అయోధ్య.. ఈ పేరు చెప్పగానే జనవరి 22న అంగరంగ వైభవంగా జరిగిన రామ మందిర ప్రారంభోత్సవమే.. గుర్తొస్తుంది. అసలు రాముడు పుట్టిన ప్రదేశంలో రామ మందిరం కట్టాలనే యుద్ధం ఇప్పటిది కాదు. ఈ యుద్ధానికి బీజం 1853లో పడితే, పంట చేతికి రావడానికి అంటే.. రామ మందిరం నిర్మాణానికి దాదాపు 171 సంవత్సరాలు పట్టింది. అయితే, ఇలాంటి రామ మందిరాన్ని ఇటువంటి సమయంలో ప్రారంభించడం ఎన్నో రాజకీయ కోణాలు దాగి ఉన్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అయోధ్య మందిరంపై తీర్పు ప్రకటించారు. అయితే, ఈ తీర్పు వెనకాల ఎంతో మంది రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయని, ఇదంతా ఎన్నికల స్టంట్ అని ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.
కేవలం రూ.1 మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం..!
రామ మందిరంపై తీర్పు వచ్చిన తర్వాత మందిరం నిర్మించడానికి ప్రజలు చెల్లించిన పన్ను వాడుతున్నారని, ప్రభుత్వ సొమ్ము రాజకీయనేతలు తమ స్వార్థానికి వాడుతున్నారని నెటిజన్లు నెట్టింట పోస్ట్ చేశారు. అయితే, రామ మందిర నిర్మాణానికి అయిన ఖర్చు రూ.1800 కోట్లు. ఈ డబ్బు ప్రభుత్వం ఇచ్చింది కాదు..! ప్రజలది. ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం’ పేరుతో ఓ ట్రస్ట్ తెరిచి.. విరాళాలు సేకరించటం ప్రారంభించారు. దీనికి భారత ప్రభుత్వం ఇచ్చిన విరాళం కేవలం రూ.1 మాత్రమే. దీనితో పాటు ఇతర రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సెలబ్రెటీస్ కూడా తమ వంతు విరాళం అందజేశారు. భక్తులు కూడా తమ భక్తిని విరాళం రూపంలో సమర్పించారు. అంతేకాదు, విరాళం ఇచ్చిన వారికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఇలా ట్రస్టుకు రూ.3500 కోట్లు వచ్చాయి. అందులో రూ.1800 కోట్లు నిర్మాణానికి కేటాయించగా.. మిగిలిన డబ్బు మెయింటెనెన్స్‌కి ఉపయోగిస్తామని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. అయితే, మందిరం నిర్మాణానికి ఉపయోగించినదంతా ప్రజల డబ్బు మాత్రమే. ఇందులో ఎలాంటి ప్రభుత్వ డబ్బు గాని, ట్యాక్స్ పేయర్స్ డబ్బు గాని లేదని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.
తీర్పునిచ్చిన జడ్జీలే ప్రారంభోత్సవానికి రావడం లేదు..!
ఎన్నో సంవత్సరాల పాటు నడిచిన కేసుకు తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జుల్లో ముగ్గురు జడ్జీలు మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు. కారణాలేంటో చూద్దామా..?
*జస్టిస్ రంజన్ గొగోయ్, 2020లో రాజ్యసభ మెంబర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎన్నో సంఘ సేవల్లో బిజీగా ఉండడంతో మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని తెలిపారు.
*జస్టిస్ చంద్రచూడ్, సోమవారం కోర్టు ఉండడంతో ప్రారంభోత్సవానికి రాలేనని పేర్కొన్నారు.
*జస్టిస్ బాబ్డే, పదవీ విరమణ తీసుకుని నాగపూర్‌లో నివసిస్తున్నారు. వీరు ప్రారంభోత్సవానికి వస్తానని అన్నారు.
*జస్టిస్ నజీర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. తన బిజీ షెడ్యూల్ వల్ల ప్రారంభోత్సవానికి రాలేనని తెలిపారు.
*జస్టిస్ భూషణ్, 2021లో నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్‌కి చైర్మన్ అయ్యారు. వీరు ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారని చెప్పారు.
note: అయోధ్య రామ మందిరం మీద తీర్పునిచ్చిన ఈ ఐదు జడ్జీల జీవితాలు.. తీర్పు తర్వాత ఎంతో మారాయని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి.
రామ మందిరం ఎన్నికల స్టంటా..?
2020లో శంకుస్థాపన జరిగిన గుడి 2024 ఎన్నికల సమయంలో పూర్తి కావడం ఎలక్షన్ల స్టంటేనని ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే BJP కూడా అయోధ్య పేరు చెప్పి ఐదు సార్లు అధికారంలోకి వచ్చిందని, ఎన్నికలకు మరి కొన్ని నెలలు ఉండగానే మళ్లీ అదే అస్త్రాన్ని ఉపయోగించి అధికారంలోకి రాబోతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అవి కింది విధంగా చూడవచ్చు.
1996లో – మేనిఫెస్టోలోని 12వ పేజీలో ‘అధికారంలోకి వచ్చాక రామ మందిరం నిర్మిస్తాం’ – ఎన్నికల్లో BJP గెలిచింది.
1998లో -మేనిఫెస్టోలోని 8వ పేజీలో అధికారంలోకి వచ్చాక రామ మందిరం నిర్మిస్తాం’ – ఎన్నికల్లో BJP గెలిచింది.
2014లో – మేనిఫెస్టో ‘అధికారంలోకి వచ్చాక అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తాం’ – ఎన్నికల్లో BJP గెలిచింది.
2019లో – మేనిఫెస్టో ‘అధికారంలోకి వచ్చాక అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తాం’ – ఎన్నికల్లో BJP గెలిచింది.