TRAVEL

కొడైకెనాల్ అందాలు చేసొద్దామా?

కొడైకెనాల్ తమిళనాడులో ఉంది. ఇది దివిలో స్వర్గధామం అని చెప్పవచ్చు. ఎత్తైన కొండలు, పచ్చదనం పరచుకున్న లోయలు అక్కడక్కడ పారుతున్న నదులతో కొడైకెనాల్ అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇంతటి అందమైన ప్రదేశానికి ఎలా వెళ్లాలి..? ఎంత ఖర్చు అవుతుంది..? అక్కడ ఏ ప్రదేశాలు చూడవచ్చు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొడైకెనాల్‌కు ఎలా చేరుకోవాలి.?

మీరు విమానం ద్వారా కొడైకెనాల్‌కు చేరుకోవాలనుకుంటే ముందుగా మధురై లేదా కోయంబత్తూర్ లేదా తిరుచునాపల్లి విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడ నుండి టాక్సీలో, రైలు, బస్సులో వెళ్లవచ్చు.

*ఒకవేళ రైలు ద్వారా వెళ్లాలనుకుంటే ముందుగా చెన్నై‌కి వస్తే అక్కడి నుంచి మధురైకి ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. మధురై నుండి కొడైకెనాల్ చేరుకోవచ్చు. 

*ఇక రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే కొడైకెనాల్‌కి బెంగుళూరుకు 460 కి.మీలు, తిరుచానూరుకు 90 కి.మీలు, చెన్నైకి 530 కి.మీలు, ఊటీకి 55 కి.మీలు, కోయంబత్తూరు‌కు 175 కి.మీల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశాల నుంచి బస్సులో లేదా కారులో చేరుకోవచ్చు.

కొడైకెనాల్‌లో చూడాల్సిన ప్రదేశాలు..

*కురింజి ఆండవర్ ఆలయం

*శాంతి లోయ

*గుణ గుహ

*పైన్ వృక్షాల అరణ్యం

*గ్రీన్ వ్యాలీ వ్యూ

*సెయింట్ మేరీ చర్చి

*పంపార్ జలపాతం

*కొడై సరస్సు

*పిల్లర్ రాక్స్

*బెరిజం లేక్

*కోకర్స్ కేవ్స్

*కురింజి ఆండవర్ ఆలయం

కొడైకెనాల్‌కి ఏ సమయంలో వెళ్లాలి..?

*కొడైకెనాల్‌ ఒక హిల్ స్టేషన్ కావడంతో వేసవి కాలంలో వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే నెలల్లో ఈ ప్రదేశానికి వెళ్తే ప్రకృతి అందాలను చూసే అవకాశం మీ సొంతం అవుతుంది.

Show More
Back to top button