పదేళ్ల తర్వాత ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా వాడి వేడిగా జరిగాయి. ఇదివరకు సమావేశాలు జరిగిన అవి తూతూ మంత్రంగా మాత్రమే జరిగాయి ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు కాబట్టి ఎవరు ప్రశ్నించేవారు లేరు పైగా రెండు రోజుల్లోనే సమావేశాలను ముగించారు.
కానీ ఇప్పుడు మాత్రం పదేళ్లు పాలన చేసిన కేసీఆర్ గారు ఓడిపోయి కాంగ్రెస్ వాళ్లు గెలవడంతో ప్రతిపక్షం పెరిగింది దాంతోపాటే ప్రశ్నల పర్వం మొదలైంది.
అసలు ఇవి అసెంబ్లీ సమావేశాలు కానే కావు కేవలం గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే ప్రసంగం మాత్రమే కానీ దీనిని బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక దాడిగా వాడుకుంది.
నిజానికి గవర్నర్ గారు చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీల గురించి వాటి అమలు గురించి రేవంత్ రెడ్డి పార్టీని ముందుకు తీసుకువెళ్తాడని ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మంచి ప్రభుత్వం అనిపించుకుంటాడని అందరికీ రోల్ మోడల్ గా నిలుస్తాడని అన్నారు.
కానీ విపక్షాలు మాత్రం గవర్నర్ ప్రసంగం తలుచుకుంటే వారి మాటలు వింటుంటే సిగ్గుచేటుగా అనిపిస్తుందని వారి ప్రసంగం మొత్తం అసత్యాలే అని వాదించారు అయితే నిజానికి గవర్నర్ గారు చెప్పింది అక్షర సత్యమే. రేవంత్ రెడ్డి గారి పాలన ముందు ముందు ఎలా ఉంటుందో అనేది మనకు రెండు హామీలతోనే తెలియజేశారు అందులో సందేహమే లేదు.
ఇకపోతే గవర్నర్ గారి ప్రసంగం ఎవరు రాశారు ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చిన స్క్రిప్టును గవర్నర్ గారు చదివారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం.
గవర్నర్ గారు చేసిన ప్రసంగం ఎవరూ రాసిన రాశారు అన్నదాన్ని పక్కన పెడితే, ఇన్నాళ్లు గవర్నర్ గారిని ప్రతిపక్షం ఎలా చూసింది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం దానిని మనసులో ఉంచుకొని గవర్నర్ గారి ప్రసంగం సాగి ఉంటుంది అనేది ప్రజల అభిప్రాయం.
ప్రతిపక్షం పాలనలో ఉన్నప్పుడు కేవలం ఒక బిజెపి కార్యకర్త అని లేదా ఒక మహిళ అనే అహంకారంతో గవర్నర్ గారిని ప్రతిపక్షం పట్టించుకోలేదు. ఆవిడ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రోటాకాల్ అనేది పాటించలేదు. ఆవిడ పిలిచినా కూడా ఎవరూ వెళ్లలేదు. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించాలి అది ఖచ్చితత్వం.
గవర్నర్ గా నరసింహం గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష పాలనలో ఉన్నప్పుడు వారి బిల్లులకు ప్రతిదానికి నరసింహ గారు సరే అన్నారు. కానీ ఇప్పటి గవర్నర్ వచ్చిన తర్వాత ప్రతిపక్షం పాలనలో వారు చేసే పనులకు గవర్నర్ గారు నిజానిజాలు తెలుసుకుంటూ అది ఆచరించదగినదా లేదా అనేది ఆలోచించి కచ్చితంగా వద్దు అంటే వద్దు అనే అన్నారు. కొన్ని బిల్లుల విషయంలో కానీ లేదా కొంతమంది ఎమ్మెల్సీల విషయంలో కానీ గవర్నర్ గారు ప్రోటోకాల్ పాటిస్తూ నియమ నిబంధనలను అతిక్రమించకుండా ఉండడం వల్లనే ప్రతిపక్ష పాలనలో ఆవిడకు తీరని అన్యాయం జరిగిందని చెప్పవచ్చు.
