మహారాజులు, మహారాణుల చరిత్ర సమ్మిళితమైన దేశం భారతదేశం. భారతదేశ చరిత్రలో ఎందరో మహారాజులు, మహారాణుల చరిత్రలు మరువలేనివి. వారిలో దేశం కోసం ప్రజల రక్షణ కోసం తాముగా బలైపోయిన వీరులు ఎందరో ఉన్నారు. రాజ కుటుంబం కంటే, రాజ సింహాసనం కంటే, వారసత్వ అధికారం కంటే ప్రజల శ్రేయసే ముఖ్యమని నమ్మి.. దానికి అనుగుణంగా మసులుకున్న ధీరులు ఉన్నారు. ఈ తమ ప్రయత్నాలలో తమ సొంత కుటుంబం నుంచి కొందరు స్వార్ధపరుల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్న వారు ప్రాణాలుకు తెగించి వెన్నుపోటు దారులను ఆక్రమణదారులను విదేశీ శత్రువుల దండును ఎదిరించి నిలిచినవారు ఉన్నారు. కొందరు విజయంతో భారతదేశ గౌరవాన్ని కాపాడారు. కొందరు ఓడి భారతదేశ కీర్తి
పతాకాన్ని మాత్రం పైకెగరేశారు. భారతదేశం కర్మభూమి అనే నమ్మి కొలిచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలించిన పాలకుల చరిత్రలు తెలుసుకోవడం చదువుకోవడం ఒక స్ఫూర్తి. అదే సమయంలో అధికారమనే మత్తులో ధనవంతులం అనే గర్వంతో సొంత ప్రజలను పరాయి పాలకులకు కుదువ పెట్టిన ద్రోహులు కూడా ఎందరో ఉన్నారు. వారి చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి చెడులు రెండు తెలిస్తేనే ఏం చేయాలో, చేయకూడనివి తెలుస్తాయి.
చరిత్రలో ద్రోహులుగా నిలిచిన కొందరు రాజుల గురించి మహారాణుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చారిత్రక వాస్తవాన్ని గమనిద్దాం.
పటియాల మహారాజు భూపేందర్ సింగ్…
అందం పట్ల అందరికీ ఆరాధన ఉండడం సహజమే. ప్రకృతి కానీ మనిషి కానీ అందంగా ఉంటే అదో సంతృప్తి. భూపేందర్ సింగ్ కి అందమైన ఆడవారి పట్ల మాత్రమే ఆరాధన. వారితో పొందుకు వారితో సాంగత్యం ఆయనకు ముఖ్యమైన ఆసక్తులు. 38 ఏళ్లు పాటియాలని పరిపాలించిన ఈ మహారాజు అయిదుగురుని వివాహం చేసుకున్నారు. 350 మందికి పైగా ఈయనకు ఉమ్
ఉంపుడు గత్తెలు ఉండేవారు. మొత్తం 88 మంది సంతానం. స్త్రీల అందచందాల పట్ల అనురక్తి ఎక్కువ. 350 మందికి కలిపి వీళ్ళందరి సౌందర్యం నిత్యం కళ్ళముందు నిలవడానికి ఫ్రాన్స్ కు చెందిన బ్రిటిషర్ ని, భారతదేశానికి చెందిన ప్లాస్టిక్ సర్జరీ, బంగారు ఆభరణాలు తయారు చేసే వారిని, సుగంధ ద్రవ్యాలు తయారీదారున్ని, సౌందర్య దుస్తులు తయారు చేసే వాళ్ళని నియమించి ఆయనకు నచ్చినట్టు వారిని అలంకరింప చేసి ఆనందించేవాడు. ఈయన లీలలు అన్నీ దీవాన్ జర్మనీ దాస్ రచించిన మహారాజ పుస్తకంలో వివరంగా ఉన్నాయి.
ఎటువంటి మొహమాటం లేకుండా ఈ పుస్తకంలో ఆయన ఎన్నో విషయాలను చర్చించారు. పుస్తకంలో ఆయన గురించి పూర్తిగా రాసి ఉంది. మహారాజు విలాస జీవనం స్త్రీ లోలత్వం చేసిన ఎన్నో పనుల జాబితా ఉంది. బహిరంగంగా నీటి కొలనులలో తమ ఉంపుడు గత్తెలతో కూడి నగ్న స్నానాలు చేసేవాడట. అక్కడే మత్తు పానీయాలు సేవిస్తూ కుళాశాగా గడిపేవాడట. విందు వినోదాలలో మునిగితేలుతూ.. నగ్న స్త్రీల నాట్య ఆటలతో గడిపేవాడట. లెక్కలేనంత ఐశ్వర్యం ఉండడంతో ఏ సంకోచం లేకుండా ధీమాగా ఉండేవాడట. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి రాష్ట్రపతి శ్రీ బాబు రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి భవనానికి వెళ్లేటప్పుడు ఉపయోగించిన వెండి గుర్రం బగ్గీ మహారాజ భూపేంద్ర సింగ్ దేనట.
