Telugu Special Stories

జాతీయ చేతివ్రాత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత

మీరు కాగితాన్ని,కలాన్ని ఉపయోగించి ఎన్ని రోజులు అయ్యిందో మీకు గుర్తుందా? ఆలోచిస్తున్నారు అంటే మీరు ఉపయోగించలేదు అని అర్ధం.అంటే మనం స్కూల్ రోజుల్లో తప్ప మిగిలిన సమయంలో కాగితాన్ని,కలాన్ని ఉపయోగించడం మర్చిపోయాం.

ఇప్పుడు సెల్ ఫోన్ కాలం వచ్చాక కాగితం,కలం తో మొత్తానికే పని లేకుండా పోయింది.అంతా సెల్లు మయమే అయ్యింది.

స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసిన మొదటి వ్యక్తి జాన్ హాన్‌కాక్ పుట్టినరోజున జనవరి 23వ తేదీని జాతీయ చేతివ్రాత దినోత్సవంగా పాటిస్తారు. స్మార్ట్‌ఫోన్‌లు మరియు వాయిస్-టు-టెక్స్ట్ అప్లికేషన్‌ల ఈ యుగంలో, ప్రజలు పాత పెన్ను మరియు కాగితం యొక్క స్పర్శ ఆనందాన్ని పొందడం మీకు తెలియక పోవచ్చు

మీ మెదడుకు పదును పెట్టడానికి చేతివ్రాత ఒక ముఖ్యమైన నైపుణ్యం అని మనం తరచుగా మర్చిపోతున్నాము. అంతే కాదు, ఆందోళన కలిగించే ఒకరి ఆలోచనల వేగాన్ని నెమ్మదించడంలో సహాయపడగలగడం వల్ల రాయడం అనేది క్లినికల్ సైకాలజిస్టులు మరియు థెరపిస్టులచే తరచుగా సూచించబడే ఒక అభ్యాసం.రాయడం వలన మీరు విషయాలను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది.

పూర్వం ఋషులు మునులు తాళపత్ర గ్రంథాలపై పాలీలతో రాసేవారు. ఆ తర్వాత సిరా పెన్నులతో వ్రాసేవారు అయితే ఇది పెద్దతతంగంగా ఉండేది. సిరాను పెన్నులో పోయడం అనేది ఒక కళ. ఒక్క చుక్క కూడా కింద పడకుండా పెన్నులో పోసి వ్రాసేవారు.

ఇలా రాయడం వలన మనలోని ఆలోచనలను మంచి రూపం ఇవ్వవచ్చు అలాగే మన మనసులోని మాటలను చెప్పలేని వారికి చెప్పవచ్చు అందుకే ఉత్తరాలపర్వం మొదలైంది ఉత్తరాలలో తమ ఆలోచనలు తమ ముందున్న భవిష్యత్తు ప్రణాళికలు ఎలా రూపొందించుకోవాలి అని లేఖలు రాసేవారు అయితే ఇందిరా ప్రియదర్శి అంటే ఇందిరా గాంధీ గారు తన తండ్రికి రాసిన లేఖలు ఎంతో ప్రాచుర్యం పొందాయి అని మీకు తెలుసు.

ఆమె తన తండ్రి గారికి తన మనసులో ఉన్న భావాలనన్నిటిని ఉత్తరాల రూపంలో పంచుకున్నారు. అలాగే మనం కూడా మన చేతి రాతను కాగితంపై పెట్టి మనలోని భావాలను రాసుకోవచ్చు పంచుకోవచ్చు.

రచయితలు మొదటగా ఆశ్రయించేది కాగితం కలాన్ని. ముందుగా రచయితలు తమ ఆలోచనలకు పదును పెట్టడానికి కాగితంపై కలాన్ని పెట్టి రాయడం మొదలు పెడతారు ఆ తర్వాత దానికి ఒక రూపం ఇవ్వడానికి ఎన్నో కాగితాలను వారు నలిపివేసి ఒక రూపం రావడానికి ఎంతో శ్రమిస్తారు.

