పరీక్షలు అయిపోవడంతో చాలామంది పిల్లలతో కలిసి టూర్ వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈ సమయంలో ఏ ప్రదేశానికి వెళ్లాలి అనేదే పెద్ద ప్రశ్న. మీకు ఈ ప్రశ్న ఎదురైతే.. తవాంగ్‌ను మీ లిస్ట్‌లో కలుపుకోండి. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ మనసును మైమరిపించే జలపాతాలు, నదులు, బుద్ధ సన్యాసుల ఆశ్రమాలు ఉన్నాయి. కొత్త అనుభూతిని మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఇక్కడికి తప్పకుండా వెళ్లాల్సిందే. ఈ ప్రదేశానికి రైలు మార్గం ద్వారా చేరుకోవడానికి.. తవాంగ్‌కు సమీపంలో ఉన్నఅస్సాంలోని రంగపరా రైల్వే స్టేషన్‌కు ముందుగా చేరుకోవాలి. ఇక్కడి నుంచి తవాంగ్ దాదాపు 383 కి.మీ దూరం ఉంటుంది. మీరు బస్సులో లేదా క్యాబులో వెళ్లవచ్చు. అలాగే మీరు నేరుగా మీ స్థలం నుంచి తవాంగ్‌కు రోడ్డు మార్గంలో కార్‌లో లేదా బస్సులో వెళ్లవచ్చు. విమానంలో వెళ్లాలనుకుంటే ముందుగా అస్సాంలోని తేజ్‌పూర్ సమీప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తవాంగ్ చేరుకోవచ్చు.
ఈ ప్రదేశాలు తప్పకుండా చూడండి.
*కమెంగ్ సరస్సు
*జస్వంత్ ఘార్
*పంకంగ్ సరస్సు
*గోరిచెన్ పీక్
*తవాంగ్ వార్ మెమోరియల్
*నురనంగ్ ఫాల్స్
*మధురి లేక్
*తవాంగ్ మొనెస్టెరీ
*సెల పాస్
తవాంగ్ టూర్ ఖర్చు
*మీరు ఎంచుకునే రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది.
*రూమ్‌కు దాదాపు రూ.1200 నుంచి రూ.3000 వరకు ఖర్చు అవుతుంది.
*ఒకరికి భోజనానికి రోజుకు దాదాపు రూ.500 నుంచి రూ.700 వరకు అవుతుంది.
*ఇక్కడి ప్రదేశాలను సందర్శించడానికి రోజుకు ప్రయాణ ఖర్చు దాదాపు రూ.400 నుంచి రూ.500 వరకు అవ్వొచ్చు.
*మీరు షాపింగ్ చేయాలనుకుంటే మరికొంత డబ్బు ఎక్కువగా తీసుకుని వెళ్లడం మంచిది.
*వివిధ ఎంట్రీ టికెట్‌లకు దాదాపు రూ.1000 నుంచి రూ.2000 వరకు అవుతుంది.