ప్రస్తుత రోజుల్లో ఏ రంగంలో ఓటమి చెందినా దాని ఎఫెక్ట్ కొంత సమయం వరకే ఉంటుంది. కానీ రాజకీయాల్లో ఓటమి ఎదురైతే మాత్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది తెలంగాణ రాజకీయ పరిణామాలు చూస్తే అర్థం అవుతాది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినా 37 అసెంబ్లీ సీట్లతో గౌరవప్రదమమైన స్థానం దక్కించుకొంది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఎంపీ సీటుని కూడా గెలుచుకోలేకపోయిండింది. ఇక్కడినుంచే బీఆర్ఎస్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. మరో నాలుగున్నరేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సిన బీఆర్ఎస్‌ను రేసులో లేకుండా చేయాలన్న మాస్టర్ ప్లాన్ ను రెండు జాతీయ పార్టీలు మొదలెట్టాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమంటే కాదు కాంగ్రెస్ లోనే విలీనం అన్న ప్రచారానికి రెండు ప్రధాన జాతీయ పార్టీలు తెరలేపాయి.
ఒకానొకప్పుడు రాష్ట్రంలో పది సంవత్సరాలుపాటు అసలు తనకు ప్రత్యర్థియే లేడన్నట్లుగా బీఆర్ఎస్ హవా నడిచింది. అలాంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతోంది త్వరలో అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తూంటే… లేదు బీజేపీతో విలీనం అంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. విలీనం ఏంటి మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం ఏకంగా యాభై ఏళ్ల పా దాటి బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయంగా తన ఉనికిని బలంగా చాటుకుంటుందని కేటీఆర్ ఒక పక్కన ఢంకా మోగిస్తున్నారు. అయినా సరే ఈ విలీనం ప్రచారం ఆగడం లేదు. అది ఇపుడు ఎక్కడికి వరకు వెళ్లిందంటే.. బీఆర్ఎస్ విలీనం అయితే ఏ పదవులు ఆ పార్టీ నేతలకు దక్కుతాయో లిస్ట్ చదివి మరీ చెబుతున్నారు రెండు జాతీయ పార్టీల నేతలు.
ఢిల్లీ టూర్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజెపీతో విలీనం ఖాయమని ఒక బాంబు లాంటి వార్తనే పేల్చారు. ఈ విలీనం తర్వాత కేసీఆర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారని కేటీఆర్‌కి కేంద్రమంత్రి పదవి ఇస్తారని, తెలంగాణా అసెంబ్లీలో విపక్ష నేతగా హరీష్ రావుని నియమిస్తారని కవితను బెయిల్ ఇచ్చి బిగ్ రిలీఫ్ అందిస్తారరని తన మాటలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా ఇదే జరుగుతుందని చెబుతున్నారు. దానికి బీజేపీ నుంచి కూడా గట్టి కౌంటర్ పడింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ ఇచ్చిన స్టేట్మెంట్‌ని తప్పుబడుతూ.. బీఆర్ఎస్ బీజేపీతో వీలీనం కాదని కాంగ్రెస్‌తోనే విలీనం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. అలా విలీనం అయితే కేసీఆర్ కి కాంగ్రెస్‌లో ఏఐసీసీ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని, అలాగే కేటీఆర్‌కి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారని హరీష్ రావుకు రాష్ట్రమంత్రి పదవి ఇస్తారని, కవితకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు చూస్తే బీఆర్ఎస్‌కి విలీనం తప్ప మరో దారి లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. మరి ఇంతకీ బీఆర్ఎస్ విషయంలో విలీనం అని పదే పదే చెబుతున్న మాటలే నిజం అవుతాయా.. లేక 2028 ఎన్నికల్లో తన స్వీయతత్వాన్ని చూపిస్తోందా అన్నది వేచి చూడాల్సిందే.