హిందూ దేవాలయానికి ముస్లిం మసీదుకు మధ్య సంబంధం ఏంటి? మతసామరస్యాన్ని చాటుతున్న ఈ కథ మీకు తెలుసా?
నేటి కాలంలో హిందూ ముస్లింల మధ్య కొందరు రాజకీయనేతల వల్ల కలహాలు జరుగుతున్నాయి. కానీ ఒకప్పుడు హిందూ ముస్లింలు మతసామరసాన్ని చాటుతూ కలిసి ఉండేవారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం నేటి రాజకీయ రంగంలో సర్వసాధారణమైంది. దీని ప్రభావం చేత హిందూ ముస్లిం మతాల మధ్య భేదాభిప్రాయాలు పెచ్చుమీరుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో మతకలహాలతో హింసకాండ సైతం జరుగుతోంది. నేటి పరిస్థితి మాత్రమే ఇలా ఉంది. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం హిందూ ముస్లింలు భాయి భాయి అంటూ మతసామరస్యంతో కలిసి మెలిసి ఉండేవారు.
ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎలా ఉన్నప్పటికీ కేరళ రాష్ట్రంలో మాత్రం హిందూ ముస్లింల మతసామరస్యాన్ని చాటుతూ ఓ గొప్ప దైవప్రదేశం ప్రణవిల్లుతోంది. శబరిమలై వెళ్లే వేల కొద్ది భక్తులు ముస్లింల మసీదును చేరి అక్కడ ప్రార్థనలు చేసి శబరిమలైకు బయలుదేరుతారు. హిందూ భక్తుల కోసం ముస్లిములు విడిదిని ఏర్పాటు చేసి వారికి ఆహారాన్ని అందించి సేవలు చేస్తారు. ఇంతటి గొప్ప మతసామరస్యాన్ని చాటుకున్న ఆ పుణ్య ప్రదేశమే ఎరుమేలి. ఎరుమేలి విషయాలు, హిందూ ముస్లిం ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఏమిటో తెలుసుకుందాం.
అయ్యప్ప స్వామి హిందువులు ఆరాధించే దేవత మూర్తి. అయ్యప్ప మాలధారణ చేసిన వారు నియమాలతో కూడిన కఠిన దీక్షను చేపడతారు. అయ్యప్ప స్వామి అంటే భక్తి కోరికలు తీర్చే స్వామి. ఆ స్వామి వారిని దర్శించేముందు కఠినమైనప్పటికీ సంతోషంతో 41 రోజుల మాల వేసుకుంటారు భక్తులు. అకుంఠిత దీక్షతో అయ్యప్పను ప్రార్థిస్తారు. దేవుడుని ప్రతిరోజు తలుచుకుంటూ.. స్వామి పేరు లేకుండా దీక్షదారుల నోటి నుంచి మాట కూడా రాదు. మనసులో స్వామిని ప్రతిష్టించుకుని పూజలు చేస్తారు.
ఇక శబరిమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే 41 రోజులు నిష్టగా సాగిన అయ్యప్ప దీక్ష ముగిసిపోతుంది. కానీ అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు ఒక మసీదుని దర్శిస్తారు భక్తులు. తెలియని వారికి ఇదొక వింతగా ఉంటుంది. కానీ స్వామిని దర్శించడానికి ముందు పెద్ద మసీదుని దర్శించుకుంటారు. అక్కడ ముస్లింలతో కలిసి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ప్రార్ధనలు చేస్తారు. అంతటితో కాకుండా మిరియాలు, విభూతిని ప్రసాదంగా తీసుకొని అనంతరం శబరిమల యాత్రను కొనసాగిస్తారు.
అయితే హిందూ భక్తులు మసీదులో ప్రదక్షిణాలు చేయడం అనేది వింతగా ఉండొచ్చు. హిందువులు ఆ మసీదును దర్శించి పూజలు చేసి ప్రసాదాలు కూడా స్వీకరిస్తారు. అయ్యప్ప దర్శనార్థం శబరిమలై వెళ్లే భక్తులకు ఈ మసీదు విడిది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో గల ఎరుమేలి అనే గ్రామంలో ఈ మసీదు ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప భక్తులకు ముస్లిం సోదరులు ఆశ్రయం ఇస్తారు. అదే మన సంస్కృతి గొప్పతనం ఇక్కడ మసీదులో ఉండే దేవుడు వావర్ స్వామి. ఈ వావర్ స్వామి అయ్యప్ప స్వామికి గొప్ప భక్తుడు. 500 ఏళ్ల క్రితమే ఓవర్ బాబా అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఈ మసీదులో ప్రార్థనలు చేసి వెళ్లేవారు. స్వామికి నిష్టగా మాలవేసి పూజలు చేసే ఈ ఓవర్ బాబా కాస్త వావరు స్వామిగా మారిపోయారు.
