HEALTH & LIFESTYLE

ఈ లక్షణాలుంటే జాగ్రత్త

మానసిక ఒత్తిడి, మద్యపానం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒక్కసారిగా బీపీ భారీగా పెరుగుతుంది. విపరీతమైన చెమటలు రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం, తల తిరగడం, చర్మం ఎరుపు రంగులోకి మారడం, మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే బీపీ భారీగా పెరిగినట్లు గుర్తించాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి. BP పెరిగినప్పుడు డాక్టర్ అందుబాటులో లేనట్లైతే ఇవి చేయండి.

* పనులన్నీ పక్కన పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆందోళన, భయం కలిగించే విషయాల నుంచి మనసు మళ్లించండి.

* కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్‌ కారణంగా కూడా బీపీ పెరుగుతుంది. కాబట్టి వెంటనే నీటిని తాగాలి. గాలి బాగా వీచే ప్రదేశంలో నడవాలి.

* డార్క్‌ చాక్లెట్ అందుబాటులో ఉంటే చప్పరించాలి. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కూడా అధిక రక్తపోటు కంట్రోల్‌లోకి వస్తుంది.    
         
 * ఇంట్లో బీపీ చెక్ చేసుకోనేటప్పుడు జాగ్రత్తలు పాటించండి

అధిక రక్తపోటు ఉన్నవారు తరచూ BP చెక్ చేసుకోవాలి. బి.పి లేకపోయినా ఉన్నట్టు ఫలితాన్నిచ్చే వైట్ కోట్ హైపర్‌టెన్షన్, బి.పి ఉన్నప్పటికీ లేనట్టుగా ఫలితాలను చూపించే మాస్కడ్ హైపర్‌టెన్షన్, టాబ్లెట్స్‌తో నయం కానీ BPని గుర్తించడానికి టెస్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు గుర్తుంచుకోవాలి. కొందరు ఇంటి దగ్గరే రక్తపోటు పరీక్షించుకుంటారు. వారు కింది సూచనలు పాటించాలి.

* అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన, సరైన బి.పి మానిటర్ మాత్రమే ఉపయోగించాలి.

* BP టెస్ట్ చేసేటప్పుడు 30 నిమిషాల ముందు కాఫీ, పొగ తాగవద్దు. వ్యాయామం వంటివి చేయకండి.

* BP కొలిచేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. రెండు పాదాలు నేలకు ఆనుకొని, వీపుకి సపోర్ట్ ఉండే కుర్చీలో కూర్చోండి. కూర్చున్నపుడు కాలు మీద కాలు వేయడాన్ని మానుకోండి.

* బి.పి కొలిచే 10 నిమిషాల ముందు మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేసుకోండి.

* ఉదయాన్నే టాబ్లెట్స్ వేసుకునే 2 నిమిషాల ముందు 2 రీడింగ్స్ తీసుకోండి. సాయంత్రం కూడా అదే విధంగా చేయండి.

Show More
Back to top button