HEALTH & LIFESTYLE

చాపకిందనీరులా ఆటిజం

ల్లిదండ్రులు తమ పిల్లలను ఆప్యాయంగా చూసుకోకపోవడం, ఆటిజం ప్రేమగా దగ్గరకు తీయకపోవడం వల్ల పిల్లలు మానసికంగా ఒంటరితనానికి గురవుతారు. ఇదే ఆటిజానికి ప్రధాన కారణం అనుకునేవారు. కానీ, ప్రేమగా చూసున్న వారి పిల్లలూ ఆటిజమ్‌ బారిన పడుతున్నారు. పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం మంచి, చెడు నేర్పకపోవడంతో పసితనంలో బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. పిల్లలతో పాటుగా ఈ వ్యాధి పెరిగి అనేక మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. దీన్నే ‘పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిసార్డర్స్‌’ అంటారు. ఆటిజంతో బాధపడుతున్న పిల్లల శరీరం ఎదుగుదల అస్తవ్యస్తంగా ఉంటుంది.

ఇతరులతో కలవలేకపోతుండటం: ఆటిజమ్‌ పిల్లలు తోటి పిల్లలతో ఆడుకోవటానికి అంతగా ఇష్టపడరు. ఒంటరిగా ఆడుకోవటం, ఒంటరిగా గడపటం చేస్తుంటారు.

భావ వ్యక్తీకరణ లోపం: ఆలస్యంగా మాటలు రావడం. స్పష్టంగా మాట్లాడలేక పోవడం, అన్నింటికీ ఇతరులపై ఆధారపడతారు. స్వతహాగా వారి పనులు వారు చేసుకోలేరు.

ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. కోపం, సంతోషం వచ్చినా ఆపుకోలేరు.

లక్షణాలు

ఆటిజంతో బాధపడుతున్న పిల్లల లక్షణాలను బట్టి 5 రకాలుగా వర్గీకరించారు.

ఆటిస్టిక్‌ డిజార్డర్‌: ఎక్కువగా కనబడే ఆటిజం రకం ఇదే. దీన్ని ‘చైల్డ్‌హుడ్‌ ఆటిజమ్‌’ అంటారు. ఇది ఆడ పిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువ.

రట్స్‌ డిజార్డర్‌: అరుదైన ఈ రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. పుట్టిన ఏడాది తర్వాత ఈ ఆటిజం లక్షణాలు కనబరుస్తారు. అవి రెండు మూడేళ్లలో తీవ్రతరం అవుతాయి. ఇది ముదిరి నాడీ సంబంధ సమస్యలు, నడుము నిలపలేక పోతుండటం వంటివి ప్రారంభమవుతాయి. క్రమంగా ‘ఫిట్స్‌’ కూడా వస్తాయి. వయసుతో పాటు శరీర పెరుగుదల ఉండకపోవడం, చొంగ కారడం, చేతులు కాళ్లు ఒకే రకంగా ఆడిస్తుండటం, చేతులతో చప్పుళ్లు చేయడం వంటి ప్రదర్శిస్తుంటారు.

ఆస్పర్జెర్స్‌ డిజార్డర్‌: ఇది మగ పిల్లల్లో ఎక్కువ. ఈ రకం ఆటిజంలో మాటలు మామూలుగానే ఉంటాయి. నలుగురిలోకి వెళ్లడం, తెలివి తేటలు కూడా బాగానే ఉంటాయి. కానీ, తక్కువగా మాట్లాడతారు. దీన్ని వెల్‌ ఫంక్షనింగ్‌ ఆటిజమ్‌ ఉంటారు. వీరిలో ప్రవర్తనా సమస్యలు అధికం. కోపం, బాధ వంటివి ఎక్కువ.

* చైల్డ్‌హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌: ఇది ఆటిజమ్‌లో తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినప్పుడు బాగానే ఉంటారు. ఒకటి, రెండేళ్ల వరకు ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగా వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లటం (రిగ్రెషన్‌) మొదలవుతుంది. ఇది చాలా వేగంగా. వీరిలో ముఖం రఫ్‌గా, ముదిరినట్టు ఉండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా ఉండటం వంటివి కనబడతాయి. నాడీ సంబంధ లోపాలూ ఆరంభమై, ఫిట్స్‌ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితమవుతాయి. ఈ పరిస్థితులు మరణానికి కూడా దారి తీస్తాయి.

చికిత్స ఏమిటి?

ఆటిజం సమస్య అందరికీ ఒకే రీతిలో ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలూ స్పష్టంగా తెలీవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా చేస్తామని వైద్యులు చెబుతున్నారు. ‘ఆటిజం రేటింగ్‌ స్కేల్స్‌’ ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే ‘IQ’ టెస్ట్ చేస్తారు.

ఫిట్స్, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉంటే మూడేళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. మాటలు రాని పిల్లలకు మాటలు నేర్పించడం వంటివి చేస్తారు.

సైకియాట్రిస్ట్‌ని తరచూ కలవడం వల్ల పిల్లల ప్రవర్తన అంచనా వేసి మానసిక స్థితిని మెరుగు పరచవచ్చు. పిల్లలు ఆటిజం నుంచి కోలుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది.

వీలైనంత ఎక్కువ సమయం చిన్నారులతో గడిపి, వారిలో మానసిక వికాసాన్ని పెంచాలని వైద్యులు అంటున్నారు.

Show More
Back to top button