TRAVEL

అహోబిలం చూసి వద్దాం రండి..!

అహోబిలం పేరు మొదటిసారి విన్నారా..? అయితే ఈ ప్రదేశం గురించి తెలుసుకోవాల్సిందే. విష్ణుమూర్తి అవతారంలో ఒకటైన నరసింహ స్వామి హిరణ్యకశిపుడుని చంపిన స్థలమే అహోబిలం. ఈ  క్షేత్రాన్ని నవ నరసింహ క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఇది నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలంలో ఉంది. ఈ గుడి నంద్యాల నుండి 60 కి.మీ. దూరంలో ఉంటుంది. అహోబిలం దట్టమైన అడవిలో ప్రకృతి ఒడిలో చూడడానికి అందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని చూడాలంటే సాహసయాత్ర చేయాల్సిందే. 

నవ నరసింహ క్షేత్రం చూడాల్సిన ఆలయాలు:

*జ్వాలా నరసింహ ఆలయం

*భార్గవ నరసింహ ఆలయం

*పావన నరసింహ ఆలయం

*ఉగ్ర నరసింహ ఆలయం

*కరంజ నరసింహ ఆలయం

*యోగానంద నరసింహ ఆలయం

*ఛత్రవట నరసింహ ఆలయం

*వరాహ నరసింహ ఆలయం

*మలోల నరసింహ ఆలయం

వీటితో పాటు ఉగ్ర స్తంభం, ప్రహ్లాద దేవాలయం, ప్రహ్లాద బడి చూడవచ్చు. ఈ ఆలయాలకు కాలినడకన వెళ్ళాలి.

అహోబిలం ఎలా చేరుకోవాలి:

బస్సు మార్గం: అహోబిలంకు దూరప్రాంతాల నుండి బస్సు సదుపాయం లేదు ఆంధ్ర , తెలంగాణ నుండి నంద్యాల లేదా కర్నూల్‌కు చేరుకోవాలి అక్కడ నుండి ఆళ్లగడ్డ చేరుకోవాలి. అక్కడ నుండి ప్రతి 30 నిముషాలకు అహోబిలంకి ఒక బస్సు ఉంటది.

రైలు మార్గం: రైలు మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్లు కర్నూల్ లేదా కడప చేరుకొని అక్కడ నుండి ఆళ్లగడ్డకు బస్సు‌లో చేరుకొని అక్కడ నుండి బస్సు ద్వారా అహోబిలం చేరుకోవచ్చు.

టూర్ బడ్జెట్:

అహోబిలంకి రానుపోను చార్జీలు రూ.1000 నుంచి రూ.2000 వరకు అవుతాయి. రూంకి రోజుకు రూ.800 నుంచి రూ.1000, ఫుడ్‌కి రోజుకి రూ.500, గైడ్‌కు రూ.500, అక్కడ తిరగడానికి జీప్, ఆటోకి రూ.500.

Show More
Back to top button