TRAVEL

గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేద్దామా..?

గోకర్ణక్షేత్రానికి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు. అక్కడి అందాలను దర్శించడానికి, చక్కటి అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రణాళికలు వేసుకుంటారు. కానీ, మొదటి సారి వెళ్లే వారికి గోకర్ణ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. మీరు అందులో ఒకరైతే, ఈ సమాచారం మీ కోసమే. భూకైలాస్‌గా పేరు తెచ్చుకున్న గోకర్ణకు వెళ్లడానికి సంవత్సరంలో ఏ రోజైనా వెళ్లవచ్చు. కానీ, అక్కడి రమణీయమైన అందాలను చూపులతో స్పర్శించాలంటే వర్షాకాలం తర్వాత వేసవి కాలం ముందు.. అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి సమయం అని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. ఇక వేసవి కాలానికి వస్తే.. ఈ సమయంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో ట్రావెల్ చేయడం కష్టం అని ఆ ప్రదేశాన్ని సందర్శించిన ప్రజలు చెబుతున్నారు.

అసలు గోకర్ణ ఎక్కడ ఉంది..?
కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో బెంగళూరుకి 550 కి.మీల దూరంలో గోకర్ణ ఉంది. ఇది హుబ్లీకి 150 కి.మీ చేరువలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి గోకర్ణకు డైరెక్ట్‌గా వెళ్లడానికి ఎలాంటి ా సౌకర్యం లేదు. కాబట్టి హుబ్లీకి వెళ్లి అక్కడి నుంచి గోకర్ణకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి విమానం లేదా రైలు మార్గాల్లో వెళ్లవచ్చు. అలాకాకుండా, బస్సు ద్వారా వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి అంకోలాకు వెళ్లాలి. అక్కడి నుంచి గోకర్ణ కేవలం 15 కి.మీ దూరంలో ఉంటుంది. విజయవాడ, వైజాగ్ నుంచి వచ్చే వారికి హుబ్లీ వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. హుబ్లీ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి బస్సులో గోకర్ణకి వెళ్లవచ్చు. లేదా అంకోలా నుంచి కూడా గోకర్ణకు వెళ్లవచ్చు. కావాలంటే టూ వీలర్, ఫోర్ వీలర్‌లను కూడా రెంట్‌కు తీసుకుని గోకర్ణకు చేరుకోవచ్చు. మీ బడ్జెట్‌ ప్రకారం మీ రవాణాను ఎంచుకోండి.

గోకర్ణలో చూడవలసిన ప్రదేశాలు

గోకర్ణ మొత్తం చూడడానికి కనీసం 3 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ సమయంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

మహాబలేశ్వర్ ఆలయం
మహా గణపతి ఆలయం
కోటి తీర్థం కొలను
భద్రకాళి ఆలయం
గోకర్ణ మెయిన్ బీచ్
పెలికన్ బీచ్
ప్యారడైజ్ బీచ్
హాఫ్ మూన్ బీచ్
ఓం బీచ్
కడల్ బీచ్
జోక్ ఫాల్స్
యన కేవ్స్
విభూతి ఫాల్స్

తర్వాత మురుదేశ్వర్ ఆలయం, రాజగోపురమును దర్శించుకోవచ్చు. గోకర్ణకు 3 రోజుల ట్రిప్‌కు ఒక్కొక్కరికి రూ.6000 నుంచి రూ.22,000 వరకు ఖర్చు అవుతుంది. మీ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోండి.

Show More
Back to top button