అప్పిస్తే ఆంబోతుని కట్టేస్తాం అని గ్రామాలలో ఒక సామెత ఉంది. ఇది అక్షరాల రాష్ట్ర సీఎం జగన్ వర్తిస్తుంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు జగన్ అప్పులు ఎలా చేయవచ్చో, అప్పులును ఎన్ని మార్గాలున్నాయో దేశంలోని ముఖ్య మంత్రులందరికీ చేసి చూపిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమం కోసమే డబ్బులు ఖర్చు చేసి, బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఖర్చులకు పొంతన లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికయ్యే.. అప్పులను తీర్చడానికి ప్రభుత్వ ఆస్తులను ఎక్కువ వడ్డీలకు తాకట్టు పెడుతున్నారు. చివరకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా అప్పులు చేస్తున్నారు.
ప్రభుత్వ రంగంలోని వివిధ కార్పోరేషన్లు ద్వారా రుణాలను తీసుకుని వాటిని సైతం ప్రభుత్వమే వినియోగించుకుంటున్నది. రిజర్వు బ్యాంకు ఇచ్చిన రుణాలువడ్డీలను సైతం తిరిగి చెల్లించేందుకు రిజర్వు బ్యాంకు వద్దనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పుల పరిమితి పూర్తయినప్పటికీ పరిమితిని పెంచాలని ఒత్తిడి సైతం చేస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు యిచ్చే నిధులను సైతం గ్రామ సర్పంచ్ల అనుమతి లేకుండా ప్రభుత్వ ఖాతాలకు మళ్ళింస్తున్నట్లు ఫిర్యాదులు సైతం వస్తున్నట్లు సమాచారం.
ఇక గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం ఆర్.బి.ఐ. ద్వారా 5 లక్షల కోట్ల అప్పు తెచ్చినట్లు RBI తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ నిత్యం అప్పుల కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వద్ద, రిజర్వు బ్యాంకు వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఈ ఐదేళ్ళలో 12 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 2 లక్షల కోట్లకు చేరుకుపోవడంతో చేసిన పనులకు బిల్లులు రాక టెండర్లు వేసే కాంట్రాక్టర్లే కరువైపోయారు. బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్లు కోర్టుల మెట్లు ఎక్కవలసిన పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయి. పలువురు కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఒత్తిడి తట్టుకోలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు జరిగాయి. చివరకు గత్యంతరం లేని స్థితిలో విజయవాడలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు కాంట్రాక్టర్లు ధర్నాలు చేసిన పరిస్థితి లేదు.
జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి 2 లక్షల 64 వేల 451 కోట్లు ఉంది. ప్రస్తుతం ఇది నాలుగు ఇంతలు కావడంతో ప్రజల మీద పన్నుల భారం పెరిగిపోయింది. ఆస్తిపన్ను, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్ చార్జీలు వివిధ దఫాలుగా పెరిగిపోయాయి. నిత్యజీవితావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ నాలుగున్నరేళ్లలో ధరలు 100 శాతం నుంచి 300 శాతం వరకు పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజల ఆదాయాలు తరిగిపోయి బ్రతుకు భారంగా మారిపోయింది.
“దరిద్రానికి దారంతా బొక్కలే” అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రభుత్వ విధానాలతో విసుగెత్తి పోయినట్లు తెలుస్తోంది. ఇంకా అప్పులు చేయటానికి ఇప్పటికీ ఆర్.బి.ఐ. అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం పరిధికి దాటిపోయాయి. ఈ మేరకు రాష్ట్ర జి.డి.పి.లో 32.95 శాతం రాష్ట్రం అప్పులు ఉన్నాయని కేంద్రం హెచ్చరిక చేసింది. రాష్ట్రాల ఉన్నత్తిలో 3.5 శాతం మాత్రమే అప్పులు చేయటానికి అవకాశం ఉంది. 66 గోనిలో శని పెట్టుకుని కాశీకి పోతే ఏమొస్తుంది” అన్నట్లు రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వచ్చే ఫలితం ఏముంటుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు అభివృద్ధిని పెంచే విధంగా పరిపాలన చేయాలిగాని ప్రజలపై భారంగా ఉండే విధంగా పరిపాలన చేయకూడదని విశ్లేషకులు చెబుతున్నారు.