Telugu Opinion Specials

త్వరలో కనీ వినీ ఎరుగని ఆర్థిక మాంద్యం రాబోతుందా..?

కరోనా సమయం నుంచి భారతదేశ ఆర్ధిక పరిస్థితి అతలాకుతలంగానే ఉంది. దీనికి తోడు అమెరికాకు చెందిన హారి డెంట్ అనే ఎకనామిస్ట్‌ రాబోయే ఆర్థిక మాంద్యం మీద తన అంచనాను తెలిపారు. 2025లో ప్రపంచం ఓ ఆర్థిక మాంద్యం(రిసెప్షన్)ను ఎదురుకోనుందట. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఇది ఉండబోతుందని హారి డెంట్ అన్నారు. ఇప్పటి వరకు డెంట్ వేసిన అంచనాలన్నీ దాదాపు అన్నీ నిజమయ్యాయి. ఇది కూడా నిజం కావచ్చని చాలామంది ఆర్థిక నిపుణులు కూడా అంటున్నారు.

1929లో వచ్చిన ది గ్రేట్ డిప్రెషన్, 2008లో కలిగిన రిసెషన్ కంటే ఈసారి వచ్చే రిసెషన్ భారీగా ఉండబోతుందని నిపుణుల అంచనా. ఈ ఆర్థిక మాంద్యం అమెరికాలో ప్రారంభం కానుందట. దాని ప్రభావం ప్రపంచమంతా పడుతుందని వారు చెబుతున్నారు. ఇంత కచ్చితంగా ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పడానికి హారి డెంట్ 5 ఆంశాలను వెల్లడించారు.  

*మొదటి అంశం: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. కరోనా సమయంలో అమెరికా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేసి ప్రజలకు పంచింది. దీనివల్ల ద్రవ్యోల్భణం తారస్థాయికి చేరింది. ఇది ఆ దేశానికి ముప్పుగా మారుతుందని చెప్పవచ్చు.

*రెండవ అంశం: NINJA లోన్స్ అందించడం. NINJA లోన్స్ అంటే నో ఇన్‌కం, నో జాబ్, నో అస్సెట్. అంటే ఎలాంటి హామీ లేకుండా ప్రజలకు రుణాలు ఇవ్వడం. అమెరికాలోని పలు పెద్ద బ్యాంకులు ఎలాంటి ఆదాయం లేని వారికి కూడా పెద్ద ఎత్తున రుణాలను అందించాయి. దీనివల్ల ఎక్కువ లాభాలు వస్తాయని విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించాయి. దీనివల్ల ఎన్నో దేశాలు అమెరికా బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టాయి. ఇప్పుడు రుణం తీసుకున్నవారు తిరిగి చెల్లించే స్థాయిలో లేకపోవడంతో బ్యాంకులు దివాళా తీసే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులు అమెరికా బ్యాంకుల్లో పెట్టిన పెట్టుబడులు తిరిగి తీసుకుంటున్నారు.

 *మూడవ అంశం: డాలర్ విలువ తగ్గడం. 1970 నుంచి 1990 వరకు చాలా వరకు దేశాలు వాణిద్య వ్యాపారాలకు డాలర్లను ఉపయోగించేవి. దీనివల్ల దాదాపు అన్ని దేశాలు వారి సెంట్రల్‌ బ్యాంకుల్లో బంగారం నిలువలతో పాటు డాలర్ నిలువలను కూడా పెట్టుకునే వారు. కానీ, ప్రస్తుతం చైనా, భారత్‌తో సహ ఇతర దేశాలు వాటి కరెన్సీని వాణిద్య వ్యాపారాల లావాదేవీలకు ఉపయోగించడం ప్రారంభించాయి. దీనివల్ల డాలర్ నిలువలు తగ్గవచ్చు. ఇలా జరిగితే బంగారం నిలువలు పెరుగుతాయి. దీని ప్రకారం రానున్న రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. డాలర్ విలువ తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌ మీద కూడా పడుతుంది.

*నాలుగవ అంశం: ఆర్థిక మాంద్యానికి మొదటి మెట్టు ఉద్యోగాలు పోవడం. ఇప్పుడు చూసుకుంటే ఎన్నో కంపెనీలు వారి ఉద్యోగులను తీసేస్తున్నారు. దీనికి తోడు AI వల్ల చాలామంది జాబ్స్ రిస్క్‌లో పడ్డాయి. దీనిని అధిగమించాలంటే AIకి పోటీగా స్కిల్స్‌ని పెంచుకోవాలి.

*ఐదవ అంశం: దేశం అప్పుల్లో ఉండడం. ప్రస్తుతం అమెరికా అప్పుల్లో ఉంది. ఏ దేశం అయితే అప్పుల్లో కూడుకుని ఉంటుందో ఆ దేశం దివాళ తీసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. IMF కథనం ప్రకారం ప్రపంచంలోనే 70 దేశాల వరకు అప్పుల ఊబీలో కూడుకుని ఉన్నాయి. అంతేకాదు, మొత్తం ప్రపంచ ఎకానమీ వాల్యూ 100 ట్రిలియన్ డాలర్స్‌ ఉంటే.. అన్ని దేశాల అప్పులు కలిపి 300 ట్రిలియన్ డాలర్స్ ఉంది.

దీని బట్టి చెప్పవచ్చు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయని. దీనివల్ల అన్ని దేశాలు ఆర్థిక మాంద్యం ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణుల అంచనా. కాబట్టి వచ్చే రిసెషన్‌ను అధిగమించాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోవాలి. సరైన వాటిలో పెట్టుబడులు పెట్టాలి. ఎక్కువ అప్పులు చేయకపోవడం బెటర్ అని ఆర్థిక నిపుణులు సలహానిస్తున్నారు.

Show More
Back to top button