మోరుసుపల్లి షర్మిలా శాస్త్రి అంటే ఎవరికీ తెలియదు.కానీ డా.వైఎస్సార్ కూతురిగా షర్మిల అందరికీ సుపరిచితమే.అయితే తన తండ్రిగారు ఉన్నప్పుడు తాను ఎక్కువగా రాజకీయాలలో కనిపించలేదు.తను పుట్టింది 1974 లో ఈమెను ఎక్కువగా వై.ఎస్ షర్మిల అనే పిలుస్తారు,కానీ షర్మిల శాస్త్రి అని ఎవరూ పిలవరు.
వ్యక్తిగత జీవితం
షర్మిల వైఎస్.రాజశేఖర రెడ్డి,విజయమ్మ దంపతులకు 1974 లో జన్మించారు.ఆమెకు ఒక అన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.ఆమె 1995 లో అనిల్ కుమార్ ను వివాహం చేసుకున్నారు.తర్వాత ఆమెకు ఒక కొడుకు,కూతురు జన్మించారు.ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో తన భర్తా,తల్లి,పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.
రాజకీయ జీవితం
ఈమె రాజకీయ జీవితం 2012 జూన్ లో తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోవడంతో తన తల్లితో కలిసి పార్టీ తరపున ప్రచారం చేపట్టి వార్తల్లోకి వచ్చారు. అంటే తన రాజకీయ జీవితాన్ని అప్పుడు మొదలుపెట్టారు.
తన అన్న గెలవడం కోసం ఆమె అక్టోబర్ 18 2019 న ఇడుపులపాయ నుంచి పాదయాత్రను మొదలుపెట్టి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆమె తన పాదయాత్రను ఆగస్టు 4 2013న ఆపివేశారు. ఆమె 14 జిల్లాలలో పర్యటించారు. తన అన్న గెలవడం కోసం ఆమె చేసిన పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లిపోవాలి అంటూ బై బై బాబు అంటూ బస్సు యాత్రను చేపట్టారు అలాగే బై బై బాబు పేరుతో 1553 కిలోమీటర్లు పాదయాత్ర జరిపి 39 పబ్లిక్ అడ్రస్సులను కవర్ చేసింది. అలాగే ఆమె 20,000 ఆటోగ్రాఫ్ క్యాప్ లను కూడా అందజేసింది.
కానీ తన అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగత విభేదాల వలన మరే విభేదాల వల్లనో తను అన్న నుంచి విడిపోయింది. ఆమె వెంట ఆమె తల్లి కూడా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.
ఆ తర్వాత ఆమె ఫిబ్రవరి 2021 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడైన తన అన్నతో తనకు రాజకీయ వివాదాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి లేదని ఆమె చెప్పడం జరిగింది.
తెలంగాణలో జూలై 8 2021న కొత్త రాజకీయ రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ఏప్రిల్ 9న 2021న షర్మిల చెప్పారు. తన తండ్రి పుట్టిన రోజు కాబట్టి ఆ రోజును ఆవిడ ఎంచుకున్నారు. అలాగే ఆమె టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణలో పోరాడడానికి సిద్ధపడ్డారు.
ఆ తర్వాత పార్టీని స్థాపించి జూలై 8 2021న ఆమె తెలంగాణలో పార్టీని ప్రారంభించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కెసిఆర్ పై షర్మిల ధ్వజమెత్తారు అలాగే ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తూ ఉద్యోగుల కోసం ఉద్యమకారుల కోసం ఆవిడ ఎన్నో రకాలుగా కేసీఆర్ గారిని ప్రశ్నించడం జరిగింది.
కానీ తనకు ఎవరూ మద్దతు ఇవ్వకపోవడం, అలాగే ఎక్కువ మంది ఆసక్తి చూపకపోవడం వల్ల తమ పార్టీకి ఓట్లు వేయమని అడిగితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని కొందరు పెద్దలు చెప్పడం వలన ఆమె తాను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అన్నట్టుగా వెల్లడించింది.
కానీ అప్పటికే ఆమెకు మద్దతుగా నిలిచిన కొంతమంది వ్యక్తులు నిరసన తెలిపారు. ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తమ ఆస్తులు అమ్ముకొని మరి షర్మిలకు మద్దతుగా నిల్చామని, కానీ ఇలా మధ్యలో పార్టీని వదిలేయడం వల్ల తాము చాలా నష్టపోయామని కార్యకర్తలు, ఆమెను నమ్మినవారు చాలా ఆందోళన చేశారు. ఆమెపై పలు కేసులు కూడా పెట్టారు.