మొగల్ చక్రవర్తి షాజహాన్…
అందమైన సుందర నిర్మాణం తాజ్ మహల్ అందరికీ తెలుసు. ప్రేమకు చిహ్నంగా అందరూ గుర్తిస్తున్న ధవళ వర్ణ పాలరాతి కట్టడం తాజ్. షాజహాన్ గొప్ప ప్రేమికుడిగా అందరికీ తెలుసు. అతని వ్యక్తిత్వం కూడా అంతే సుందరమైనదని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ఆయన ఒక వెర్రివాడు. భార్య ముంతాజ్ తన 14వ సంతానాన్ని కని చనిపోతుంది. ముంతాజ్ అందానికి ముగ్దుడైన చక్రవర్తి తన మిగిలిన భార్యలతో సంతానాన్ని కనలేదంటే ఆశ్చర్య పోతారు.
సంతానం తర్వాత సంతానంతో ముంతాజ్ ఆరోగ్యం దెబ్బతిన్నది. ముంతాజ్ మరణానికి కారణం అదే. ముంతాజ్ చనిపోయాక చక్రవర్తి ఇంకా 8 మందిని పెళ్లాడాడు. వీలుకాక అంతపురంలో వందమంది వరకు స్త్రీలతో సంఘమించేవాడు. ఇటువంటి వ్యక్తి అద్భుతమైన ప్రేమికుడు అనే పేరు పొందడం ఆశ్చర్యకర విషయం. తాజ్ మహల్ నిర్మాణానికి 12,000 మంది శిల్పులకు 12 ఏళ్ల సమయం పట్టింది. అందుకు అవసరమైన తెల్లని పాలరాయి రాజస్థాన్లోని మకరానా నుంచి తెప్పించాడు. క్రిస్టల్స్ చైనా నుండి తెప్పించాడు. అఫ్గానిస్తాన్ నుండి వజ్రాలను, నీలాలను శ్రీలంక నుంచి తెప్పించాడు. ఖజానాలోని సొమ్ము ప్రజల సొత్తు అధికంగా తాజ్ నిర్మాణానికి వెచ్చించాడు.
హైదరాబాదు నిజాం.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్…
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచ ధనవంతుడు. 155 క్యారెట్ల వజ్రాన్ని తన బల్లమీద పేపర్ వైట్ గా ఉపయోగించేంత ఐశ్వర్యవంతుడు. ఈ వజ్రం నిప్పుకోడి గుడ్డు అంత ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలలో ఈ వజ్రం అయిదవ స్థానంలో నిలిచింది. ఈయన గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. 22 ఏళ్ళ వయసులో ఆజాం ఉన్నిసా బేగం మొదటి భార్యగా ఆయన జీవితంలోకి వచ్చింది. పెళ్లిలో మెహర్ రూపంలో ఆమెకు 108 కిలోల బంగారాన్ని ఇచ్చాడు. ఇలా ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు అనేది చెప్పడం కష్టం. అయితే ఈయనకు 136 మంది వరకు సంతానం ఉన్నారు. నిజాం వద్ద 14,718 వరకు పని వాళ్లు 3,000 మంది అరబ్ బాడీగార్డ్స్ ఉండేవాళ్లు. మహల్లోని దీప గుచ్చాన్ని శుభ్రం చేయడానికి 38 మంది పనివాళ్ళు ఉండేవారట. వీటన్నిటికంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాతృత్వానికి కూడా పేరుపొందారు. ఈయన అంతిమయాత్రలో 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది జనాభా పాల్గొన్నారని చెబుతారు.