అలాగే మనం కాగితంపై కలం పెట్టడం వల్ల మన చేతిలోనే నాడులు 5 వేళ్ళు ఉత్తేజితం అవుతాయి ఒక్కొక్క అక్షరాన్ని రాయడంలో ఒక్కొక్క వేలు మడచడం ఒక విధంగా రాయడంతో వేలులోనే ఉన్న నరాలు శ్రమకు గురి అవుతాయి అంటే వాటికి ఒక రకంగా ఎక్సర్సైజ్ లాగా అన్నమాట.

కుడిచేత్తో రాస్తాం కాబట్టి చేతిలోనే కాకుండా మెడలో నరాల నుంచి మన శరీరం మొత్తం ఉత్తేజితం అవడం గమనించండి.

అలాగే మన మనసులో ఉన్న కోపాన్ని ప్రేమను అభిమానాన్ని విరహాన్ని ద్వేషాన్ని కూడా చేతిరాతతో కాగితంపై పెట్టి చూపించవచ్చు.

ఇప్పుడు ఉన్న మొబైల్ కాలంలో చాలామంది కాగితంపై పెన్నులు పెట్టడం లేదు దానివల్ల వాళ్ళు ఎంత కోల్పోతున్నారు ఎంత జీవితాన్ని మరిచిపోతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడున్న కాలంలో వాళ్ల మనసులోని మాటలు స్టేటస్ ల రూపంలో వాయిస్ టైపింగ్ చేసి పెట్టేస్తున్నారు కానీ ఒంటరిగా కూర్చొని ఒక కాగితం పెన్నును తీసుకొని రాయడానికి ప్రయత్నించండి మీకు ఏం రాయాలో అసలు అర్థం కాదు ఏమీ గుర్తుకు కూడా రాదు కానీ ఒక్కసారి రాయడం మొదలుపెడితే మీ మనసులో ఉన్న భావాలు అన్నిటిని కాగితంపై పెట్టవచ్చు.

కంప్యూటర్ వచ్చాక అందులో పని చేస్తూ టైపింగ్ కి సమయం కేటాయిస్తున్నారు తప్ప కాగితంపై కలాన్ని పెట్టి రాయడం మర్చిపోయారు. ఆ ఇప్పుడు కాగితంపై ఎవరు రాస్తారు అంతా ఆన్లైన్ అయింది కదా అని అంటున్నారు కానీ ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు కార్యాలయంలో కూడా కాగితాలపై రాసేవారు

దీనివల్ల వాళ్ళ ఆలోచన శక్తి పెరిగి ఎక్కడ ఏ పదాన్ని వాడాలి ఎక్కడ ఏ వ్యాకరణాన్ని ఉపయోగించాలి అసలు వాక్య నిర్మాణం అంటే ఏమిటి అనేది బాగా గుర్తించారు.

ఇప్పటికీ కొందరు రచయితలు ముందు కాగితంపై తమ ఆలోచనలను పెట్టిన తర్వాతే కంప్యూటర్ లో పెట్టడం జరుగుతుంది అందువల్ల చేతితో రాయడం వల్ల కలిగే ప్రాముఖ్యతను ప్రయోజనాలను గుర్తుపెట్టుకొని కాగితంపై రాసే అలవాటును చేసుకోండి. దానివల్ల మీ రాత అందంగా ఉంటుంది అందుకే మనకు చిన్నప్పుడు చూచి రాతను పెట్టి ఇచ్చేవారు.

ఆ చూసి రాత వల్ల మన రాత అందంగా వచ్చేది. ఇప్పటికీ కూడా అందంగా రాసే వాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే వాళ్లు రాయడం మర్చిపోయి ఉంటారు ఎందుకంటే ఆధునికత పెరిగింది కాబట్టి చాలామంది రాయడం మర్చిపోయారు అందువల్లనే రాయడం వల్ల కలిగే ప్రాముఖ్యతను అసలు చేతిరాత అనేది ఎలా మొదలైంది అనేది మీకు తెలియజేశాను.

అందువల్ల డాక్టర్లు మిమల్ని పరీక్షించడం,విశ్లేషించడం కోసం రూపొందించిన మీ మెదడుపై ఆధారపడకుండా చేయవలసిన జాబితా లేదా ఉదయం పని జాబితాను తయారు చేయాలని తరచుగా సలహా ఇస్తారు. మీ చేతివ్రాతను ప్రాక్టీస్ చేయడం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం, ప్రత్యేకించి ఇది చాలా అరుదుగా కమ్యూనికేషన్ రూపంలో ఉపయోగించబడే ప్రపంచంలో.