ఎరుమేలి మసీదు నుంచి 60 కిలోమీటర్లు నడిచి ఓవర్ స్వామి ప్రతి ఏడు శబరిమలై దర్శించుకునేవారు. ఇది 500 ఏళ్ల క్రితం నాటి మాట. నాటి నుంచి ఈ సాంప్రదాయాన్ని ఇతర భక్తులు కూడా ఆచరిస్తున్నారు. అంతేకాదు శబరిమలై ఆలయాన్ని అనుసరించి చందనం కుంకుమ వేడుకలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ వావర్ ఒక ముస్లిం ఒక దొంగ. కానీ అయ్యప్ప స్వామిని ప్రార్ధించిన తర్వాత ఆయనకు మంచి జరిగింది. చివరికి దేవుడికే ఈ వావర్ స్వామి స్నేహితుడు అయిపోయాడు. ఓవర్ స్వామి అయ్యప్పను కొలిచేవాడు. ఇతను ముస్లిం అయినప్పటికీ అయ్యప్ప భక్తుడు. ఇందులో వివాదం ఏమీ లేదు ఇంకా చెప్పాలంటే కేరళ సర్కారు ఈ మసీదును టూరిస్ట్ ప్రాంతంగా ప్రకటించి అభివృద్ధి చేసింది. అయ్యప్ప ఆలయానికి ఓవర్ స్వామి కంటే ముందే రాజులు భక్తులు వచ్చేవారు. వారి ద్వారా ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చిన ఒక సూఫీ అయిన వావర్ స్వామి అయ్యప్ప భక్తుడయ్యాడు. స్వామిని దర్శించుకునేందుకు అడవుల్లో నుంచి వెళ్లేందుకు ఒక కత్తిని పట్టుకొని స్వామి దర్శనానికి
వెళ్లేవారు. అది ఆయన రక్షణ కోసమే మాత్రమే కాదు. ఆయన యుద్ధంలో ఆరితేరిన వీరుడు కానీ స్వామి భక్తిలో పడ్డాక మానవత్వం కంటే మించింది లేదని తెలుసుకున్నాడు. స్వామిని దర్శించడమే కాదు కేవలం మనసులో అనుకున్న కోరుకున్నది జరుగుతాయని నమ్మారు ఆయన. నిజంగానే ఆయనకు స్వామి వారు కనిపించడంతో భక్తుడైపోయాడు వావరు స్వామి. అలా మొదలైన ఓవర్ స్వామి ప్రయాణం ఎరుమేలికి ఏ భక్తులు వచ్చినా, కాలినడక వచ్చిన భక్తులు అలసిపోయిన వారికి విడిది ఏర్పాటు చేసేవారు. భక్తులకు సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్లుగా సంతోషించేవారు. ఆ తర్వాత అప్పటినుంచి ఆ ప్రాంతంలో ముస్లింలు ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అది హిందువులు ముస్లింల మధ్య ఉన్న బలమైన దేవుని బంధం. అందుకే హిందువులైన మసీదును దర్శించుకొని అనంతరం ఆ తర్వాత మరో రెండు హిందూ ఆలయాల్లో పూజలు చేసి చివరకు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఈ యదార్ధ గాథ వినడానికి ఎంతో ఆనందంగా ఉంది కదా.
పేటతుళ్లి చరిత్రాత్మక నృత్యం…
ఎరుమేలి గ్రామం హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరుమేలి వద్ద ఉన్న మసీదు, హిందూ దేవుడు అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు, సహచరుడు వావర్‌కు అంకితం చేయబడింది. అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమలకు వెళ్లే ముందు ప్రతి సంవత్సరం అనేక మంది హిందూ యాత్రికులు ఈ మసీదులో ప్రార్థనలు చేయడం విశిష్టం.
ఈ ఎరుమేలి మసీదులో పెట్టతులాల్ (పెట్టా కెట్టు) అనేది ఏటా జరిగే చారిత్రాత్మకమైన ఆచార నృత్యం. దీనిని తెలుగులో పేటతుళ్ళి అంటారు. ఇది మండలం – మకరవిళక్కు కాలంలో (నవంబర్, డిసెంబర్, జనవరి)లో నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో అయ్యప్ప భగవానుడు మహిషి అనే రాక్షసిని వధించడం ద్వారా ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఆట అడుతారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఇక్కడ మసీదును దర్శించుకుని పేటతుళ్ళి ఆట ఆడుతారు. రెండు గ్రూపులు తుళ్లల్‌లో చురుకుగా పాల్గొంటాయి, ఒకటి అంబలప్పుజ, అలంగాడు నుండి మరొకటి ఆకాశంలో గుండ్రంగా ఎగురుతుంది. థుల్లల్‌ను వీక్షించడానికి విష్ణువు స్వయంగా తన గరుడ పర్వతంపై ఉన్న అంబలప్పుజ శ్రీకృష్ణ దేవాలయం నుండి వస్తాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
పులి పాలు సేకరించే మార్గంలో అయ్యప్ప ఈ ఎరుమెలి ప్రదేశంలో “మహిషి”ని చంపాడని ఒక పురాణం చెబుతోంది. మహిష్ అంటే గేదె మలయాళంలో “ఎరుమ” అని అర్థం, అందుకే దీనికి “ఎరుమకొల్లి” అని పేరు.