షర్మిల తెలంగాణలో ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఆమెను ఎన్నో విధాలుగా అణచివేయాలని చూసింది.అరెస్టు చేయడం కారులో ఉన్నామెను పోలీస్ స్టేషన్ కి తీసుకు జెసిబి తో తీసుకు వెళ్లడం చేయడంతో ఆమెకు మద్దతుగా ఉన్న ఆమె తల్లి విజయమ్మ ఇంట్లోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ తర్వాత కొంతమంది ప్రోధ్బలంతో ఆమె బయటకు వచ్చారు.
బయటకు వచ్చిన తర్వాత షర్మిలకు కాంగ్రెస్ పెద్దలు సూచనలు చేయడంతో తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు, అలాగే తనకు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆమె అవసరం మాకు ఏమీలేదు అని వాళ్ళ పార్టీ విలీనం చేయాల్సిన పనిలేదని తెగేసి చెప్పడంతో ఆవిడ మీన్నకుండిపోయింది. తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు మాత్రమే ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
అప్పుడు షర్మిల ముఖ్యమంత్రిగా అవుతుందని కొందరు అనుకున్నారు. కానీ అసలు పార్టీని విలీనమే చేయడం వద్దన్నా రేవంత్ రెడ్డి ఆమెను ఎలా ముఖ్యమంత్రి చేస్తారు? అని ఆలోచించిన పెద్దలు ఆమెకు ఏ పదవి ఇవ్వకుండా అసలు అలాంటి పార్టీ అనేది ఒకటి ఉందని కూడా ఆలోచన లేని వారు ఆమెకు ప్రాధాన్యత ఇవ్వలేదు.
దాంతో ఆవిడ తన నిర్ణయాన్ని మార్చుకొని తాను ఏపీ కాంగ్రెస్ లో చేరతానని మీడియా ముఖంగా వెల్లడించారు. దీనికి అధిష్టానం కూడా సరే అనడంతో షర్మిల జనవరి 4న మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో తన వైఎస్ఆర్సిటీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. అప్పుడు కూడా చాలా వదంతులు బయటకు వచ్చాయి.ఆమె ఒక్కరే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని తన భర్త కండువా కప్పుకోవడానికి సుముఖంగా లేరని అనేక వదంతులు వచ్చాయి. అయినా వాటన్నిటిని కొట్టిపడేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం చూసి అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ రూపే లేదు ఇక్కడకి వచ్చి తానేం చేస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. బహిరంగంగానే ఈ మాటలన్నీ మాట్లాడినా కూడా షర్మిల ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, ఆ తర్వాత 2024 జనవరి 16న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిలను అధిష్టానం నియమించింది.
ఆ తర్వాత షర్మిల బాధ్యతలు చేపట్టి విజయవాడ వరకు వెళ్లారు విజయవాడ వెళ్లేముందు తను తన తండ్రి గారి ఆశీర్వాదం తీసుకున్నారు.ఇంతకీ షర్మిల ఇటు తెలంగాణలో ఏమీ చేయలేకపోయారు.
మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. అయితే కొందరి గుసగుసల మేరకు చంద్రబాబు ఇదంతా చేస్తున్నాడని ఒక కథనం.అన్నా చెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టేందుకు చెల్లెను బాణంగా వాడుతున్నాడని కొందరి ఉవాచ.
కానీ ఈ మధ్యనే షర్మిల తన కొడుకు పెళ్లి చేసింది. ఆ పెళ్లికి తన అన్నను కుటుంబ సమేతంగా పిలవడం వాళ్లు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అన్నా చెల్లెలు ఇద్దరు కలుస్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నాడా? అనేది మాత్రం ఎవరికీ తెలియని బహిరంగ రహస్యం.
అయితే షర్మిల మాటలు బట్టి చూస్తే అందరూ జగన్ రెడ్డి అంటే ఫీలవుతున్నారు కాబట్టి నేను జగనన్న అనే అంటాను. అని వాఖ్యానించడం తిరిగి తన వారి బంధాన్ని కలుపుకోవాలనే ఉద్దేశం ఉందా?అనేది మరొక పెద్ద ప్రశ్న?
ఏది ఏమైనప్పటికీ అసలు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనేది లేనప్పుడు ఈ షర్మిల వెళ్లి ఏం చేస్తుంది? ఎవరిని ఓడిస్తుంది? షర్మిల వల్ల టిడిపి జనసేన, లేదా జగన్ ప్రభుత్వం ఓడిపోతుందా? ఆమెకి అంతశక్తి ఉందా? కాంగ్రెస్ పూసే లేని ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతలు చేపట్టిన షర్మిల ఏం చేయబోతున్నారు? అనేది అందరి మనసులో ఉన్న పెద్ద ప్రశ్న.?
ఒకవేళ నిజంగానే చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని అనుకున్నట్లయితే ఎందుకు చంద్రబాబు షర్మిలను వాడుతున్నాడు అనేది ప్రశ్నార్థకమే?ఎందుకంటే ఎప్పుడో రెండేళ్ల క్రితం విడిపోయిన అన్నా చెల్లెలు తిరిగి పెళ్లితో ఒకటయ్యారని అనుకోలేము.
