ధామాని మార్ట్ అంటే త్వరగా అర్థం కాదు. D-Mart అంటేనే ప్రస్తుతం అందరికీ అర్థమయ్యే మాట. సూపర్ మార్కెట్ ధనవంతులకే అని మధ్యతరగతి వారు అనుకునేవారు. అది ఒకప్పటి మాట. కానీ, D-Mart అందరికీ చేరువవ్వడంతో ఆ ఆలోచన మారింది. ఇంటికి కావాల్సిన అన్ని నిత్యావసరాలు, వస్తువులు లభించే మాల్. కారణం మాత్రం అక్కడ తక్కువ ధరకే సరుకులు అందుబాటులో ఉండడం. తక్కువ ధరకే సరుకులు అమ్మితే డి-మార్ట్‌కు ఎలా లాభం వస్తుంది. అసలు ఇంత డిస్కౌంట్ ఎలా ఇవ్వగలుగుతుంది? అని మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందా? డి-మార్ట్ యజమాని రాధాకిషన్ ధామాని అని అందరికీ తెలిసిందే. 2002లో కేవలం 2 D-Mart సూపర్ మార్కెట్లను ప్రారంభించారు.
D-Mart షాప్ పెట్టడానికి ధామాని స్థలం కొనుగోలు చేశారు. అది కూడా తక్కువ ధర ఉన్న స్థలం. పట్టణానికి దూరంగా. దీంతో అద్దె బాధ లేదు. షాపులో ఎక్కువ ఆడంబరాలు ఉండవు. చాలా వరకు డబ్బులు సేవ్ అవుతాయి. ప్రజలు రోజువారీ ఉపయోగించే వస్తువులు ఎక్కువ ఉంటాయి. దీంతో అమ్మకాలు ఎక్కువ. దిగుమతి పెరుగుతుంది. సప్లైయర్స్‌కు 10 నుంచి 15 రోజుల్లో కొనుగోలు సొమ్ము క్లియర్ చేస్తారు. ఆ నమ్మకంతోనే మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. దాంతో MRP కంటే తక్కువ ధరకు అమ్మి D-Martకు లాభాలు తెస్తున్నారు. ఇలా ఒక మంచి బిజినెస్ స్ట్రాటజీ ఉపయోగించి D-Mart లాభాల్లో దూసుకుపోతుంది.
మీకు ఇది తెలుసా?
D-Mart IPO 2017లో వచ్చినప్పుడు రూ.14,950తో షేర్స్ కొన్నవారికి, ఇప్పుడు రూ.2లక్షల వరకు లాభం వచ్చింది. కేవలం 5ఏళ్లలో దాదాపు 14రెట్లు రిటర్న్ఇచ్చింది. రూ.299 ఉన్న ఒక షేర్ వ్యాల్యూ ఇప్పుడు రూ.4వేలకు పైనే ఉంది. చదవడానికి ఏంత బాగుంది కదా! దాని గురించి తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యపడతారు. D-Mart రెవెన్యూ 2018లో రూ.15,033కోట్లు. ఇప్పుడు రూ.30,976కోట్లు. 2018లో రూ.787కోట్ల లాభాలు వస్తే..2022లో రూ.1,492కోట్లు ఆర్జించింది. కేవలం 294 స్టోర్స్‌తో ఈ ఆదాయం పొందింది. దానితోపాటు D-Mart ఎలాంటి అప్పులు చేయలేదు. ఒకవేళ మీరు ఇందులో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?. మీరు అన్ని విషయాలు తెలుసుకొని చేసి ఇన్వెస్ట్ చేయండి.