TRAVEL

కామాఖ్య దేవి ఆలయం చూసొద్దామా..?

భారతదేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో శక్తి పీఠాలకు ఉండే ప్రత్యేకతే వేరు. ఎంతోమంది శక్తి పీఠాలన్నింటిని దర్శించుకోవాలని అనుకుంటారు. అందులో ఒకటైన కామాఖ్యా దేవి ఆలయం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయం అస్సాంలోని గౌహతి ప్రదేశంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి వెళ్లడానికి రైలు లేదా విమాన మార్గంలో వెళ్లవచ్చు.

రైలు మార్గం: తెలుగు రాష్ట్రాల నుంచి గౌహతి రైలు మార్గంలో  చేరుకోవడానికి దాదాపు 45 నుంచి 50 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్ నుంచి గౌహతికి వెళ్లడానికి వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. లేదా ముందుగా కలకత్తాకు చేరుకుని అక్కడి నుంచి కూడా గౌహతి చేరుకోవచ్చు. కామాఖ్యా దేవి ఆలయం చేరుకోవడానికి రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి కామాఖ్య రైల్వే స్టేషన్. మరొకటి గౌహతి రైల్వే స్టేషన్. వీటి వివరాలు IRCTCలో చెక్ చేసుకోవచ్చు.
 
విమాన మార్గం: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి గౌహతికి డైరెక్ట్ ట్రెయిన్స్ అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్ నుంచి వన్ స్టాప్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రోజూ ఒక్కోలా ఉంటాయి. ఏ రోజు తక్కువగా ఉండే ఆ రోజుకు బుక్ చేసుకోండి.
 
ఆలయానికి ఎలా వెళ్లాలి..?

కామాఖ్యా దేవి ఆలయం కామాఖ్య రైల్వే స్టేషన్ నుంచి 5.5 కి.మీ దూరం ఉంటుంది. అదే గౌహతి రైల్వే స్టేషన్ నుంచి 8.5 కి.మీ దూరం ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఏ స్టేష‌న్‌లో దిగాలో ఎంచుకోండి. గౌహతి ఎయిర్‌పోర్ట్ నుంచి కామాఖ్యదేవి ఆలయం 22 కి.మీ ఉంటుంది. కామాఖ్య మందిర్ గేట్ నుంచి ఆలయం 3 కి.మీ దూరం ఉంటుంది. గేట్ నుంచి ఆలయానికి ఘాట్ రోడ్డు ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. మీరు రూం తీసుకోవాలనుకుంటే ఈ ప్రాంతంలో తీసుకోవడం బెటర్. ఈ గేట్ నుంచి ఆలయానికి వెళ్లడానికి షేర్డ్ వెహికల్స్ కూడా ఉంటాయి.  
ఏ ఏ ప్రదేశాలు చూడవచ్చు..?

గౌహతి చేరుకున్నాక కామాఖ్యా దేవి ఆలయంతో పాటు ఇతర ప్రదేశాలను కూడా చూడవచ్చు. అవేంటంటే..

శ్రీ ఉమానంద ఆలయం
పూర్వ తిరుపతి బాలాజీ ఆలయం
మా బగలాముఖి ఆలయం
అస్సాం స్టేట్ మ్యూజియం
బసిస్త ఆలయం
సరోగట్ బ్రిడ్జి
 
టూర్ ఖర్చు ఎంత..?

మీరు ఎంచుకునే రవాణా ప్రకారం మీ ప్రయాణ ఖర్చు అవుతుంది.
హోటల్ రూమ్‌కు రోజుకు రూ.1500 నుంచి రూ.3000 వరకు ఖర్చవుతుంది.
భోజనానికి రోజుకు దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు అవుతుంది.
ట్రాన్స్‌పోర్ట్‌కి రూ.1500 వరకు అవ్వొచ్చు.
ఇతర ఖర్చులు రూ.2000 వరకు అవుతాయి.

దీన్ని బట్టి మీరు మీ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.

Show More
Back to top button