కంప్యూటర్ కీబోర్డులు కొత్త వ్రాత పద్ధతిగా, చేతివ్రాత నైపుణ్యాన్ని అభ్యసించడం ఇప్పుడు మరింత అవసరం. జాతీయ చేతివ్రాత దినోత్సవం 1977లో కనుగొనబడింది. చరిత్రకారుల ప్రకారం, చేతివ్రాత కళ 3400 BCలో మెసొపొటేమియాలో కనుగొనబడింది, అక్కడ వారు మట్టి పలకపై క్యూనిఫారం రాస్తారు. అక్కడ నుండి, రచనా కళ విస్తరించింది…

చరిత్ర

1977లో కనిపెట్టబడిన జాతీయ చేతివ్రాత దినోత్సవాన్ని ది రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (WIMA) స్థాపించింది, అధ్యాపకులు చేతివ్రాత కళను నైపుణ్యంగా కోల్పోతున్నట్లు భావించడం ప్రారంభించారు.

1776లో హాంకాక్ సంతకం పత్రం యొక్క తుది సంస్కరణను ధృవీకరించడానికి ఉపయోగపడింది.హాంకాక్ కాంటినెంటల్ కాంగ్రెస్ అధ్యక్షుడు.

చరిత్రకారుల ప్రకారం మెసొపొటేమియాలో 3400 BCలో చేతివ్రాత కళ కనుగొనబడింది. మట్టి పలకపై క్యూనిఫారం రాసేవారు.రచనా కళ ఈజిప్టుకు, ఆ తర్వాత రోమ్‌కు, ఆపై మిగిలిన యూరప్‌కు వ్యాపించింది.

ఐరోపా అంతటా వ్యాపించిన తర్వాత, రాచరిక కుటుంబాలు మాత్రమే సరిగ్గా రాయడం నేర్పినందున, మంచి రచనా నైపుణ్యాలు హోదాకు చిహ్నంగా మారాయి.

1700లలో ప్రపంచంలోని మొట్టమొదటి చేతివ్రాత మరియు పెన్మాన్‌షిప్ పాఠశాలలు లేఖకులకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పడ్డాయి.

మీ మెదడుకు పదును పెట్టడానికి చేతివ్రాత ఒక ముఖ్యమైన నైపుణ్యం అని మనం మర్చిపోతున్నాం.అంతే కాదు, ఆందోళన కలిగించే ఒకరి ఆలోచనల వేగాన్ని నెమ్మదించడంలో సహాయపడగలగడం వల్ల రాయడం అనేది క్లినికల్ సైకాలజిస్టులు మరియు థెరపిస్టులచే తరచుగా సూచించబడే ఒక అభ్యాసం.

రాయడం వలన మీరు విషయాలను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది, అందువల్ల అంశాలను ప్రాసెస్ చేయడం మరియు విశ్లేషించడం కోసం రూపొందించిన మీ మెదడుపై ఆధారపడకుండా చేయవలసిన జాబితా లేదా ఉదయం పని జాబితాను తయారు చేయాలని తరచుగా  సలహా ఇస్తారు.

మీ చేతివ్రాతను ప్రాక్టీస్ చేయడం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం, ప్రత్యేకించి ఇది చాలా అరుదుగా కమ్యూనికేషన్ రూపంలో ఉపయోగించబడే ప్రపంచంలోఅవసరం ఎంతైనా ఉంది.

అలాగే పార్కిసన్ వ్యాధిని ముందుగా గుర్తించడం లో మన చేతి వ్రాత కూడా ఉపయోగపడుతుంది.రోగ నిర్ధారణ చేయవచ్చు అని పరిశోధకులు అంటున్నారు.చేతి వ్రాత ఒక ధ్యానం వంటిది.మెదడులోని కొన్ని ప్రాంతాలలో సెరిబ్రల్ కార్యకలాపాలను పెంచుతుంది.ఇండియానా యూనివర్సిటీలో నిర్వహించిన పరిశోధనల ప్రకారం చేతితో రాయడం అనేది సృజనాత్మకతను పెంచుతుంది.అది ఏ పద్దతిలో కూడా సులభంగా అందుబాటులో ఉండదు.

