HISTORY CULTURE AND LITERATURE

మనదేశంలోని 6 అతిపెద్ద దేవాలయాలు ఇవే!

భారత దేశంలో విదేశీ టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తున్న ప్రదేశాల్లో ఏది ఎక్కువగా ఉన్నాయని సర్వే చేస్తే అందులో ఎక్కువమంది విదేశీయులు పర్యటిస్తున్న ప్రదేశాలు మన హిందూ దేవాలయాలు అని తేలింది. భారత దేశం ప్రపంచంలోని అతి పురాతన నాగరికతలో ఒకటి. అంతే కాకుండా భారత దేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు. అనేక ధర్మాలకు ఆశ్రమం ఇచ్చిన మెట్టినిల్లు కూడా. ఇన్ని మతాలు ఉండటం వలన మన భారత దేశములో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చాలా దేవాలయాలు చూస్తున్నాం. ఇండియాలో వందల మంది దేవుళ్ళకి వేల ఆలయాలు ఉన్నాయి.

ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మంలో ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన దేవాలయాలు సంస్కృతి సంప్రదాయాలు వారసత్వ సంపదను ప్రతిభింబించేలా ఉంటాయి. ఈ దేవాలయాల యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. కొంతమంది దృష్టిలో దేవాలయాలంటే ప్రశాంతతకు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకలు. భారత దేశంలో కొన్ని దేవాలయాలు 1000 సంవత్సరాల పైనుండి ఉనికిలో ఉన్నాయి. మరికొన్ని దేవాలయాలు 10 సంవత్సరాల క్రితం నిర్మించినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు భారత దేశంలో అతిపెద్ద టాప్ -6 దేవాలయాల విశిష్టతను తెలుసుకుందాం. 

1). శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం

ఈ దేవాలయం తమిళనాడులో ఉంది. మన దేశంలో ఇది అతిపెద్ద దేవాలయం కాగా ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా ఉంది. దీనిని ద్రవిడులు తమ అత్యంత వినూత్న నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ దేవాలాయాన్ని ఆళ్వారులు వారియొక్క దివ్య పచనంతో వర్ణించారు. ఇది విష్ణుమూర్తి 108 దివ్య దేవాలయాల్లో ఒకటి. ఈ గుడి 155 ఎకరాల విస్తీర్ణంలో 50 మందిరాలు 39 మండపాలు 9 కౌనులు 21 గోపురాలతోపాటు అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటుంది. దీనిలో ఉన్న గోపురం ఎత్తు 236 అడుగులు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది. దీనిని రాజగోపురం అనికూడా అంటారు. 

2).స్వామి నారాయణ్ దేవాలయం – అక్షర ధామ్

ఇది ఢిల్లీలోని అక్షర ధామ్ లో ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్ద సమగ్ర హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణం నవంబర్ 6, 2005లో పూర్తి అయింది. ఇంత పెద్ద గుడిని కేవలం 5 సంవత్సరాలలో ఒక  కుటుంబం మాత్రమే కట్టించింది. దీనిని స్వామి మహారాజ్, ఏపీజే అబ్దుల్ కాలాం, మన్మోహన్ సింగ్, LK అద్వానీ, మరియు బన్వారీ లాల్ జోషి గార్ల సమక్షంలో నవంబర్ 6, 2005న ప్రారంభం చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి లోహాన్ని ఉపయోగించలేదు. అంటే ఈ ఆలయం మెటల్ అండ్ స్టీల్ సపోర్ట్ లేకుండా నిర్మాణం జరుపుకుంది. ఆలయ కేంద్ర మందిరం కింద 11 అగుడుల స్వామి నారాయణ్ శిల్పం బంగారు తొడుగుతో అభయ ముద్రలో కూర్చొని దర్శనం ఇస్తుంది. ఈ ఆలయంలో సీతారాములు, రాధా కృష్ణులు, శివపార్వతులు, లక్ష్మీనారాయణుల ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ మందిరంలో 234 స్తంభాలు అద్భుతంగా చెక్కి ఉంటాయి. ఇంత గ్రేట్ ఆర్కిటెక్చర్ ఇంకా ఎక్కడా ఉండదు. ఈ ఆలయంలో 20 వేల స్వామివారి ఇతర శిల్పాలు ఉన్నాయి. 

