ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. అత్యంత ప్రాచీనమైన మానవనిర్మిత కట్టడం.. పర్యాటక ప్రదేశంగానే కాక.. చైనాదేశపు జాతీయ చిహ్నంగానూ చరిత్రలో నిలిచింది.. ప్రపంచంలోనే ఎత్తైన గోడగా ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా పేరుగాంచింది.. ఈ గోడను ప్రపంచంలోనే ఎత్తైన స్మశానవాటిక అని కూడా అంటారు.. ఎందుకంటే గోడ నిర్మాణ సమయంలో లక్షలాది మంది చనిపోయారు.. వారందర్నీ అదే గోడ కింద ఖననం చేయడంతో దీనికాపేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు.. చైనా మొదట్లో ఒక చిన్న దేశంగా.. మంగోలియన్ రాజుల చేతుల్లో పావుగా ఉండేది.. ఈ గోడ మీద ఆధిపత్యం కోసం శతాబ్దాలుగా వేలాది యుద్ధాలు జరిగాయి. ఆ క్రమంలో ఎన్నో రాజవంశాలు, సామ్రాజ్యాలు నశించాయి. ఇప్పుడు చైనా శక్తివంతమైన శత్రుదుర్భేద్యమైన దేశంగా నిలిచింది.. ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో టూరిస్ట్ లు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.. దీంతో ఇక్కడ టూరిజంరంగం బాగా డెవలప్ అయ్యింది..
ఈ చైనా వాల్ కు సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. దీన్ని నిర్మించడానికి దాదాపు పదిలక్షల మంది వరకు పనిచేశారట. ప్రపంచంలో ఎక్కువమంది చర్చించుకున్న కట్టడంగా దీనికి పేరుంది. ఈ క్రమంలోనే ఈ చైనా గోడ నిర్మాణం, ఆవశ్యకత, ప్రత్యేకతల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం…
*‘ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ నిర్మాణం క్రీ.పూ. 7వ శతాబ్దంలో ప్రారంభమై.. పూర్తయ్యేందుకు సుమారు 2వేల సంవత్సరాల కాలం పట్టింది. క్విన్ రాజవంశానికి చెందిన షి హువాంగ్ కాలంలో ఎక్కువభాగం నిర్మాణానికి నోచుకుంది.
*ఈ గోడకు మొదట్లో పర్పుల్ ఫ్రాంటియర్, ఎర్త్ డ్రాగన్ అనే పేర్లు పెట్టారు. కాలక్రమేణా ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ అని పిలుస్తున్నారు.. తర్వాత 19వ శతాబ్దం చివరి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే దాదాపు 12 శతాబ్దాల అనంతరం గుర్తింపులోకి వచ్చింది.
*ఈ గోడ వెడల్పు 30 అడుగులు, ఎత్తు దాదాపు 12 అడుగులు ఉంటుందిట. మొత్తం పొడవు 21,196 కిలోమీటర్లు.. మొదట్లో దీని పొడవు సుమారు 2,400 కి.మీల నుంచి 8,000 కి.మీల మధ్య ఉంటుందని అంచనా వేయగా.. 2012లో చైనా ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక వారసత్వ విభాగం చేపట్టిన పురావస్తుశాస్త్ర అధ్యయనంలో ఈ గోడ పొడవు దానికంటే చాలా ఎక్కువని అంటే, 21 వేల కి.మీలపైనే ఉంటుందని తేలింది.
*ఈ గోడ నిర్మాణం చేపట్టడం వెనుక గల ప్రధాన ఉద్దేశం.. ఉత్తర దిశలో ఉన్న విదేశీ ఆక్రమణల నుంచి తమ దేశాన్ని రక్షించడంతోపాటు స్మగ్లింగ్ ద్వారా దిగుమతి చేసుకునే వస్తువులపై పన్ను ఎగవేతను నివారించడం.. అలాగే వలసలను నియంత్రించడం..
*ఇకపోతే చైనా గోడ మధ్యలో మనకు చాలా బురుజులు, టవర్ ల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి పురాతన కాలంలో శత్రువుల కదలికలను గుర్తించేందుకు.. సైగల ద్వారా సందేశాలను పంపేందుకు ఎంతగానో ఉపయోగపడేవట. ఒక్కో వాచ్ టవర్ ఎత్తు 26 అడుగులతో ప్రతి కిలోమీటరుకు ఒకటి చొప్పున ఉండటం విశేషం.