హై-టెక్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ తక్కువ-టెక్ చేతివ్రాత మెదడులోని కొన్ని ప్రాంతాలలో న్యూరానల్ కార్యకలాపాలను పెంచుతుందని నిరూపించింది.

రచన మన సృజనాత్మక రసాలను ప్రవహింపజేయడంలో సహాయపడుతుంది మరియు ఆలోచనా ప్రక్రియలను నిర్వహించడానికి మద్దతు ఇస్తుంది. తన కథనాలలో ఒకదానిలో, ప్రఖ్యాత రచయిత పాట్రిక్ మెక్‌క్లీన్ పెన్ మరియు కాగితాన్ని ఉపయోగించడం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కలిగే పరధ్యానాలను నివారించడంలో సహాయపడుతుందని పేర్కొన్నాడు. టైప్ చేస్తున్నప్పుడు, వ్యక్తులు కంటెంట్‌ని అభివృద్ధి చేస్తున్నప్పుడు దాన్నిసవరించడంపై దృష్టి పెడతారు.

ఇది సృజనాత్మక ప్రక్రియకు ప్రతికూలంగా ఉంటుంది. మరోవైపు, పెన్ను మరియు కాగితాన్ని ఉపయోగించడం వలన వ్యక్తులు వారి సృజనాత్మక ఆలోచనలను వ్రాయడానికి, వారి ఆలోచనలను పూర్తిగా సేకరించి, తర్వాత సవరించడానికి అనుమతిస్తుంది.

చేతివ్రాత ఆనందాన్ని పెంచుతుంది

రోచెస్టర్ విశ్వవిద్యాలయం యొక్క హెల్త్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం,జర్నలింగ్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కాగితంపై ఆలోచనలు, ఆలోచనలు మరియు భావోద్వేగాలను వ్రాయడం వలన ప్రజలు తమ భావాలను బాగా వ్యక్తీకరించడానికి మరియు వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.

ప్రజలు తమ భావాలను గుర్తించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇది తగినంత సమయాన్ని అనుమతిస్తుంది. ప్రజలు స్పూర్తిగా లేదా నిరుత్సాహంగా భావించేలా చేసే ఆలోచనలను వ్యక్తీకరించడంలో రాయడం సహాయపడుతుంది. కాగితంపై భావోద్వేగాలను వ్రాసే ప్రక్రియ చికిత్సాపరమైనదిగా నిరూపించబడింది మరియు సంతోషాన్ని పెంపొందించడంతోపాటు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

మానవ నాగరికతను ఉన్నతీకరించే మరియు పెద్ద ఎత్తున కమ్యూనికేట్ చేయడానికి మరియు వ్యాపారం చేయడానికి మాకు అనుమతించే ప్రధాన నైపుణ్యం రాయడం.

రాయడం చరిత్ర నుండి పూర్వ చరిత్రను వేరు చేయడమే కాదు, మన ఆలోచనలు మరియు భావాలను రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది.

మరింత కీలకమైనది, లావాదేవీలను రికార్డ్ చేయడానికి, వస్తువులను లెక్కించడానికి మరియు భవిష్యత్ వినియోగదారులకు సమాచారాన్ని అందించడానికి మనకు మాధ్యమాన్ని అందించడం ద్వారా ప్రారంభ సమాజాల అభివృద్ధికి ఇది సహాయపడింది.

రచనా వ్యవస్థలు వాటి నిర్మాణంలో విభిన్నంగా ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని చిత్రమైన ప్రతీకవాదంపై ఆధారపడి ఉంటాయి.

కొన్ని కొత్త అర్థాలను ఏర్పరచడానికి అక్షరాలను మిళితం చేస్తాయి మరియు కొన్ని పూర్తి వాక్యాలను మరియు అర్థం యొక్క లోతును సృష్టించడానికి వ్యాకరణ నిర్మాణాలను ఉపయోగిస్తాయి.

వర్ణమాల-ఆధారిత వ్రాత వ్యవస్థలు హల్లులు, అచ్చులు లేదా అక్షరాల శబ్దాలను సూచించడానికి చిహ్నాలను ఉపయోగించవచ్చు.

