TRAVEL

తక్కువ బడ్జెట్‌లో షిర్డీ టూర్‌..

రిగ్గా ప్లాన్ వేసుకుని వెళ్లగలిగితే తెలుగు రాష్ట్రాల నుంచి షిర్డీ 2 రోజుల టూర్ రూ.5,500తో వెళ్లి రావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్లాన్ చేసుకుందామా మరి.. దీనికోసం ముందుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్ రైలులో నాగర్సోల్ రైల్వేస్టేషన్ చేరుకోవాలి. అక్కడ షిర్డీ వెళ్లడానికి టాక్సీలు ఉంటాయి లేదా మీరు కారును కూడా బుక్ చేసుకోవచ్చు. నాగర్సోల్ రైల్వేస్టేషన్ నుంచి షిర్డీ 42 కి.మీల దూరం ఉంటుంది. ఈ ప్రయాణం ఒక గంట వరకు పడుతుంది. అదే మీరు నాగర్సోల్ రైల్వేస్టేషన్ నుంచి షిర్డీ రైల్వేస్టేషన్ వెళ్లడానికి దాదాపు మూడున్నర గంటలు పడుతుంది.  విమానంలో షిర్డీ వెళ్లాలనుకుంటే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి షిర్డీకి విమానాలు ఉన్నాయి. ఎక్కువ ఖర్చు పెట్టేవారు ఇలా కూడా వెళ్లవచ్చు. షిర్డీ విమానాశ్రయం నుంచి ఆలయం 16 కి.మీల దూరం ఉంటుంది. క్యాబ్ లేదా టాక్సి లేదా ప్రైవేటు కారు బుక్ చేసుకుని వెళ్లవచ్చు.
 
ఆలయ సమీపంలో ముందుగానే హోటల్ బుక్ చేసుకోవచ్చు. లేదా అక్కడికి వెళ్లిన తర్వాత కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు. రూమ్ ధర దాదాపు రూ.800-రూ.1500 వరకు ఉంటుంది. చెక్ ఇన్ అయిన  తర్వాత ఫ్రెష్ అయ్యి ఆలయానికి వెళ్లి సాయిబాబాను దర్శించుకోవచ్చు. ఒక్కరికి రోజుకు ఆహారానికి రూ.400 వరకు ఖర్చు అవుతాయి. తర్వాత సైట్ సీయింగ్‌కి ఆటోలో వెళ్తే రూ.500 అవుతుంది. ఇతర ఖర్చులు రూ.1000 వరకు అవుతాయి. మొత్తం కలిపి రూ.5,500 వరకు అవుతుంది. కాబట్టి, మీరు మీ బడ్జెట్ ప్రకారం మీ రవాణా, రూమ్‌ను ఎంచుకోండి. షిర్డీ నుంచి నాసిక్ కూడా వెళ్లాలనుకుంటే రూ.300 నుంచి రూ.350 వరకు అదనంగా ఖర్చవుతుంది. ఇదండి షిర్డీ టూర్ ప్లాన్.. ఇంకెందుకు ఆలస్యం మరి టూర్ ప్లాన్ చేసేద్దామా..?

Show More
Back to top button