3). విరూపాక్ష ఆలయం 

కర్ణాటకలోని హంపిలో ఈ విరూపాక్ష ఆలయం ఉంది. ఓ చిన్న ఆలయంగా ప్రారంభమై విజయ నగర పాలకుల హయాంలో పెద్ద ఆలయంగా మారింది. దేశంలోని పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తించింది. ఈ ఆలయాన్ని విరూపాక్షుడు అంటే శివునికి అంకితం చేయబడింది. ఆలయ నిర్మాణం పూర్తిగా శిల్పకళ వెల్లివెరిచేలా అప్పటి ఆర్కిటెక్చర్ గొప్పతనం ప్రతిభింభించేలా రాతితో ఒక రథాన్ని నిర్మించారు. దీనినే ఏకశిలా రాతితో నిర్మించిన రథం అంటారు. అలాగే ఈ ఆలయంలో ఉండే స్తంభాల నుండి సంగీతం వినిపిస్తుంది. ఇప్పటికి కొన్ని వేల మంది ఈ స్తంభాలపై రీసర్చ్ చేస్తున్నారు.  శిలలపై ‘శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు’ అనే సాంగ్ లో ఈ ఆలయాన్ని చూపిస్తారు. 

4). అన్నా మలయార్ ఆలయం/ అరుణాచలేశ్వర దేవాలయం 

తమిళనాడులోని తిరువన్నామలై కొండల్లో అరుణాచలేశ్వర దేవాలయం ఉంది. లక్షా ఒక వెయ్యి నూటడెబ్భై ఒక్క చదరపు మీటర్లు (1,01,171 చమీ) విస్తరించి ఉన్న ఈ ఆలయం పరమశివునికి అంకితం ఇవ్వబడింది. ప్రపంచంలోనే శివునికి అంకితం ఇవ్వబడిన అతిపెద్ద ఆలయంగా దీనిని భావిస్తారు. ఈ ఆలయాన్ని చోళులు 9వ శతాబ్దంలో ద్రవీడియాన్ నిర్మాణ శైలిలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గుడిలో తూర్పు గోపురం అయినటువంటి రాజగోపురం 135 అడుగుల గ్రానైడ్ తో నిర్మించారు. దీనిని విజయ నగర రాజైనటువంటి కృష్ణ దేవరాయ గారు నిర్మాణం మొదలు పెడితే ఆయన తర్వాత సేవప్ప నాయక ఆ నిర్మాణాన్ని ముగించారు. మొత్తం ఈ ఆలయ నిర్మాణం చేయడానికి 23 ఏళ్ళ సమయం పట్టింది. 

5). బృహదీశ్వర ఆలయం

తమిళనాడు లోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం దక్షిణ భారత దేశంలో ఉన్న మరొక పెద్ద దేవాలయం. 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని గ్రెనేడ్ తో నిర్మించారు. ప్రపంచం మొత్తంలో గ్రానైడ్ తో నిర్మించిన మొట్టమొదటి ఆలయంగా ఈ ఆలయం నిలిచింది. దేశంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటి ఇక్కడ ఉంది. బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజేశ్వరం అని కూడా అంటారు. దీనిని దక్షిణ మేరు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని తమిళ రాజు అయినటువంటి రాజరాజ చాలా గారు 1003 నుండి 1010వ సంవత్సరంలో నిర్మించారు. ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పిచే చేయబడింది. ఈ విషయాలు అచట గల శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది.

6). బేలూరు మఠం 

పశ్చిమ బెంగాల్ లోని బేలూరు మఠం హిందూ ఇస్లామిక్ భౌద్ధ రాజపుత్, క్రిస్టియన్ నిర్మాణ శైలిని ప్రతిభింబిస్తుంది. 40 ఎకరాల విస్తీర్ణాలో ఉన్న ఈ మఠం ప్రపంచంలోని అన్ని మతాల ఐక్యతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం ప్రధాన కార్యాలయం కూడా ఇదే.  స్వామి వివేకానంద కొలంబో నుండి ఒక చిన్న శిష్య బృందంతో తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చి బేలూర్‌లో రెండిటిపై పని ప్రారంభించారు. స్వామి వివేకానంద సోదరుడు మరియు రామకృష్ణ సన్యాస శిష్యులలో ఒకరైన స్వామి విజ్ఞానానంద , ఆయన సన్యాస జీవితంలో సివిల్ ఇంజనీర్, వివేకానంద మరియు అప్పటి రాష్ట్రపతి స్వామి శివానంద ఆలోచనల ప్రకారం ఆలయాన్ని రూపొందించారు. బేలూర్ మఠం 13 మార్చి 1929న శంకుస్థాపన చేసింది. ఈ భారీ నిర్మాణాన్ని మార్టిన్ బర్న్ & కో నిర్వహించింది.

Show More
Back to top button