ఆమె ఏ కార్యాలయాలకు వెళ్లిన లేదా ఏ ఫంక్షన్లకు వెళ్లిన ఏ ప్రారంభోత్సవానికి వెళ్ళినా కూడా కనీసం కలెక్టర్ గాని లేదా ఒక మంత్రి గానీ వెంట రాలేదు అంటే ఆవిడతమ్మ మాట వినడం లేదని పగ పెంచుకున్న ప్రతిపక్షం ఆమె ఎక్కడికి వెళ్లినా ఖాతరు చేయలేదు.
అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న గవర్నర్ గారు నేను రాజకీయాలకు భయపడను. ఎవరు బెదిరింపులకు లొంగను రాళ్లు వేస్తే ఆ రాళ్లతో ఇల్లు కట్టుకుంటాను అంటూ తన మనసులోని మాటలను కచ్చితంగా ఎప్పుడో చెప్పారు.
అయితే నిన్న జరిగిన గవర్నర్ గారి ప్రసంగంలో కేసీఆర్ గారి నియంతృత్వ పాలన, నిరుద్యోగుల కష్టాలు పేదలకు కన్నీళ్లు చూసి ఇన్నాళ్లకు ప్రజలకు స్వేచ్ఛ లభించింది ఒక కుటుంబ బందీల సంకెళ్లు తెంచుకున్నాం అంటూ మాట్లాడారు.
నిజానికి గవర్నర్ గారికి ప్రసంగం చేయటానికి కొత్త ప్రభుత్వమే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అనేది ముందుగానే చెప్తుంది అన్నమాట వాస్తవం. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగంలో ఎలాంటి తప్పులేదు కొత్త ప్రభుత్వం తాము చేయబోయే హామీల గురించి ఆవిడకు వివరించి చెప్పారు కాబట్టి ఆవిడ వారి నిజాయితీకి వారు చేసిన పనులకు, గత ప్రభుత్వం చేసిన పనులను చూసి రెండు బేరీజు వేసుకొని తన ప్రసంగాన్ని చేశారు.
ఇక ఈరోజు విషయానికి వస్తే ముందుగా తీర్మానం చేసిన వాళ్లు తమ హామీల గురించి చెప్తూ ఇప్పటికే రెండు హామీలు అమలు చేశాం ఇంక ముందు ముందు హామీలన్నీ నెరవేరుస్తాం అంటూ తాము చేసిన హామీల గురించి చెప్పారు. ఆ తర్వాత ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వగానే ఒక్కసారిగా ప్రతిపక్షాలు లేచి దాడి చేసినట్లుగా మీ హయాంలో ఉన్నప్పుడు నీళ్లు కరెంటు ఉద్యోగాలు లేవు అందరూ వలసలు వెళ్లారు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ 50 ఏళ్ల పాలన గురించి మాట్లాడారు.
అయితే మధ్యలోనే కొత్త ప్రభుత్వం ఎమ్మెల్యేలు లేచి అభ్యంతరం తెలుపుతూ జరిగిందేదో జరిగిపోయింది అప్పటి విషయాలను ఇప్పుడు గుర్తు తీసుకురాకండి ఇకముందు మేము అన్నీ మంచి పనులే చేస్తాం మీ సలహాలు సూచనలు తీసుకుంటాం అంతేకానీ గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడవద్దు. గత ప్రభుత్వం అంతా మంచే చేసింది దానికి మీరు ఇంకొంత అభివృద్ధి చేశారు తప్ప మీరు కొత్తగా చేసిందేమీ లేదు అంటూ సమాధానం ఇచ్చారు.
అయినా కూడా వినకుండా ప్రతిపక్ష నేతలంతా ఒకసారిగా విరుచుకుపడి మీ హయాంలో జరిగిన విషయాలన్నీ వీడియో రూపంలో నిరూపిస్తామంటూ దూషణకు పాల్పడ్డారు. సీఎం సమాధానం చెప్పాలంటూ అడగడంతో తన వంతు రాకపోయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు లేచి మీరు అన్ని సమస్యలు అడిగారు ఒక్కొక్క దానికి అన్ని సమాధానాలు చెప్తాం. ఈరోజు ధన్యవాదాలు తెలిపే సమయం కాబట్టి ఇప్పుడు కాకుండా మరొక రోజు సమయం తీసుకుని ఈ అన్ని విషయాల గురించి చర్చిద్దాం అంటూ చాలా హుందాగా ప్రవర్తించారు.
ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలన్నీ కేటీఆర్ గారు అసెంబ్లీలో అవే రిపీట్ చేశారు 50 ఏళ్ల పాలనలో మీ వల్లనే నీళ్లు రాలేదు మీ వల్లనే కరెంటు లేదు మీ వల్లనే ఉద్యోగాలు రాలేదు మీ వల్లనే ఆత్మహత్యలు మీ వల్లనే వలసలు అంటూ ఎత్తి పొడిచారు.
అయినప్పటికీ కూడా విపక్షాలు వినకుండా వారి వాదన వారు కొనసాగించడం జరిగింది. చివరికి స్పీకర్ కూడా మారవలసి వచ్చింది. తర్వాత డిప్యూటీ సీఎం లేచి మన ప్రసంగం అందరూ వింటున్నారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రసంగం స్ఫూర్తిదాయకం కావాలి కానీ అనుమానాలు రేకెత్తించకూడదు అంటూ ఎంతో హుందాగా సమాధానం ఇచ్చి వారిని సమాధాన పరిచినా కూడా పద్యమద్యలో లేస్తూ గొడవలు పెడుతూనే ఉన్నారు.
నిజానికి ధన్యవాదాలు తీర్మానంలో కేవలం తాము చేసే హామీల గురించి విపక్షాలకు గవర్నర్‌కు స్పీకర్‌కు తెలియజేసి వారు ఆమోదం తెలిపిన తర్వాత సభను వాయిదాను వేస్తారు కానీ ఈరోజు మాత్రం చాలా వాడి వేడిగా సమావేశం జరిగింది.
అలాగే ప్రతిపక్షం ప్రభుత్వం చేయని హామీల గురించి ప్రశ్నించాలి.దానికి పాలనలో ఉన్నవారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.చేయని హామీలను గుర్తు చేసి దగ్గర ఉండి అవి చేసేలా ప్రోత్సహించాలి.తప్ప ఎలా పడితే అలా మాట్లాడకూడదు.మీకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందంటు బెదిరించడం ఎంతవరకు కరెక్ట్?
ఇప్పుడే మొదలైన కొత్త ప్రభుత్వంలో వారిని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? వారిపై దాడి చేసినట్లు ప్రవర్తించడం కరెక్టేనా? విపక్షాలు ఎంత మాట్లాడినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వంలో ఉన్న వాళ్లు హుందాగా ప్రవర్తిస్తూ మా పాలనలో మేము మీ సలహాలు సూచనలు తప్పకుండా తీసుకుంటాం. ముందు ముందు మీ సలహాలను మేము అడుగుతాం, అంటూ సమాధానం చెప్పారు తప్ప,విపక్షాల లాగా విరుచుకు పడలేదు.
రేవంత్ రెడ్డి గారు అన్న రెండు మాటలను పట్టుకొని కేటీఆర్ గారు తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాలలో ఉన్నప్పుడు పోటీ చేస్తున్నప్పుడు మాటలు అనుకోవడం విమర్శలు చేయడం సహజం. అయితే దానిని అడ్డుగా పెట్టుకొని మీ ప్రభుత్వం కొన్నాళ్ళే అంటూ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం సబబు కాదు అనేది ప్రజల మాట.
నిజానికి అసెంబ్లీలో గొడవలు జరగడం ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం కూడా జరుగుతుంది కానీ పుట్టగానే చేదు మందు తిన్నట్టు, అసెంబ్లీ కొలువైన నాలుగవ రోజునే మాటలతో ఘాటైన విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అనేది ప్రజల అభిప్రాయం మాత్రమే.
ఏది ఏమైనా నిన్న గవర్నర్ గారు చేసిన ప్రసంగం చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక్క రోజుతోనే గడిచిపోలేదు. ఇంకా ఇదేళ్ల కాలం ఉంది. కొత్త ప్రభుత్వం తమ పాలలను ఎలా సాగిస్తుందో ముందు ముందు వేచి చూద్దాం. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటాయి అనేది మనం ముందు ముందు చూద్దాం..
ఇవన్నీ ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల మాటలు మాత్రమే. మేము ఏ పార్టీకి సపోర్టుగా ఉండడం లేదు కేవలం ప్రజల అభిప్రాయాల సేకరణకు మాత్రమే తీసుకున్నాం.