భారత పార్లమెంట్‌లో సమావేశాలు జరుగుతున్న సమయంలో నలుగురు ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి పార్లమెంట్ హాల్‌లోకి చొరబడ్డారు. వీరు లోపలికి దూకిన వెంటనే ఎంపీలు భయపడిపోయి బయటకు పరుగులు తీశారు. వెంటనే వారిలో ఓ ఆగంతకుడు బూట్లలో నుండి టియర్ గ్యాస్ క్యాన్ తీసి ఓపెన్ చేశాడు. దాంతో అందులోనుండి వచ్చిన పొగలు పార్లమెంట్ హాలు మొత్తంగా వ్యాపించాయి.
ఈలోపు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ నలుగురు పార్లమెంట్ లోపలికి ఎలా చేరుకోగలిగారు? వీరు పార్లమెంట్ విజిటర్స్ గ్యాలరీ దాకా ఎలా చేరుకున్నారు? బూట్లలో టియర్ గ్యాస్ క్యాన్లు ఎలా తీసుకెళ్ళగలిగాడు? వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
అయితే, పార్లమెంటును చేరుకోవడం అంత సులభం ఏమి కాదు. మూడంచెల భద్రతను దాటుకొని వెళ్లి దాడి చేయడమంటే కల అని చెప్పవచ్చు. భద్రతా సిబ్బందిలోని ఎవరో ఒకరు ఈ నలుగురికి సాయం చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ ఘటనతో నూతన పార్లమెంట్ వద్ద భద్రతా వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో అర్థమవుతోంది. అంతేకాదు 2001లో పార్లమెంటు భవనంపై ఉగ్రవాదులు దాడిచేసిన రోజునే ఇప్పుడు ఈ దుండగులు ఎంచుకున్నారు. అయితే దీనిపై ఏమన్నా ఉగ్రవాద ప్రేరేపిత కారణాలు ఉన్నాయా అనేది కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా జరగడం కుట్ర కోణం దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ అంశం గురించి చర్చించాలని ప్రతిపక్షాలు కోరగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరుతున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనప్పటకీ.. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన పార్లమెంట్‌లో ఇలా దాడులు జరగడం గమనార్హం.