జయపూర్ మహారాణి గాయత్రీ దేవి…
రాజమాత గాయత్రి దేవి 1919 మే 23న లండన్ లో జన్మించింది. ఈమె తండ్రి జితేంద్ర నారాయన్. కూచ్ బీహార్ యువరాజ్ రూపేంద్ర నారాయణ చిన్న తమ్ముడు. గాయత్రి దేవి ఎంతో రమ్యమైన రాజమహాల్లో పెరిగినట్లు చెబుతారు. మహల్లో 5000 మంది నౌకర్లు ఉండేవారు. ఈమెకు కార్లన్న వేట అన్న ఎంతో ఆసక్తి. మొదటిసారి చీతలు వేటాడినప్పుడు 12 ఏళ్ల వయసు. గాయత్రి వేటగత్తె మాత్రమే కాదు చక్కని గుర్రపు రౌతు కూడా. పోలో కూడా బాగా ఆడేవారు. కార్లు అంటే ప్రీతి. కార్లు కాకుండా ఒక విమానాన్ని కూడా ఆ కాలంలోనే సొంతంగా కలిగి ఉండేవారు. 1940లో ఈమె వివాహం సవ్వాయి మాన్సింగ్ -2 బహదూర్ తో జరిగింది. వివాహం తర్వాత ఈమె జయపూర్ మూడవ మహారాణి అయ్యారు. అయితే ఓ ప్రమాదంలో భర్త, కుమారుడు ఇద్దరి మరణం ఆమెను కృంగదీసింది.
కూచ్ బీహార్ మహారాణి ఇందిరాదేవి…
బరోడా రాజు కుటుంబంలో పుట్టిన ఇందిరా దేవి జీవితం ఆటుపోట్లతో గడిచింది. గ్వాలియర్ మహారాజు మాధవరావు సింధియాతో ఈమెకు వివాహం నిశ్చయమైంది. అయితే కూచ్ బీహార్ మహారాజు చిన్న తమ్ముడు ప్రేమలో పడ్డ కారణంగా ఈ సంబంధం రద్దయింది. మహారాజు చిన్న తమ్ముడు జితేంద్ర నారాయణతో వివాహం తర్వాత ఇద్దరు లండన్ వెళ్లిపోయారు. చాలా కాలంపాటు అక్కడే గడిపారు.
జునాగఢ్ నవాబ్ శ్రీ మహమ్మద్ రసూల్ ఖాన్…
ఈయన వద్ద 800 కుక్కలు ఉండేవట. వీటన్నిటికీ విడివిడిగా 800 గదులు ఉండేవట. అంతేకాకుండా వీటికి ఓ వ్యక్తిగత సేవకులు కూడా ఉండేవారు. జబ్బు పడ్డ కుక్కలను బ్రిటిష్ జంతు వైద్యశాలకు తీసుకువెళ్లి వైద్యం చేయించేవారు. కుక్క చనిపోతే ఒకరోజు సంతాపం పాటించేవారు. తన కుక్కలకు వివాహం కూడా జరిపించేవారు. 20 లక్షల రూపాయలు ఇందుకోసం ఖర్చు పెట్టేవారు. ఆ రోజు రాజ్యానికి సెలవు ప్రకటించేవారు. పరిపాలన కంటే జంతుపాలన పోషణ ఎక్కువ ఉండేది ఈ నవాబుకి.
భరతపూర్ మహారాజు కిషన్ సింగ్…
కిషన్ సింగ్ ఇతర రాజుల మాదిరిగానే సోగ్గాడు. ఈయనకు విలాసాలకు, విందు వినోదలకు ఏమి తక్కువ లేదు. జర్మనీ దాస్ రచించిన మహారాజా పుస్తకంలో ఈయన చరిత్ర కూడా ఉంది. కిషన్ మంచి ఈతగాడు. గులాబీ రంగు రాతితో కొలను కట్టించుకున్నాడు. కొలనులోకి దిగడానికి గంధం చెక్కలతో మెట్లు ఏర్పాటు చేయించుకున్నాడు. రాజు కొలనులోకి దిగుతున్నప్పుడు స్వాగతం చెప్పేందుకు వివస్త్రలతో స్త్రీలు మెట్ల మీదగా నిలబడి ఉండేవారు. రానులందరూ కొవ్వొత్తులు వెలిగించి నాట్యం చేస్తూ ఉండేవారు. ఎవరి దీపం ఎక్కువసేపు వెలుగుతుందో ఆ రాత్రికి రాజు వారితో గడుపుతాడు. రాత్రి పొందుకు ఈ రాజు ఎంచుకున్న ఆట ఇదే.
ఇదే భారతదేశ చరిత్రలో ప్రత్యేక లక్షణాలు కలిగిన కొందరు మహారాజులు, మహారాణుల చరిత్ర