సెమాంటిక్-ఫొనెటిక్ రైటింగ్ సిస్టమ్‌లు శబ్దాలు మరియు అర్థాలు రెండింటినీ సూచించే చిహ్నాలను కలిగి ఉంటాయి.

ఇలా కాగితం పై రాయడం వల్ల మనం మనలోని భావాలను మనమే తెలుసుకోవచ్చు.మనమేం ఆలోచిస్తున్నాం, మన మనస్తత్వం ఏమిటి అనేది మన చేతిరాత తో తెలుస్తుంది.క్రిమినల్స్ ను కూడా పోలీసులు ఏదైనా రాయమని అంటారు.అలా వాళ్ళు రాసిన దాన్ని బట్టి వారి మనస్తత్వాన్ని నిర్ధారణ చేస్తారు.వాళ్ళు నేరం చేశారా లేదా అనేదు కూడా తెలుసుకోవచ్చు.

ఒక్కొక్కప్పుడు రోగికి రోగం ఏంటో తెలుసుకోవడానికి కూడా డాక్టర్లు ఉపయోగించే పద్ధతి రాయడం.అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఒక వ్యక్తి సంతకం ద్వారా ఆ వ్యక్తి ఆలోచనలు ఏమిటి?ముందు ముందు అతనేం చేయబోతున్నాడు అనేదు కూడా నిపుణులు పరిశీలిస్తారు.మనలోని రచనా శక్తిని పెంపొందించుకోవడానికి,భావాలకు అక్షర రూపం ఇవ్వడానికి కూడా కాగితం పై రాయడం ఎంతో ఉపయోగపడుతుంది. మొదట రాసినప్పుడు మన రాత మనకే నచ్చదు. ఎందుకంటే మనం రాయడం మర్చిపోయాం కాబట్టి, ఇకనైనా రాయడం మొదలు పెట్టండి. రాయడం లోనూ,గజిబిజి రాత,కలిపి రాత,అసలు అర్ధం కానీ రాతలు పూర్వులు రాసేవారు.అవి ఎవరికీ అర్ధం కావు, వారికీ తప్ప, ఇప్పటికి కొందరు రచయితలు కాగితం పై రాస్తే వారికీ తప్ప ఆ రాత ఇంకెవరికీ అర్ధం కాదు. అంటే వారు తమ ఆలోచనలు ఇతరులకు తెలియకూడదు అనే ఉద్దేశ్యం తో, లేదా ఆలోచనలు మర్చిపోకుండా ఉండేందుకు అలా వేగంగా రాస్తూ ఉంటారు.

ఇంకా కొందరు తమ ఆలోచనల్ని కాగితం పై అంకెలుగా రాస్తారు.వాటి అర్ధాలు వారికీ తప్ప ఎవరికీ తెలియదు.

ఇక పోతే మనం రాయడం మర్చిపోయాం, కాబట్టి ఇక నుండి వారానికి ఒకసారైనా కాగితం పై రాసే ప్రయత్నం చేయడం వల్ల మీరు మీ ఆనందాన్ని పొందవచ్చు, మీ భావోద్వేగాలను కూడా పంచుకోవచ్చు,ఎవరికీ మీ భావాలూ తెలియకూడదు అనుకుంటే దానిని మీరు గజిబిజిగా కూడా రాసుకోవచ్చు,కానీ మీ రాతను అందంగా రాయడానికే ప్రయత్నం చేయండి. దాని వల్ల మీ ఆరోగ్యం, మనసు ఉత్తేజితం అవుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.మీ ఆలోచనలకు కూడా పదును పెరుగుతుంది. ఇక్కడ చెప్పేది ఏమిటంటే మీ రాతను బట్టి మీ మనస్తత్వం ఉంటుంది.అందువల్ల చేతి రాత ప్రాముఖ్యాన్ని,ప్రాధాన్యతను తెలుసుకుని,కాగితం పై మీ మనసులోని భావాలను పంచుకుంటే మీరెంటో మీరే తెలుసుకోవచ్చు.. అందరికీ జాతీయ చేతి వ్రాత దినోత్సవ శుభాకాంక్షలు..

Show More
Back to top button