భూమి మీద ప్రతి ప్రదేశానికి తనదైన అందం ఉంటుంది. ఎన్నో రకాల అందాలను ప్రకృతి మనకు అందిస్తుంది. అందులో ఒకటి బిన్సార్. ఇది మన భారత్‌లోనే ఉండడం అదృష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఈ ప్రదేశానికి వెళ్లి కూడా అంతే అనుభవం పొందవచ్చు. మధ్యతరగతి వారికి బిన్సార్ ఇక మినీ బడ్జెట్ స్విస్‌గా చెప్పవచ్చని అక్కడికి వెళ్లిన పర్యటకులు చెబుతున్నారు. అసలు అంతలా ఏం ఉంది బిన్సార్‌లో.. ఒక్కసారి అక్కడ చూడాల్సిన ప్రదేశాలేంటో ఒక లుక్ వేద్దామా..?
బిన్సార్ జీరో పాయింట్
బినేశ్వర్ మహాదేవ్ ఆలయం
మేరీ బడెన్ ఎస్టేట్
బిన్సార్ అభయారణ్యం మ్యూజియం
వివేకానంద ధ్యాన గుహ
కోసీ నది
సన్‌సెట్ పాయింట్
బిన్సార్ హైదరాబాద్ నుంచి 1789.5 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి విమాన, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంచుకునే రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది. ఈ ట్రిప్‌కు కనీసం 3 నుంచి 5 రోజుల వరకు పడుతుంది. అప్పుడే అన్ని ప్రదేశాలను కవర్ చేయగలరు.
ట్రిప్పు ఖర్చు..
రోజుకు భోజనానికి ఒక్కరికి రూ.300 నుంచి రూ.500 వరకు అవుతుంది.
రూంకు రూ.1500 నుంచి రూ.2000 వరకు అవుతుంది.
ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు రూ.2000 అనుకుందాం.
ఇతర ఖర్చులకు రూ.3000 వరకు అధికంగా తీసుకెళ్లండి.
ఇక షాపింగ్ ఖర్చుకు వేరుగా పట్టుకెళ్లండి.