TRAVEL

గుల్మార్గ్ సోయగాలు చూసొద్దామా..?

మనదేశంలో పర్యాటక ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో గుల్మార్గ్ తప్పక ఉంటుంది. తన అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే, ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి? దీనికి బడ్జెట్ ఎంత వరకు అవుతుంది? అక్కడికి వెళ్లాక ఎటువంటి ప్రదేశాలు మనకు కన్నుల విందుగా ఉంటాయో తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే… ఈ ప్రాంత అందాల గురించి ఎన్ని రకాలుగా చెప్పినా తనివితీరదు. ఒకవైపు మంచుతో నిండిన కొండలు, మరోవైపు ఆకాశంతో పోటీపడుతూ.. వరుస క్రమంతో ఎంతో క్రమశిక్షణతో నిలబడినట్టుగా కనిపించే పచ్చని చెట్ల సోయగం..

నిజంగా చిత్రకారుడు గీసిన ఓ సుందర చిత్రంలా ఉంటుంది. ఈ ప్రదేశం జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో బారాముల్లా జిల్లాలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే గోల్ఫ్ క్రీడా మైదానం ఈ శీతాకాలంలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, మంచుదుప్పటి కప్పేసినట్లు కనిపించే ఇక్కడి ప్రాంతం స్కైయింగ్ క్రీడకు ప్రత్యేక విడిదిగా చెప్పుకోవచ్చు. 

చూడాల్సిన ప్రదేశాలు

ఇక్కడ గొండోలా లిఫ్ట్ అస్స‌లు మిస్స‌వ్వ‌కూడ‌దు. ఈ ప్ర‌దేశం కేబుల్ కార్‌కు ప్ర‌త్యేక గుర్తింపు పొందింది. ప్ర‌కృతి ప్ర‌సాదించిన నిర్మ‌ల‌మైన ఆకాశ‌పు అందాల‌ను వీక్షించేందుకు దీనిని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కేబుల్ కార్‌లో పర్యాటకులు ప్రయాణించి, అక్క‌డి ప్ర‌కృతి అందాలను మ‌న‌సారా ఆస్వాదించవచ్చు. అంతేకాదు ఇక్కడకు వచ్చినవారు తప్పక వీక్షించాల్సిన కొన్ని ప్రదేశాలను ఇప్పుడు చూద్దాం.

* దురుంగ్ జలపాతం

* స్ట్రాబెర్రీ వ్యాలీ

* ఖిలన్మార్గ్

* సెవెన్ స్ప్రింగ్స్

* సెయింట్ మేరీస్ చర్చి

* బాబా రేషి మందిరం  

ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది?

ఇక్కడికి చేరకోవడానికి ముందుగా మీరు విమానం, బస్సు లేదా ట్రైన్ ద్వారా శ్రీనగర్‌కి చేరుకోవాలి. ఈ రెండు ప్రయాణాలకు అనువుగా హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సెస్ అందుబాటులో ఉంటాయి. మీరు శ్రీనగర్ చేరుకున్నాక అక్కడి నుంచి గుల్మార్గ్ చేరుకునేందుకు జీపులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఉత్తరప్రాంతాల వారు ట్రైన్‌లో నేరుగా జమ్మూ చేరవచ్చు. జమ్మూ రైల్వేస్టేషన్ మీదుగా వచ్చే రైళ్లు దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలనూ కలుపుతూ పోతాయి. అంతేకాదు జమ్మూకాశ్మీర్లోని అన్ని ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులను ఉపయోగించుకోవచ్చు.  

* ఒకవేళ మీకు హైదరాబాద్ నుంచి గుల్మార్గ్ విమాన ప్రయాణం ద్వారా వెళ్లాలనుకుంటే.. టికెట్ ధర రూ.6,715 ఉంటుంది. నెల ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే ధర తగ్గే ఛాన్స్ ఉంటుంది.

* మీరు బస్సు ద్వారా ప్రయాణం చేయాలంటే టికెట్ ధర రూ. 2,600 ఉంటుంది.

* అదే మీరు ట్రైన్ ద్వారా ప్రయాణం చేయాలనుకుంటే టికెట్ ధర రూ.1175 వరకు ఉంటుంది.

Show More
Back to top button