ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య నడుము నొప్పి. నడుము నుంచి మెడ వరకు ఉన్న వెన్నుముకలో వచ్చే నొప్పి చోటును బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. వాటిలో స్పాండిలైటిస్, స్పాండిలోసిల్ అనేవి రెండు రకాలు ఉన్నాయి. ఓ రకమైన ఆర్థ్రైటిస్‌నే స్పాడిలైటిస్ లేదా స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడభాగములో అయితే సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. నడుము నొప్పి అయితే స్పాండిలోసిస్ అని, ఇవి వెన్నులోని డిస్క్‌ల అరగుదల, క్షీణించి నొప్పి వస్తే స్పాండిలైటిస్ అంటారు. స్పాండిలైటిస్ ఆర్ధరైటిస్‌కు కారణమవుతుంది. మెడ, భుజాలు లాగినట్టు వీపు పై భాగంలో నొప్పి ఉంటే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.
మెడ మధ్య భాగం, భుజాలు లాగుతున్నట్లుగా లేదా తిమ్మిరిగా అనిపిస్తున్నాయా? అయితే, అది సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు. ఆఫీసులో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఎక్కువ సేపు కూర్చొని పనిచేసేవారిలో ఈ సమస్య కనిపిస్తోంది. గత రెండేళ్లలో ఈ కేసులు బాగా పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. రోజూ 2గంటల కంటే ఎక్కువ సేపు బైక్ నడిపినా ఈ సమస్య ఏర్పడుతుందట. ఎక్కువ సేపు కూర్చొని ఉండటం వల్ల మన వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఆ ప్రభావం మెడ వరకు చూపిస్తుంది. దీంతో ‘సర్వైకల్ స్పాండిలైటిస్’కి దారితీస్తుంది.
‘సర్వైకల్ స్పాండిలైటిస్’ కారణాలు
2గంటల కంటే ఎక్కువ సేపు బైక్ డ్రైవింగ్.
వెన్నెముకకు క్షయవ్యాధి వ్యాపించడం. దీన్ని అంకిలైజింగ్ స్పాండిలైటిస్ అంటారు.
అధిక బరువులను ఒకేసారి ఎత్తడం.
వయసు పెరగడంతో వెన్నెముక డిస్క్‌ల అరుగుదల
ఎక్కువ సేపు కూర్చొని ఉండటం.
వెన్నెముకకు దెబ్బ తగలడం.
సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు
మెడ కండరాలు బిగిసుకు పోవడం
మెడ నొప్పితో తల కదల్చడం కష్టం కావడం
చేతి కండరాలు బలహీనపడటం
మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు
మూత్రవిసర్జనలో నియంత్రణ కోల్పోవడం
కొందరిలో కళ్లు తిరుగుతాయి
భుజాలు, చేతి వేళ్ల స్పర్శ తగ్గిపోవడం
సరిగ్గా నిద్రపట్టకపోవడం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు;నివారణ(చికిత్స):
* చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు మెడ కిందకు వాల్చకుండా సరైన భంగిమలో కూర్చోవాలి.
* గంటల తరబడి అలాగే కూర్చోకుండా గంటకొకసారి అటూఇటూ తిరగాలి.
* నిద్రపోయే సమయంలో తల కింద అనువైన దిండు పెట్టుకోవాలి.
* యోగా, వ్యాయామం చేస్తూ మానసిక ఆందోళన లేకుండా ప్రశాంత జీవనం గడపాలి.
* మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లలో ముంచిన మెత్తటి బట్టతో కాపడం పెట్టుకోవాలి.
* ఐస్ ముక్కను క్లాత్‌లో చుట్టి దీనితో కాపడంతో కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
* మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు చేసే పని ఆపి వాటికి విశ్రాంతి తీసుకోవాలి.
* ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.