అది 1970వ సంవత్సరం, విబీఎం వంటి విదేశీ టెక్ దిగ్గజాలు మన భారత మార్కెట్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అప్పటికీ మన దేశంలో పేరున్న స్వదేశీ ఐటీ సంస్థలేమీ లేవు. దీంతో తమిళనాడుకి చెందిన ఓ సాధారణ పౌరుడు.. ఢిల్లీ క్లాత్ మిల్స్‌లో ఇంజనీరుగా పనిచేస్తున్న ఓ యువకుడు.. సాహసోపేతమైన మిషన్‌ను ప్రారంభించారు. ఇండియా స్వదేశీ సాంకేతికతతో ప్రపంచ వేదికపై పోటీపడే భవిష్యత్తును ఆయన ముందుగానే ఊహించారు. ఆయనే ప్రస్తుతం దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా కొనసాగుతున్న హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్. కొన్ని దశాబ్దాల క్రితమే.. టెక్ కంపెనీకి బీజాలు నాటిన ఆయన బిజినెస్ సక్సెస్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం.
1976లో HCL స్థాపన
శివ్ నాడార్.. 1976లో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ప్రారంభించారు. అక్కడితో ఆగిపోని ఆయన మరో రెండేళ్ల వ్యవధిలోనే హెచ్ సీఎల్ BCని సృష్టించారు. ఆ తర్వాత గ్లోబల్ సామర్థ్యాన్ని గుర్తించిన ఆయన 1980లో సింగపూర్‌లో ఫాస్ట్ ఈస్ట్ కంప్యూటర్లను స్థాపించి.. దాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించారు. 1984లో BusyBee అనే వ్యక్తిగత కంప్యూటర్ను ప్రారంభించడంతో ఆయన జీవితంలో ఆసలైన పురోగతి మొదలైంది.
HPతో భాగస్వామ్యం
BusyBee కంప్యూటర్లకు అమెరికా మార్కెట్లలో నష్టాలు వచ్చాయి. దీంతో ఆయన.. 1991వ సంవత్సరంలో HP కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాడు. ఈ దెబ్బకి 2001 నాటికి HCL భారతదేశంలోనే అగ్ర డెస్క్ టాప్ తయారీ సంస్థగా అవతరించింది. ప్రస్తుతం భారతదేశంలో 3వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా కొనసాగుతోంది. ప్రస్తుతం HCL టెక్నాలజీస్ మార్కెట్ క్యాప్ రూ.4.26 లక్షల కోట్లుగా ఉంది. శీన్ నాడార్ దాతృత్వం.. ఎడెల్గావ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా-2023 ప్రకారం.. ఆయన ఒక సంవత్సరం వ్యవధిలోనే రూ.2,042 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే రోజుకు సగటున 5.6 కోట్లు దానాలతోపాటు వివిధ సేవా కార్యక్రమాలకు ఆయన ఖర్చు చేశారు. ఆ నివేదిక ప్రకారం.. అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారిలో ఆయన తొలి స్థానంలో నిలిచారు.
ఎందరికో ఆదర్శం
భారత్ వంటి అధిక జనాభా కల్గిన దేశంలో. సాధారణంగా ప్రపంచమంతా గుర్తించదగిన వ్యాపారవేత్తగా ఎదగడం అంత తేలికైన విషయం అయితే కాదు. కానీ, ఆయన పట్టుదలతో కలను సాకారం చేసుకున్నారు. లక్ష్య సాధనలో ఎదురైన సమస్యలను అధిగమించి శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఓ వ్యక్తి తను అనుకున్నది సాధించాలంటే.. పట్టుదల చాలా ముఖ్యమని ఆయన సక్సెస్ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవచ్చు.