గత కొన్ని రోజుల నుంచి లక్షద్వీప్, మాల్‌దీవ్స్ గురించి సోషల్ మీడియాలో ఎంతో డిబేట్ జరిగింది. ప్రధాని మోడీ లక్షద్వీప్ వెళ్లి దిగిన పిక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో లక్షద్వీప్‌ని మాల్‌దీవ్స్‌తో పోలుస్తూ వర్ణించారు. ఆ పిక్స్‌పై మాల్‌దీవ్స్ అధికారులు విమర్శించడంతో భారత్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో మాల్‌దీవ్స్ వద్దు లక్షద్వీప్ ముద్దు అని నెటిజన్లు పోస్టులు చేయడం ప్రారంభించారు. అంతేకాదు, ‘బాయికాట్ మాల్‌దీవ్స్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయ్యింది. చాలా వరకు సెలబ్రెటీలు కూడా ఇక మాల్‌దీవ్స్‌కి వెళ్లమంటూ తెలిపారు. చాలామంది భారతీయులు లక్షద్వీప్ వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. దీంతో లక్షద్వీప్‌పై ఎన్నో ప్యాకేజీలు కూడా వచ్చాయి. అయితే, ప్రయాణించడానికి లక్షద్వీప్ బెటర్‌రా..? మాల్‌దీవ్స్..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
లక్షద్వీప్‌లో చూడగల ప్రదేశాలు
లక్షద్వీప్‌లో చూడడానికి మినీకాయ్ ద్వీపం, కద్మత్ ద్వీపం, కవరత్తి ద్వీపం, మెరైన్ మ్యూజియం, పిట్టి పక్షుల అభయారణ్యం, తిన్నకర ద్వీపం, కల్పేని ద్వీపం, బంగారం అటోల్, అగట్టి ద్వీపం, కిల్తాన్ ద్వీపం, అమినీ బీచ్, ఆండ్రోడ్ ద్వీప్ ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి.
అదే మాల్‌దీవ్స్‌లో అయితే.. మాలే అటోల్, సన్ ఐలాండ్ , బనానా రీఫ్, అలిమత ద్వీపం, కృత్రిమ బీచ్, ఫిహల్హోహి ద్వీపం, ఉతీము గండువారు, బియాధూ ద్వీపం, వెలిగండు ద్వీపం బీచ్, రోస్ ద్వీపం, ఎంబూదు ఫినోల్హు ద్వీపం ఇలా చెప్పుకుంటూ పోతే 50కి పైగా ప్రదేశాలు ఉన్నాయి.
ప్రయాణ ఖర్చు
లక్షద్వీప్ వెళ్లడానికి షిప్, విమానాలు అందుబాటులో ఉన్నాయి. వాటి టికెట్ ధర దాదాపు రూ.12 వేలు అవుతుంది. అదే మాల్‌దీవ్స్‌కి వెళ్లడానికి విమాన మార్గం ఒకటే ఉంది. దీని ధర రూ.30 వేలు ఉంటుంది.
సౌకర్యాలు
లక్షద్వీప్‌తో పోలిస్తే మాల్‌దీవ్స్‌కి ఎక్కువ యాత్రికులు వస్తారు. కాబట్టి మాల్‌దీవ్స్‌లో ఎక్కువ ఇంఫ్రస్ట్రక్చర్ ఉంటుంది.
లక్షద్వీప్‌కు అయ్యే ఖర్చు
* లక్షద్వీప్‌లో నివసించడానికి రోజుకు రూంకు రూ.2000 నుంచి రూ.7000 వరకు అవుతుంది.
* తినడానికి రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు అవుతుంది.
* ఇతర ఖర్చు రూ.2000 అవుతుంది.
మాల్‌దీవ్స్‌కు అయ్యే ఖర్చు
* మాల్‌దీవ్స్‌లో నివసించడానికి రోజుకు రూంకు రూ.7000 నుంచి రూ.12000 వరకు అవుతుంది.
* తినడానికి రోజుకు రూ.1200 నుంచి రూ.1500 వరకు అవుతుంది.
* ఇతర ఖర్చు రూ.10000 అవుతుంది.
* షాపింగ్ చేయడానికి ఇక్కడ చాలా రకాల పచ్చళ్లు, ఎన్నో రకాల నగలు దొరుకుతాయి.