజ్యంలోని మంత్రులంతా చర్చించుకుని పరాక్రమవంతుడైన రాణా ప్రతాప్ సింగ్ ను రాజుగా అభిషేకించారు.

మాతృభూమి రక్షణకై నడుంబిగించిన రాణా ప్రతాప్…

క్రీస్తు శకం 1572లో రాజుగా అభిషిక్తుడైన మహారాణా ప్రతాప్ సింగ్ మాతృభూమి రక్షణకై నడుంబిగించాడు. అక్బర్ బాద్షాను ఎదిరించడానికి శక్తివంతమైన సైన్యాన్ని తీర్చిదిద్దాడు. ఆరవలి పర్వత ప్రాంతాల్లో నివసించే బిల్లు యువకులను సమీపించి వారిలో స్వాతంత్ర పిపాస రగిలించి ధైర్య సాహసాలు గల సైనికులుగా తీర్చిదిద్దాడు. మాతృభూమి కోసం అతి వీర భయంకరమైన సైనికులు మహారాణా ప్రతాప్ సింగ్ సైన్యంలో ఉండేవారు. ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొగలులతో పోరాడారు. ఆదివాసీలు మహారాణాను వారి పుత్రుడుగా భావించేవారు. మహారాణా కూడా వారి పట్ల బేధాభావం చూపించకుండా వారితో సొంత బిడ్డ వలె ఉండేవాడు. మేవాడు రాజ్యంలో ఒకపక్క రాజపుత్రులు, మరోపక్క బీళ్లు ఉంటారు. సుమారు 25 సంవత్సరాల పాటు అక్బర్ తో పోరాటం చేసిన మహారాణా ప్రతాప్ ఒక సామాన్య సైనికుని బలే జీవించాడు. ఒక దశలో తినడానికి తిండి కూడా సరిగా లేని సమయంలో గడ్డి రొట్టెలను తినేవాడని చరిత్రలో వ్రాయబడి ఉంది.

అక్బర్ సంస్థానంలో గగుర్పొడిచే  సంఘటన ఇది…

మహారాణ ప్రతాప్ జీవనశైలి  పరాక్రమాన్ని స్వయంగా తిలకించిన శీతల్ అనే కవి రాణా ప్రతాప్ సింగ్ పై ఓ ప్రేరణ గేయ కవిత్వం రచించాడు. రాణా ప్రతాప్ తన తలపాగాను శీతల్ కవికి తొడిగి సన్మానించాడు. శీతల్ కవి గ్రామాలలో తిరుగుతూ మేవాడ రాజు శౌర్య గాథలను గానం చేసేవాడు. చివరకు ఆగ్రా లోనే అక్బర్ బాద్షా ఊర్లో కూడా శీతల్ కవి రాణా ప్రతాప్ సౌర్యాన్ని గానం చేశాడు. అప్పుడు అక్కడ ఒక ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఒకటి జరిగింది. సాధారణంగా అక్బర్ ఆస్థానంలోకి ఎవరైనా ప్రవేశించగానే తలవంచి కుడిచేత్తో చక్రవర్తి అక్బర్ కు సలాం చేయాలి. శీతల్ కవి అక్బర్ ఆస్థానంలోకి ప్రవేశించగానే రాణా ప్రతాప్ తన తలకు తొడిగిన తలపాగాని తీసి కుడి చేత్తో పట్టుకొని తలవంచి అక్బర్ కు ఎడమ చేత్తో సలాం చేశాడు.

ఎడమ చేతి సలాం చక్రవర్తికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క క్షణం తన కోపాన్ని అణచిపెట్టుకొని ఎందుకు అలా చేశావని శీతల్ కవిని అక్బర్ అడిగాడు. అప్పుడు శీతల్ కవి మాట్లాడుతూ.. ఎడమచేత్తో మీకు సలాం చేసిన నన్ను మన్నించండి. దానికి బలమైన కారణం ఉంది. మహాదీరుడైన రాణా ప్రతాప్ సింగ్ నాకు తన తలపాగని బహూకరించారు. కాబట్టి తలపాగా ఉన్న శిరస్సును మీ ముందు ఉంచడం అంటే ఇంతవరకు మీకు లొంగని ఆ వీరుని అవమానించడమే అవుతుంది. అందుకని ఆ తల పాగాను తీసి చేత్తో పట్టుకొని మీ ముందు తలవంచానుమ్ అంతటి మహావీరుని తలపాగాని ఎడమచేత్తో పట్టుకోవడం అంటే కూడా అతని అవమానించడమే అవుతుంద. అందుకే తలపాగా కుడిచేత్తో పట్టుకొని మిగిలిన చేత్తో మీకు సలాం చేశాను. మీకు భయపడడం కన్నా మహారాణా ప్రతాప్ ల్ వీరత్వాన్ని చాటడానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని శీతల్ కవి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చెప్పడంతో అక్బర్ నిష్చేస్తుడయ్యాడు.

