భారతదేశంలో వారణాసి మహానగరాన్ని ఒక పుణ్య క్షేత్రంలా భావిస్తారు. వారణాసినే కాశీ, బనారస్ అని కూడా అంటారు. బనారస్‌లో కొలువైన అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడిని నమ్మిన భక్తులకు కొంగు బంగారం అవుతుందని చాలామంది విశ్వాసం. అయితే ఈ క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి..? అక్కడ ఏ ఏ ప్రదేశాలు దర్శించుకోవాలి..? ఎంత ఖర్చు అవుతుంది..? ఇలా అన్ని వివరాలు తెలుసుకుందాం.
కాశీ మహా పుణ్య క్షేత్రం దక్షిణ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. ఇక్కడికి వెళ్లడానికి సికింద్రాబాద్, విజయవాడ, భువనేశ్వర్ నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గంలో వెళ్లడానికి వారణాసికి వెళ్లడానికి వారణాసి జంక్షన్ (BSB) లేదా దిన్ దయాల్ ఉపధ్యాయ జంక్షన్‌కు(DDU) వెళ్లండి. అక్కడి నుంచి కాశీ చేరుకోవచ్చు. మీ ప్రదేశాన్ని బట్టి వారణాసికి వెళ్లడానికి దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. ఒక వేళ విమానం మార్గం నుంచి వెళ్లాలనుకుంటే.. లాల్ బహదూర్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్ట్ లేదా వారణాసి ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి కాశీకి 25 కి.మీ దూరంలో ఉంటుంది. మీరు క్యాబులో లేదా ఆటోలో వెళ్లవచ్చు.
కాశీలో సందర్శించాల్సిన ప్రదేశాలు..
*కాశీ విశ్వనాథ దేవాలయం
*మణికర్ణికా ఘాట్
*అస్సీ ఘాట్
*తులసి మానస్ మందిర్
*కాల భైరవుని ఆలయం
*మృత్యుంజేయ మహాదేవాలయం
*విశాలాక్షి ఆలయం
*వారహి మాత ఆలయం
*సాక్షి గణపతి ఆలయం
*దుండి గణపతి ఆలయం
*అన్నపూర్ణ దేవి ఆలయం
టూర్‌కి అయ్యే ఖర్చు..
*మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం మీ ప్రయాణ ఖార్చు ఉంటుంది.
*మీరు సెలవు రోజుల్లో కాశీ సందర్శిస్తే రూములు దొరకడం కష్టం. కాబట్టి రెండు నెలల ముందే బుక్ చేసుకోండి. రూముకు ఒక రోజుకు దాదాపు రూ.1600 నుంచి రూ.3000 వరకు అవుతుంది.
*అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంలో ప్రతి రోజు 3 గంటల వరకు అన్నదానం ఉంటుంది. వీలు లేని వారు బయట తినడానికి రోజుకు దాదాపు ఆహారం ఖర్చు ఒకరికి రూ.400 నుంచి రూ.500 వరకు అవుతుంది.
*మీరు అక్కడ తిరగడానికి ప్రయాణ ఖర్చు రోజుకు రూ.500 వరకు అవుతుంది.
*ఈ క్షేత్రాలన్ని దర్శించడానికి కనీసం 8 రోజుల వరకు సమయం పడుతుంది.
*కాశీని దర్శించడానికి వేసవి మంచి సమయంగా చెప్పవచ్చు.