Telugu Politics

పార్టీల వరాల జల్లు-ఓటర్లను ఆకట్టుకునేనా..?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అధికారం కోసం BRS, BJP, CNG పార్టీలు నువ్వానేనా? అన్నట్టు మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అయితే, పార్టీ నేతలు ఈ మేనిఫెస్టోల్లో ఏయే అంశాలు ప్రకటించారు? వీటి పట్ల రాజకీయ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

*BRS మేనిఫెస్టో

* ‘కేసీఆర్ బీమా ప్రతి ఇంటింటి ధీమా’ పేరుతో రూ.5 లక్షల బీమా పథకం.
* ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.15 లక్షల పెంపు.
* సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేల గౌరవ వేతనం.
* దివ్యాంగుల పెన్షన్లు రూ.6 వేలకు పెంపు (అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా పెంపు).
* ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంపు (అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా పెంపు).
* రైతుబంధు కింద రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంపు (అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా పెంపు).
* బీసీలకు అమలు చేస్తున్న పథకాలు అలాగే కొనసాగింపు.
* దళిత బంధు యథావిధిగా కొనసాగింపు.
* గిరిజనేతరులకు కూడా పోడు భూములు ఇచ్చే అంశం పరిశీలిస్తాం.
* అర్హులైన వారందరికీ రూ.400కే సిలిండర్, అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా రూ.400కే సిలిండర్.
* తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం.
* హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు.
* ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ డిమాండ్‌పై కమిటీ ఏర్పాటు.
* లంబాడీ తండాలు, గోండు గూడేలకు పంచాయతీలు.
* అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి భూ హక్కులు.
* ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు.

* CNG
 
1. మహాలక్ష్మి
మహిళలకు ప్రతీ నెల రూ.2500, రూ.500కే గ్యాస్ సిలిండర్. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
2. రైతు భరోసా ప్రతి ఏటా
రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15000, వ్యవసాయ కూలీలకు రూ.12000, వరి పంటకు రూ.500 బోనస్.
3. గృహ జ్యోతి
కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
4. ఇందిరమ్మ ఇండ్లు
ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షలు. ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం.
5. యువ వికాసం
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
6. చేయూత
రూ.4000 నెల వారీ పింఛను (పెన్షన్). రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా.

 ఆరు గ్యారంటీలతోపాటు 36 అంశాలను చేర్చారు.

* BJP

* బీసీ ముఖ్యమంత్రి.
* ధరణికి బదులుగా మీ భూమి యాప్‌.
* ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలన.
* వెనుకబడిన వర్గాల సాధికారత, అందరికీ సమానమైన చట్టం వర్తింపు.
* కూడు-గూడు, అందరికీ ఆహార, నివాస భద్రత.
* రైతే రాజు- అన్నదాతలకు అందలం.
* విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్‌పుట్‌ అసిస్టెన్స్‌.
* మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు.
* మహిళా రైతుల కోసం.. మహిళా రైతు కార్పొరేషన్‌.
* యువశక్తి-ఉపాధి.. యూపీఎస్సీ తరహాలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ.
* ఈడబ్ల్యూఎస్‌ కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ.
* వైద్యశ్రీలో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా.
* గల్ఫ్‌ బాధితుల కోసం నోడల్‌ ఏజెన్సీ.
* కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ.
* మండల కేంద్రాల్లో నోడల్‌ స్కూళ్ల ఏర్పాటు.
* వరికి రూ.3100 మద్దతు ధర.
* నిజామాబాద్‌లో టర్మరిక్‌ సిటీ.
* ఆడబిడ్డ భరోసా కింద 21 ఏళ్లు వచ్చేనాటికి రూ.2 లక్షలు అందజేత.
* ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ.
* సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను రీయింబర్స్‌మెంట్‌.
* అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు.
* స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీతోనే రుణాలు.
* రైతులకు ఉచితంగా దేశీ ఆవులు.
* రైతులకు ఉచితంగా పీఎం పంటల బీమా.
* వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ టూర్లు.
* ఉమ్మడి పౌరస్మృతి కోసం కమిటీ ఏర్పాటు.
* మేడారం జాతరకు జాతీయ స్థాయిలో గుర్తింపు.
* నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు.
* బీఆర్‌ఎస్‌ అవినీతిపై విచారణకు కమిటీ.
* ఎస్సీ వర్గీకరణకు సహకారం.
* బడ్జెట్‌ స్కూళ్లకు పన్ను మినహాయింపు.
* నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.
* పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు.
* మేడారం జాతర జాతీయ స్థాయిలో నిర్వహణ.
 
ఓటు విలువ మరింత ఉంటుంది’..

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విడుదల చేసిన మేనిఫెస్టోలు కొంతవరకు ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే అన్ని పార్టీల మేనిఫెస్టోలు కూడా ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నంలో అధికార బీఆర్ఎస్ ఉండగా.. కేసీఆర్ను గద్దె దించేది తామేనని కాంగ్రెస్, బీజేపీ చెప్తున్నాయి. మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈసారి ఓటు విలువ మరింత విలువైనదిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూడు పార్టీల హామీలు చూసిన ఓటర్లు.. తీర్పు ఎలా ఇస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీన వచ్చే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Show More
Back to top button