TRAVEL

ఈ సీజన్‌లో బెస్ట్ టూర్

వర్షాకాలంలో ఎక్కువగా పర్యాటకులు హిల్ స్టేషన్‌కి వెళ్తుంటారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. అలాంటి హిల్ స్టేషన్‌లలో ఒకటే లాన్స్‌డౌన్ హిల్ స్టేషన్. లాన్స్‌డౌన్‌కి ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? చూడవలసిన ప్రదేశాలు ఏంటి? ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

లాన్స్‌డౌన్ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఉంది. లాన్స్‌డౌన్ అసలు పేరు కలుదండ. అయితే, 1888లో వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ లాన్స్‌డౌన్ సందర్శించారు. అప్పటినుంచి ఆయన పేరు మీదుగా హిల్ స్టేషన్‌కు లాన్స్‌డౌన్‌గా నామకరణం చేశారు. లాన్స్‌డౌన్‌కి మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాలనుకునేవారు ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ నుంచి లాన్స్‌డౌన్ 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. 

బస్సు మార్గం: ఉత్తరాఖండ్ పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు ద్వారా ఢిల్లీ నుంచి కోట్‌ద్వార్ చేరుకోవాలి. కోట్‌ద్వార్ నుంచి లాన్స్‌డౌన్‌కు 40కి.మీ దూరం ఉంటుంది. ఈ మార్గంలో రోజంతా సాధారణ బస్సులు ఉంటాయి. ప్రయాణం 90 నిమిషాల పాటు ఉంటుంది. 

రైలు మార్గం: ఢిల్లీ నుంచి కోట్‌ద్వార్ స్టేషన్‌కు చాలా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సు ద్వారా లాన్స్‌డౌన్ చేరుకోవచ్చు. 

ఎక్కడ స్టే చేయాలి

* లాన్స్‌డౌన్‌లో ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి. వాటి ధర కాస్త ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా, ప్రభుత్వ అతిథి గృహాలు (GMVN) ఉంటాయి. కాకపోతే వీటిని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

చూడవలసిన ప్రదేశాలు

* భుల్లా తాల్

* టిప్ ఇన్ టాప్ 

* దర్వాన్ సింగ్ మ్యూజియం

* భీమ్ పకోరా

* వార్ మెమోరియల్

* సెయింట్ మేరీ చర్చి

* హవా ఘర్

వీటితో పాటు మరికొన్ని హిందూ ఆలయాలను, చర్చ్‌లను కూడా సందర్శించవచ్చు. 

టూర్ బడ్జెట్..

*మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం మీ ప్రయాణ ఖర్చు ఉంటుంది. 

* రూం ధర వచ్చేసి రోజుకు దాదాపు రూ.2000 నుంచి రూ.2500 వరకు ఉంటుంది. 

*భోజన విషయానికి వస్తే రోజుకు ఒక్కొక్కరికి రూ.500 వరకు అవుతుంది.

*వివిధ ఎంట్రీ టిక్కెట్లు దాదాపు రూ.2 వేల వరకు కావచ్చు.

*మీ షాపింగ్‌కి అదనపు డబ్బు తప్పనిసరి అవుతుంది.

Show More
Back to top button