TRAVEL

చిక్ మంగళూర్ అందాలు చూసొద్దామా..!

వర్షాకాలంలో ప్రకృతి అందాలు చూడాలనుకునే పర్యాటకులు ‘చిక్ మంగళూర్’ హిల్ స్టేషన్‌కు తప్పకుండా వెళ్లాల్సిందే. మరి ఆ టూర్‌కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి? ఏయే ప్రదేశాలు చూడాలి? వెళ్లేందుకు ఎలా ప్లాన్ చేయాలి? ట్రిప్ బడ్జెట్ ఎంత అవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.చిక్ మంగళూర్ వెళ్లడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 

*విమానం ద్వారా వెళ్లాలనుకుంటే బెంగళూరుకి చేరుకొని అక్కడి నుంచి బస్సు, లేదా క్యాబ్ ద్వారా వెళ్లవచ్చు. టికెట్ ధర మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు టికెట్ ధరలు చెక్ చేసుకుని బుక్ చేసుకోండి.

*రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు డైరెక్ట్ రైలు అందుబాటులో ఉంది. అక్కడి నుంచి చిక్ మంగళూర్ బస్సు, లేదా క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు.

చిక్ మంగళూర్ చూడాల్సిన ప్రదేశాలు..!

* ముల్లయనగిరి

* బాబా బుడాంగిరి

* కుద్రే ముఖ్ జాతీయ పార్క్

* భద్ర నదిపై రాఫ్టింగ్

* భద్ర వన్యప్రాణి అభయారణ్యం

* ఝరి జలపాతాలు

* శృంగేరి శారదాంబ పీఠం

* కెమ్మనగుడి

* బెలవడి

ఇంకా మీకు ఎక్కువ సమయం ఉన్నట్లయితే అక్కడ ఉండే కాఫీ తోటలలో పర్యటిస్తూ విశ్రాంతి తీసుకోండి. 

టూర్ బడ్జెట్..

*మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం మీ ప్రయాణ ఖర్చు ఉంటుంది. 

*రూం ధర వచ్చేసి రోజుకు దాదాపు రూ.1500 నుంచి రూ .4500 వరకు ఉంటుంది. 

*ట్రెక్కింగ్ కాస్ట్ రూ.1500 అవుతుంది.

*భోజనం విషయానికి వస్తే రోజుకు ఒక్కొక్కరికి రూ.500 వరకు అవుతుంది.

*వివిధ ఎంట్రీ టికెట్లు దాదాపు రూ.6 వేల వరకు కావచ్చు.

*మీ షాపింగ్‌కి అదనపు డబ్బు తప్పనిసరి.

Show More
Back to top button