నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, ప్రకాష్ రాజ్, బాబీ సింహా తదితరులు..
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని,రవిశంకర్
దర్శకత్వం: కేఎస్ రవీంద్ర(బాబీ)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్థన్ ఎ.విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమనే
గాడ్ ఫాదర్ లాంటి హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రమే వాల్తేరు వీరయ్య. ‘అన్నయ్య’ తర్వాత మెగాస్టార్‌తో కలిసి రవితేజ స్క్రీన్ పంచుకున్న చిత్రం కావడంతో వాల్తేరు వీరయ్య.. మొదటి నుంచే హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు పునకాలు లోడింగ్ పాట, టీజర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కథలోకి వెళ్తే…
వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ ని నడుపుతుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన వీరయ్య.. అప్పుడప్పుడు నేవీ అధికారులకు సాయం చేస్తుంటాడు. వీరయ్య గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కూడా కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్(బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు డీల్ కుదుర్చుకుంటాడు. అలా మలేషియా చేరుకున్న వీరయ్య.. సాల్మన్ అన్న
మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్) కోసం నమ్మకమైన వ్యక్తిగా మారతాడు.. అసలు మైఖేల్ సీజర్‌కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య తమ్ముడు ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
చిరంజీవి సినిమా అనగానే అభిమానులకు సైతం కొన్ని అంచనాలు ఉంటాయి. మంచి ఫైట్ సీన్స్, డ్యాన్స్, కామెడీ.. దర్శకులు కూడా ఈ పాయింట్లనే ఉండేలా చూసుకుంటారు.
ఆయన మార్క్ కామెడీ, భారీ యాక్షన్ సీన్‌లతో కథను తీర్చిదిద్దాడు. అలా అని ఇది కొత్త కథ అని అనుకోలేం.. ఈ తరహా కథలు చాలానే చూశాం. కానీ ఈ సినిమాకు హైలెట్.. మాస్ మహారాజ రవితేజ ఉండటమే..
పోలీస్ స్టేషన్‌లోనే డ్యూటీలో ఉన్న పోలీసులను
సాల్మన్ అతికిరాతంగా చంపడంతో సినిమా మొదలవుతుంది. ఫస్టాప్ అంతా వీరయ్య మలేషియాకు ఎలా చేరుకున్నాడు. అక్కడ హీరోయిన్ శృతిహాసన్ ను కలుసుకోవడం.. సాల్మన్ ను పట్టుకునేందుకు చేసే ప్లాన్ లతో సాగిపోతుంది.
సెకండాఫ్ తోనే మొదలవుతుంది అసలు కథ… ఏసీపీ విక్రమ్‌గా రవితేజ ఎంట్రీ, అన్నదమ్ముల మధ్య వచ్చే సన్నివేశాలు.. అయితే అసలు అన్నదమ్ముల మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనే విషయాన్ని బలంగా చూపించలేకపోయాడు. డ్రగ్స్ పట్టుకునే సీన్స్ కూడా పేలవంగా ఉంటాయి. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా సాగుతుంది. ఎలాంటి ప్రయోగాలకు పోకుండా.. అభిమానులు కోరుకునే అంశాలతో ఓ రొటీన్ కథను అంతే రొటీన్‌గా తీశాడు. అయితే చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా కావాల్సిన సన్నివేశాలను మాత్రం ప్యాక్ చేసి ఇవ్వడంలో సఫలమయ్యాడు దర్శకుడు బాబీ.
ఎవరెలా చేశారంటే..
చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. వీరయ్య పాత్రలో ఆయన జీవించేశాడు. కామెడీ, మాస్ లుక్ తో సరికొత్తగా కనిపిస్తాడు. ఇక ఏసీపీ విక్రమ్‌గా రవితేజ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అదితిగా శ్రుతిహాసన్ ఫర్వాలేదనిపిస్తుంది. డ్రగ్స్ మాఫియా లీడర్ సాల్మన్ సీజర్‌గా బాబీ సింహా, అతని సోదరుడు మైఖేల్‌గా ప్రకాశ్ రాజ్ తన పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిశోర్ కామెడీ పంచ్‌లు బాగున్నాయి.
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్.. ‘బాస్ పార్టీ’, ‘పూనకాలు లోడింగ్’ పాటలు ఓ ఊపు ఊపాయి.
ఆర్థన్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ఈ రెండు సినిమాల్లో.. కొన్ని కామన్ పాయింట్ లున్నాయి. హీరోల పేర్లు.. వీరయ్య, వీరా అవ్వడం, రెండు సినిమాల్లోనూ హీరోయిన్ ఒక్కరే(శృతి హాసన్) అవ్వడం, సినిమా దర్శకులు హీరో అభిమానులు అవ్వడం.. వంటివి.
వీటితో పాటు విజయ్ దళపతి నటించిన తమిళచిత్రం ‘వారసి’ తెలుగులో ‘వారసుడు’ ఈరోజు విడుదలైంది.