రాణా ప్రతాప్ తో యుద్ధానికి సిద్ధమైన అక్బర్…

ఇక హల్దీ ఘాట్ పోరాటానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలలో ప్రత్యేక స్థానం ఉంది. రాణా ప్రతాప్ ను తన అధికార పరిధిలోకి తీసుకురావడానికి అక్బర్ బాద్షా చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమయ్యాయి. రాయబారం విఫలం కావడంతో యుద్ధం అనివార్యమైంది. అక్బర్ కు రాణా ప్రతాప్ ఒక సమస్యగా తయారయ్యాడు. రాణా ప్రతాప్ తో యుద్ధం చేయడానికి అక్బర్ నిశ్చయించాడు. రాణా ప్రతాప్ పై పోరాటానికి అక్బర్ రెండు లక్షల సైనికులతో పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసి దానికి మాన్సింగును సేనాధిపతిని చేశాడు.

ఒక హిందూ రాజుపై విదేశీయ పాలకుని తరపున మరో హిందూ రాజు పోరాటం చేయడానికి రంగం సిద్ధమైంది. రాజా మాన్సింగ్ సహాయకులుగా యువరాజు సలీం, మొగలులతో కలిసి పోరాడిన రాణా ప్రతాప్ కు తమ్ముడైన శక్తి సింహుని నియమించాడు. ఈ సైన్యం మేవాడ్ దిశగా కదిలింది. అక్కడ రాణా ప్రతాప్ పరిస్థితిని అంచనా వేశాడు. రాజధానిని దుర్గమమైన కొండల నుంచి కుంభం మార్చాడు. మేవాడ్ స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవడానికి రాజపుత్ర సర్ధాతులంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు.

సైన్యాన్ని తీసుకొని కీలకమైన హల్దీ ఘాట్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ హల్దీ ఎత్తైన కొండల మధ్య ఉంది. రాణా ప్రతాప్ వద్ద మూడువేల మందితో అశ్విత దళం, 400  ఏనుగులతో సహా 22 వేల సైన్యం మాత్రమే ఉంది. ఈ సైన్యం రెండు లక్షల మంది ఉన్న అక్బర్ సైన్యంతో పోరాడడం అత్యంత సాహసమే అవుతుంది. హల్దీ ఘాట్ కు ఇరుకైన కొండ మార్గాల ద్వారా వచ్చే మొగల్ సైన్యం పై రాళ్ల వర్షం కురిసింది. బిల్లుల నుంచి దూసుకు వచ్చే పదునైన బాణాల తాకిడికి మొగలాయి సైన్యం కకావికలమైంది. అయితే చివరకు మొగలాయి సైన్యాన్నిదే పై చేయి అయింది. మొగలుల తరపున పోరాడుతున్నప్పటికీ దేశ ధర్మ రక్షణకు పోరాడుతున్న రాణా ప్రతాప్ సింగ్ పై మాన్ సింగకు అంచలంచల గౌరవం ఉంది.

అందుకే మొగల్ సైన్యంపై చేయి సాధిస్తున్న పరిస్థితిని గమనించిన మాన్సింగ్ మొగల్ సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేశాడు. అతని సూచనలతో రాణా ప్రతాప్ యుద్ధ భూమిని విడనాడి సురక్షిత ప్రాంతానికి పయనమయ్యాడు. వాయు వేగంతో పయనించే అతని గుర్రం చేతక్ ను మరోవైపు దౌడు తీయించాడు. వేలాది మంది రాజపుత్ర వీరులు మాతృభూమి రక్షణలో అమరులయ్యారు. రాణా ప్రతాప్ ను ఇద్దరు ముస్లింలు సర్దారులు వెంబడించారు. వారి వెంటే ఉన్న శక్తి సింహునిలో పశ్చాత్తాపం మొదలైంది. మేవాడ్ సింహాసనాన్ని రక్షించడానికి పోరాడుతున్న అన్న రాణా ప్రతాప్ కు సహకరించాలనుకున్నాడు. వెంటనే తన కరవాలంతో ఇద్దరు ముస్లిం సర్దార్ల తలలు నరికేశాడు. అన్న రాణా ప్రతాప్ కాళ్లపై పడి శరణు వేడాడు. రాణా ప్రతాప్ శక్తి సింహుని హృదయానికి హత్తుకుని ఓదార్చాడు.