ఎందుకంటే సమాజం కోసం కేవలం పెళ్లికి మాత్రమే వచ్చి వెళ్లిపోయిన సీఎం జగన్ తిరిగి తన చెల్లిని, తల్లిని ఆదరిస్తారనే నమ్మకం ఎవరికీ లేదు.అలాంటప్పుడు షర్మిల ఏం చేసినా జగన్ ఎందుకు పట్టించుకుంటాడు. అసలు షర్మిల జగన్ కి ఒక సమస్య కానేకానప్పుడు చంద్రబాబు వదిలిన బాణం షర్మిల ఎందుకు అవుతుంది?అంటే ఇదంతా వట్టి పుకారు అన్నమాట.
కానీ నిజంగా చంద్రబాబు షర్మిలను ఉపయోగిస్తే అతనికి వచ్చే లాభం ఏమిటీ?అల్రెడీ పవన్ కళ్యాణ్ తో జనసేన పొత్తు ఉంది కాబట్టి షర్మిల వల్ల అసలు ఎలాంటి ఉపయోగం లేదు అనేది నిజం.అయితే షర్మిల గారిని చాలా మంది తెలంగాణలో ఏమి చేయలేకపోయారు,ఇప్పుడు ఆంధ్రాలో ఏం చేస్తుంది అంటూ బాహాటంగా విమర్శించడం చేసారు.
పాద యాత్ర అంటే పాదాల పై నడిచే యాత్ర నుండి మొన్నటి విలీనం అనే మాట వరకు చాలా ట్రోల్స్ చేశారు. అయినా ఎవరికీ భయపడకుండా,ఎవరెన్ని మాటలు అన్నా కూడా ఒక తెగింపుతో ముందుకు వెళ్తుంది షర్మిల.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పై, ఆఖరికి తన అన్న పై కూడా మండి పడుతూ ప్రశ్నలను సంధిస్తుంది.
కానీ ఆ ప్రశ్నలకు జగన్ తరపు మంత్రులు కౌంటర్ లు వేస్తూ,ఇష్టమొచ్చినట్లు షర్మిలను ఆడుకుంటున్నారు.రాష్ర్తన్ని అప్పుల పాలు చేతులారా చేసింది జగనే అని షర్మిల జగన్ పై మండిపడ్డారు.దానికి కూడా అందరూ ఆమె పై మండి పడ్డారు.అయినా తమ కుటుంబం చీలడానికి కారణం తన అన్నేనని,తానూ చేసిన పాదయాత్ర సమయంలో ఇస్తానన్న పదవులు ఇవ్వకుండా మోసం చేసాడు అని వైఎస్.షర్మిల ఆవేదన చెందడంలో అతిశయోక్తి లేదు.నిజంగా అండగా ఉండాల్సిన అన్న చెల్లిని,తల్లిని వదిలేయడం కాస్త బాధాకరమైన విషయమే.
అయినా తన అన్నకు అవసరం వస్తే ఎప్పటికైనా అండగా ఉంటాను అని,తన స్వలాభం కోసం కాకుండా తన తండ్రి పేరును నిలబెట్టడానికి కృషి చేస్తే చాలని,
తన తండ్రి పేరును నిలబెడితే చాలు.వైఎస్సార్ కు మంచి పేరు ఉంది.దాన్ని చెడగోడితే మాత్రం ఊరుకోనని,ఇప్పటికీ కూడా పథకాలు వైఎస్సార్ పేరు మీదనే సాగుతున్నాయని, కానీ ఆ పథకంలో తండ్రి ఫోటో లేకుండా తన ఫోటో వేసుకోవడం మానేయమని షర్మిల అన్నారు.అలాగే ప్రశించే అధికారం,హక్కు తనకు ఉన్నదని షర్మిల అన్నారు.ఇవన్ని పక్కన పెడితే అసలు నిజం ఏమిటని మాట్లాడుకుందాం..
కాకపోతే ఇక్కడ మనం నిజం మాట్లాడుకోవాలి అంటే జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అతని పాలన వల్ల ప్రజలు చాలా వరకు విసిగిపోయి ఉన్నారు. కాబట్టి తిరిగి చంద్రబాబు రావాలని అందరూ కాంక్షిస్తున్నారు అనేది పచ్చినిజం. కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరికి పోటీ కాదు. ఎవరి ప్రయత్నాలు వారివే తీర్పు మాత్రం ప్రజలు ఇస్తారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమంటారు.. ఇది కేవలం ప్రజల అభిప్రాయాల కోసం మాత్రమే రాసింది ఎవరిని కించపరచడానికో లేదా ఉద్దేశించి మాత్రం రాసింది కాదు..