TRAVEL

సిమ్లా ట్రిప్ ప్లాన్‌కి చేయండిలా..!

ప్ర కృతి అందాలు చూడాలంటే సిమ్లా వెళ్లాల్సిందే. ఇది ఒక్కప్పటి భారతదేశపు వేసవి రాజధాని. బ్రిటీష్‌ కాలంలో దీన్ని ఒక అందమైన గ్రామంగా తీర్చిదిద్దారు. అక్కడి పచ్చటి దేవదారు అడవిలో, పొగ మంచుతో కప్పబడిన పర్వతాలు, భవనాలు, సందడిగా ఉండే మార్కెట్‌ల అద్భుతమైన ప్రదేశాలను చూడడానికి రెండు కనులు సరిపోవు.

అంతటి అందమైన దృశ్యాలే చూడడానికి సిమ్లా ఎలా వెళ్లాలి..? ఎంత ఖర్చు అవుతుంది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

సిమ్లా వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మీ నీవాస స్థలం నుంచి చండీగఢ్‌ విమానాశ్రయం ద్వార వెళ్లవచ్చు. రెండోది కల్కా రైల్వే స్టేషన్‌కి వెళ్లి వెళ్లవచ్చు. 

కల్కా రైల్వే స్టేషన్ నుండి చండీగఢ్ 112.6 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

చండీగఢ్ విమానాశ్రయం నుంచి సిమ్లా చేరుకోవడానికి ప్రైవేటు బస్సు లేదా టాక్సీలో వెళ్లవచ్చు. మీ బడ్జెట్ బట్టి మీ రవాణా మార్గాన్ని ఎంచుకోండి.

సిమ్లా అందాలు చూడాలంటే.. మార్చి నుండి జూన్ వరకు మంచి సమయం అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ నెలల్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత 15-30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటంతో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఏప్రిల్‌లో జరిగే సిమ్లా ఆర్ట్ ఫెస్టివల్ కూడా నగరాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయంగా చాలా మంది పర్యాటకులు చెబుతున్నారు. మీరు చలిని తట్టుకోగలరు అనుకుంటే.. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో కూడా సిమ్లాకు వెళ్లవచ్చు. కానీ, వర్షాకాలంలో ఈ ప్రదేశానికి దూరంగా ఉండటం మంచిది. 

సిమ్లాలో చూడదగ్గ 10 ప్రధాన స్థలాలు

ఈ సుందరమైన ప్రదేశంలో చూడదగ్గ అందాలు మరో 10 ప్రాంతాలు ఉన్నాయి. అవి పర్యటకులను ఆకర్షిస్తాయి.

అవేంటో ఒక లుక్ వేద్దాం. 

  • మాల్ రోడ్
  • ది రిడ్జ్
  • కుఫ్రీ
  • జాఖూ దేవాలయం
  • కాల్కా- సిమ్లా రైల్వే
  • క్రీస్తు చర్చి
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ
  • మషోబ్రా
  • చాడ్విక్ జలపాతం
  • కాళీ బారి దేవాలయం

ఇలా ఇవన్నీ.. చూడడానికి కనీసం 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. 3 రోజులకు గాను ఒకరికి దాదాపు రూ.6,500 నుంచి రూ.9000 వరకు ఖర్చు అవుతుంది.

Show More
Back to top button