మన ముఖం భాగంలో కళ్ల కింద ముక్కుకి రెండు పక్కల ఖాళీ గదుల లాంటి నిర్మాణం ఉంటుంది. వీటిని సైనస్ గదులు అంటారు. ప్రతి ఒక్కరికి 4 జతల సైనస్ గదులు ఉంటాయి. ఈ గదులు లోపలి భాగాలు జిగురు పొరతో కూడుకొని ముక్కు రంధ్రాల్లో తెరుచుకొని ఉంటాయి. పుర్రె బరువు తగ్గించడానికి, మెడపై పడే తల బరువు బ్యాలెన్స్ చేయడానికి, మనం పీల్చుకున్న గాలిలో దుమ్ము, ధూళి కణాలను ఊపిరితిత్తులు చేరకుండా చేయడంలో ఈ సైనస్ గదులు సహాయపడతాయి.
కొంతమందిలో సైనస్ గదులు చీము, నీరు చేరడం, గదులు వాచి శ్వాస నాళాలలో గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా తలెత్తడం మారుతుంది. దీన్నే సైనటీస్ అంటారు. తలనొప్పి, తల బరువెక్కడం, ముఖంలో వాపు, నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు దురద, నీరు కారడం, గొంతులోకి ద్రవాలు కారడం, దగ్గు, జలుబు సైనటీస్ లక్షణాలు
సైనటీస్‌తో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
సైనస్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మెడిసిన్ వాడితే తగ్గుతుంది. దీని లక్షణాలు తెలియక గుర్తించడం ఆలస్యం అయితే ఆపరేషన్ తప్పదు. ఈ సైనటీస్ ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్లు జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్య లేని వారు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అందరికీ ఉంటాయి. ముఖ్యంగా దుమ్ము, ధూళి ప్రాంతాల్లో పని చేసే వారికి.
* నీటిని ఎక్కువగా తాగడం వల్ల నాసికా మార్గాలు క్లియర్ అయ్యి సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
* రోజూ ఉదయం, సాయత్రం వేడి నీటిలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పట్టాలి.
* ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి తాగితే సమస్య తగ్గుతుంది.
* ఒక కప్పు నీటిలో పావు టీస్పూన్ పసుపు వేసి బాగా మరిగించి డికాషన్ లా కాచి తాగుతుండాలి. రోజుకు రెండుసార్లు ఇలా తాగితే సైనస్ తగ్గుతుంది.
* నీళ్లు బాగా మరిగించి అందులో తురిమిన అల్లం వేసి 7 నిమిషాల పాటు అలాగే ఉంచాక వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తాగాలి. ఈ విధంగా రోజుకు రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.