Telugu Special Stories

ఇన్‌స్టాగ్రామ్ సక్సెస్ స్టోరీ

స్మార్ట్‌ఫోన్ వాడే వాళ్లకు ఇన్‌స్టాగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్.. తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇదంతా సరే.. ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌ ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుట్టిందో తెలుసా..? ఇన్‌స్టాగ్రామ్ 2010లో పుట్టింది.

దీని చరిత్ర తెలుసుకోవాలంటే దీన్ని ఫౌండర్ అయినా కెవిన్ సిస్ట్రోం గురించి తెలుసుకోవాలి. అతడు 1983 డిసెంబర్ 30న జన్మించాడు.

తన తల్లి మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌, తండ్రి ఒక కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసేవారు. కెవిన్ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌కి ముందు burbn
ప్రోగ్రామింగ్‌లో కెవిన్ సాధించిన నాలెడ్జ్ చూస్తే.. అతడికి టెక్నాలజీ అంటే ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది. కానీ, ప్రోగ్రామింగ్‌‌‌కి ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగం(గూగుల్‌లో) ఒకటి కెవిన్‌కి వచ్చింది. సోషల్ స్పేస్‌లో రావాలన్న తన కొరిక అలాగే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత తనకంటూ ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు.

2009లో burbn అనే ఒక ఫొటోలు షేర్ చేసే వెబ్ యాప్‌ని ప్రారంభించారు. బిజినెస్ కోసం ఉద్యోగం మానేయగా..

కొన్ని రోజుల్లోనే దానికి మంచి ఆదరణ వచ్చింది. వ్యాపారంలో సపోర్ట్ కోసం జూనియర్ అయిన మైక్ క్రిగెర్‌ని చేర్చుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌ లాంచ్
కొన్నాళ్లకే burbn యాప్‌కి కష్టాలు మొదలయ్యాయి. యాప్‌లో క్లారిటీ లేదనే, కొత్త ఫీచర్స్ తీసుకొస్తే బాగుంటుందని కాబోయే భార్య ఓ సలహా ఇచ్చింది. దీంతో 8 వారాల పాటు కష్టపడి యాప్‌లో కొన్ని మార్పులు చేశారు.

మొదట్లో ఈ యాప్ కేవలం ఐఫోన్ యూజర్ల కోసం తయారు చేశారు. అలా ఎన్నో మార్పులు చేసి చివరకు 2010 అక్టోబర్ 6న ఇన్‌స్టాగ్రామ్‌గా లాంచ్ చేశారు.

లాంచ్ చేసిన 2 గంటలకే చాలా మంది లాగిన్ అయ్యారు. ఎంతలా అంటే.. లోడ్ తట్టుకోలేక సర్వర్ కూడా డౌన్ అయింది.

అలా మొదలైన యూజర్ల ఆదరణ ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. కట్ చేస్తే.. సోషల్ మీడియా సామ్రాజ్యంలో ఇన్‌స్టాగ్రామ్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

మార్క్ చేతుల్లోకి ఇన్‌స్టాగ్రామ్
తక్కువ కాలంలోనే ఫేస్‌బుక్ యూజర్స్ చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావడం మొదలుపెట్టారు. ఫేస్‌బుక్‌తో పోలిస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫీచర్స్ ఉండటమే ఇందుకు కారణం.

ఇది గమనించిన ఫేస్‌బుక్ ఫౌండర్ ‌మార్క్‌ జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌ని కొనాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్లుగానే కెవిన్‌తో ఒప్పందం కుదుర్చుకుని సొంతం చేసుకున్నాడు.

ఈ డీల్ విలువ 1 బిలియన్ డాలర్లు. ఓ స్టార్టప్ కంపెనీకి కేవలం 2 ఏళ్లలో ఇంత ఎక్కువ ధర పలకడం సాధారణ విషయం కాదు.

ఇన్‌స్టాగ్రామ్‌ని కొన్నప్పుడు చాలామంది ‘మార్క్.. తప్పు నిర్ణయం తీసుకున్నాడు’ అని అభిప్రాయపడ్డారు.

కానీ, కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తూ.. సోషల్ మీడియా రంగంలో ఇన్‌స్టాగ్రామ్‌ టాప్ రేంజ్‌లోకి తీసుకొచ్చాడు.

Show More
Back to top button