HEALTH & LIFESTYLE

చన్నీళ్లతో స్నానం.. ఈ లక్షణాలుంటే ప్రమాదం

శీతాకాలంలో ఎముకలు కొరికే చలిలో చన్నీళ్లతో స్నానం చేయాలంటే అదో నరకం. కొంతమంది వేడి నీళ్లతో స్నానం చేస్తారు. కొంతమంది చన్నీళ్ళతో మాత్రమే స్నానం చేయడం అలవాటుగా ఉంటుంది. ఇలాంటి వాళ్లకు చలికాలంలో ప్రమాదం అనే చెప్పాలి.

ఎక్కువ చలిలో చల్లటి నీటితో స్నానం చేస్తే పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పక్షవాతం, బ్రెయిన్‌స్ట్రోక్ ఎప్పుడైనా రావచ్చు. కానీ, శీతాకాలంలో వచ్చే అవకాశం ఎక్కువని, మెదడులో రక్తస్రావంతో మూర్ఛపోవడం జరుగుతందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తిమ్మిర్లు, కళ్ళు స్పష్టంగా కనబడకపోవడం, బలహీనత, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వికారం, మాటలు తడబాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే చల్లటి నీళ్లతో స్నానం చేయకపోవడం మంచిది.

హీటర్ వాటర్ మంచిదేనా?

ప్రస్తుతం స్నానం చేసే నీటిని, తాగే నీటిని వేడి చేసుకొని వినియోగిస్తున్నాం. ఒకప్పుడు పొయ్యి మీద నీళ్లు వేడి చేసేవారు. కానీ, ఇప్పుడు రకరకాల పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం గీజర్‌లు, ఇమ్మర్షన్ వాటర్ హీటర్లు విరివిగా వాడుతున్నారు. చౌకగా లభించడంతో ప్రస్తుతం ఇమ్మర్షన్ హీటర్స్ వాడుతున్నారు. ఇలా కరెంట్‌తో వేడి చేసిన నీళ్లు ఆరోగ్యానికి హానికరం అనే అపోహ చాలా మందికి ఉంది. కానీ అది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు.

నీటిని మంటపై వేడి చేసినా, హీటర్‌తో వేడి చేసినా ఎలాంటి ప్రమాదం లేదట. హీటర్‌లో కాయిల్ నుంచి విద్యుత్ నీళ్లలోకి ప్రవహించకుండా సిలికా పొరను పూస్తారు. ఈ సిలికా కోటింగ్ తొలగిపోతే కరెంట్ నీళ్లలోకి పాస్ అయ్యి చేయి అందులో పెట్టినప్పుడు షాక్ కొడుతుంది. అందుకే ఇమ్మర్షన్ వాటర్ హీటర్ ఎక్కువ రోజుల పాటు వాడొద్దు.

అంతేకాదు రోజూ వేడినీటి స్నానం చేస్తే, ఆరోగ్య సమస్యలు తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. గోరువెచ్చటి నీటితో ఒంటి నొప్పులు తగ్గి, మంచి నిద్ర పడుతుంది.  

Show More
Back to top button