TRAVEL

కూర్గ్‌కు వెళ్లొద్దామా..?

ప్రకృతి అందాలను చూడాలంటే శీతకాలాన్ని మించిన మంచి సమయం ఉండదు. ఈ కాలంలో ఇండియాలో ఎన్నో ప్రదేశాలు స్వర్గాన్ని తలపిస్తాయి. అంతటి అందమైన ప్రదేశాల్లో ఒకటి కూర్గ్. ఇది కర్ణాటకలోని ఒక జిల్లా. దీని హెడ్‌ క్వార్టర్స్ మడికేరి. ఈ ప్రదేశానికి వెళ్లడానికి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు మంచి సమయంగా ప్రయాణికులు చెబుతున్నారు. మీరు ఒకవేళ వెళ్లాలనుకుంటే ఈ నెలల్లోనే ప్లాన్ చేసుకోండి. వేసవిలో వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక టూర్ విషయానికి వచ్చేస్తే.. ఇక్కడికి వెళ్ళడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా బెంగళూరు లేదా మైసూర్ చేరుకోవల్సి ఉంటుంది. బెంగళూరు నుంచి కూర్గ్ 265 కి. మీల దూరం ఉంటుంది. మైసూర్ నుంచి 120 కి.మీలు ఉంటుంది. అక్కడి నుంచి కూర్గ్ వెళ్లాడానికి మడికేరి బస్సు‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. 

కూర్గ్‌లో చూడవలసిన ప్రదేశాలివే..

అబ్బే జలపాతం

కుమార పర్వతం కొండ

తడియాండమోల్ శిఖరం

చెలవర జలపాతం

బ్రహ్మగిరి కొండలు

నిషాని మొట్టే

బారా పోల్ నది

దుబారే ఎలిఫెంట్ క్యాంప్

మల్లారి జలపాతం

ఇరుప్పు జలపాతం

పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం

కాఫీ తోటలు

కూర్గ్‌ టూర్ బడ్జెట్

*మీరు ఎంచుకునే రవాణా బట్టి మీ ప్రయాణ ఖర్చు ఉంటుంది.

*రూంకు రోజుకు దాదాపు రూ.750 నుంచి రూ.1200 వరకు అవుతుంది. ఎక్కువ సౌకర్యాలు ఉన్న రూం అయితే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది.

*రోజుకు భోజనానికి దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు అవుతుంది.

*లోకల్‌లో తిరగడానికి రోజుకు రూ.500 వరకు అవుతుంది.

* వివిధ ప్రదేశాల ఎంట్రీ టిక్కెట్లు దాదాపు రూ.1500 వరకు అవుతుంది.

* ఇతర ఖర్చు రూ.1500 నుంచి రూ.2000 వరకు అవుతుంది. 

దీన్నిబట్టి మీరు మీ టూర్‌ను ప్లాన్ చేసుకోండి.

Show More
Back to top button