గోడ నిర్మాణం ఉద్దేశం…
క్రీ.పూ. 210లో చనిపోయిన తొలి చక్రవర్తే ఈ గోడ కట్టడానికి పూనుకున్నారట. మంగోలులు క్రీ.శ. 800లో చరిత్రలో కనిపిస్తారు. తిరిగి 13వ శతాబ్దం చివరి కాలంలో చైనాను మంగోలులు పాలించేవారు. 14వ శతాబ్దం చివర్లో చైనీయులు, మంగోలులకు మధ్య ఘర్షణ మొదలైంది. మింగ్ వంశపాలకులు అప్పట్లో మంగోలులను చైనా నుంచి బహిష్కరించారు. అసలుకైతే చైనా పూర్వీకులు మంగోలియన్స్ జాతికి చెందినవారు.. మంగోలియన్ లు ఎప్పుడు చైనా మీద దాడి చేసేవారు… ఆ దాడులను తిప్పి కొట్టేందుకు ఈ చైనా గోడ నుంచే దాడులు జరిపేవారు. మొదటగా చూస్తే మంగోలియన్ సామ్రాజ్యాలు ఎక్కువగా ఉండేవి.. తర్వాత చైనా వాటన్నిటిని ఆక్రమించుకుంది. ఇలా సామ్రాజ్యాలను కాపాడుకోవడానికి రక్షణ కోసం ఈ గోడను నిర్మించాల్సి వచ్చింది..
అయితే ఇది ఒకటే గోడ అంటే మాత్రం.. కాదు. చాలా గోడల కలయికగా చెప్పొచ్చు. వీటిలో చాలా విభాగాలున్నాయి. కొన్ని మాత్రమే అద్భుతమైన నిర్మాణంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని ఎవరికీ కనిపించకుండా దాచి ఉంచిన కొన్ని విభాగాలు శిథిలావస్థకు కూడా చేరుకున్నాయి. మరికొన్ని కనుమరుగైపోయాయి. ఈ గోడపై నడుచుకుంటూ వెళ్లే వారికి వాటివైపు వెళ్లడం నిషేధం. చాలా ప్రాంతాల్లో ఈ గోడలు రెండింతలు, మూడింతలు, కొన్నింటి దగ్గర నాలుగింతలు ఎక్కువ వెడల్పులో ఉంటాయి. పైగా ఈ విభాగాలన్ని ఒకదానిపై ఒకటి విస్తరించి ఉంటాయి.
*బీజింగ్‌లో మనకు కనిపించే కొన్ని భవనాలు చాలా పురాతనమైనవి. అందులో కొన్ని చైనా వాల్‌లో భాగంగా ఉంటాయి. చెక్క, బంకమన్ను.. చుట్టుపక్కల దొరికిన రకరకాల రాళ్ళు.. ఇసుకతో తయారుచేసిన ఇటుకలతో ఈ గోడ నిర్మాణం జరిగింది.. కానీ తర్వాత ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ గోడ శిథిలావస్థలో ఉంది.
*చైనా గోడను నిర్మించే క్రమంలో చాలామంది మరణించినట్లు పుకార్లున్నాయి.. అందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు.. ఎందుకంటే అప్పట్లో అతి వేడి లేదా అతి చలి వంటి ఇతర క్లిష్ట వాతావరణ పరిస్థితుల వల్ల వాటికి తట్టుకోలేక.. ప్రాణాలు కోల్పోయిన వారున్నారు.
*ప్రపంచ ప్రఖ్యాతులైన 300మంది ఈ చైనా గోడను సందర్శించారట. బరాక్ ఒబామా ఒకరు కాగా
1987లో విలియం లిండ్సే అనే సుదూర బ్రిటిష్ రన్నర్ 1500 మైళ్ల పొడవైన చైనా గోడను కాలినడకన పూర్తి చేయడం విశేషం.. నిజానికి ఈ గోడను కాలి నడకన పూర్తి చేయాలంటే మాత్రం 3- 6 నెలల సమయం పడుతుంది. *ప్రతి ఏటా దాదాపుగా కోటిమంది టూరిస్టులు ఈ చైనా వాల్ ను సందర్శిస్తున్నారట.. 1987 డిసెంబర్ లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ గుర్తింపు పొందింది.