క్రీస్తు శకం 1576 జూలైలో జరిగిన హల్దీ ఘాట్ పోరాటం రాజ్యపుత్రుల సౌర్య ప్రతాపాలకు సాక్షిగా నిలిచింది. హల్దీ ఘాట్ పోరాటం తర్వాత కూడా రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ సైన్యంతో అనేక యుద్ధాలు చేశాడు. సుమారు 25 సంవత్సరాల పాటు రాణా ప్రతాప్ మొగల్ సైన్యంతో పోరాడాడు. అనంతరం కుటుంబంతో సురక్షితమైన సింధు ఘాటుకు బయలుదేరాడు. దారిలో గతంలో మేవాడ్ మంత్రిగా పనిచేసిన భామాషా ఎదురై తన సర్వస్వాన్ని రాణా ప్రతాప్ పరం చేసి తిరిగి సైన్యాన్ని పునర్నిర్మించమని కోరాడు.

కొత్త ఉత్సాహంతో రాణా ప్రతాప్ అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే చిత్తూరును గెలవకుండానే క్రీస్తు శకం 1597వ సంవత్సరం జనవరి 19న ఆస్తమించాడు. మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెలుచుకున్నాడు. మహారాణ ప్రతాప్ సింగ్ దేశం, ధర్మం, సంస్కృతి స్వాతంత్రం కోసం పోరాడే భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. నిజమైన హైందవ వీరునిగా వీర స్వర్గం అలంకరించారు. తర్వాతి కాలంలో చత్రపతి శివాజీ మహారాజుకు రాణ ప్రతాప్ సింగ్ యుద్ధమే స్ఫూర్తి అయింది. హల్ది ఘాట్ యుద్ధం జరిగిన 300 సంవత్సరాల తర్వాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరిసారిగా 1985లో ఒక ఆయుధం దొరికింది. 

రాణా ప్రతాప్ ప్రాణాలు కాపాడిన చేతక్…

మహారాణ ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు చేతక్. ఓయుద్ధం తర్వాత ఈ గుర్రంపై వెళ్తుండగా 26 అడుగుల కందకం ఎదురైంది. చేతక్ దానిని దుముఖి అది దాటిన తర్వాత చనిపోయింది. అంతకంటే ముందుగా ఒక కాలు విరిగి ఉన్నప్పటికీ ఆ కందకాన్ని దుమ్మికింది. అలా రాణా ప్రతాప్ సింగ్ ను రక్షించి ప్రాణాలు కోల్పోయింది. అది ఎక్కడ అయితే చనిపోయిందో అక్కడే ఒక వింత చెట్టు పెరిగింది. అదే ప్రదేశంలో దాని గౌరవార్థం చేతక్ మందిరాన్ని కట్టారు. మొదట చెప్పుకున్న వియత్నం అధ్యక్షుడు సమాధి మీద ఇది మహారాణ ప్రతాప్ యొక్క శిష్యుడి మందిరం అని రాసి పెట్టారు.

ప్రపంచమే గర్వించదగ్గరాజు రాణా ప్రతాప్…

కొన్నేళ్ళకు వియత్నాం విదేశాంగ మంత్రి భారత పర్యటనకు విచ్చేశారు. దేశంలోని గొప్ప వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఆయనకు మొదట గాంధీ సమాధి చూపించారు. ఆ తర్వాత ఎర్రకోట. ఇలా చూపించినప్పుడు వియత్నాం మంత్రి మహారాణ ప్రతాప్ సమాధి ఎక్కడా అని ప్రశ్నించారు. ఆ మంత్రి ప్రశ్నకు ఆశ్చర్యపోయిన భారతీయ మంత్రి ఉదయపూర్ లో ఉందని చెప్పాడు. అనంతరం వియత్నాం మంత్రి ఉదయపూర్ వెళ్లి సమాధిని దర్శించి అక్కడ నుంచి పిడికిలి మట్టిని తీసుకొని తన బ్యాగులో వేసుకున్నాడు. దీనిని గమనించిన భారతీయ అధికారి మట్టిని బ్యాగులో ఎందుకు పెట్టుకున్నారని అడిగాడు. ఇదే మట్టి  దేశభక్తులైన వీరపుత్రులకు జన్మించింది. అందుకే దీనిని తీసుకెళ్లి మా దేశం మట్టిలో కలుపుతా. ఇలాంటి రాజు ప్రేరణతో అక్కడ కూడా దేశభక్తులు జన్మిస్తారని, మహారాణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గర రాజు అని అనడం మహారాణా ప్రతాప్ కి లభించిన అరుదైన గౌరవం అని చెప్పవచ్చు. అంత గొప్ప రాజు పుట్టిన ఈ దేశంలో మనం జన్మించడం మన అదృష్టమే కదా.

Show More
Back to top button